ఆమె పేరు సురనా అయ్యర్… కాంగ్రెస్ లీడర్ మణిశంకరన్ అయ్యర్ బిడ్డ… తెలిసిన సమాచారం మేరకు ఆమె న్యాయవాది… చాలామంది లౌకికవాదుల్లాగే హిందూమతం అంటే ద్వేషం… సరే, ఆమె ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది… ఎందుకంటే..? మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా… దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె జనవరి 20 నుంచి 23 వరకు నిరసన దీక్ష చేసింది…
ఇదేమిటమ్మా అంటే… ఆలయ నిర్మాణానికి నిరసనగా ముస్లింలకు సంఘీభావంగా… హిందూవాదం, జాతీయవాదం పేరిట పెరుగుతున్న మత ఆధిపత్య పోకడలకు నిరసన అని చెప్పింది… ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు కూడా పెట్టింది… అసలే మతవిషం వ్యాప్తి చెందుతోంది, ఈ స్థితిలో ఒక నిజమైన భారతీయురాలిగా, ఒక నిజమైన హిందువుగా హిందూ ఆధిపత్య ధోరణుల్ని నిరసిస్తున్నానని పేర్కొంది…
Ads
సరే, తరువాత ఏం జరిగింది..? ఆమె నివసించే జంగ్‌పుర కాలనీకి చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆమెకు నోటీసు జారీ చేసింది… పాకిస్థాన్ నుంచి సర్వం కోల్పోయి, ఇక్కడికి వచ్చి, ప్రశాంతంగా, నిర్భయంగా బతుకుతున్నవాళ్లు ఎక్కువ… నీ చర్యలతో ఈ ప్రశాంతతను భగ్నం చేస్తున్నావు… క్షమాపణ చెబుతావా..? లేదంటే ఈ కాలనీ విడిచిపెట్టి వెళ్లు, నీ మాటలను నీ చేష్టలను సహించే మరో కాలనీ వెతుక్కో అని ఆ నోటీసు సారాంశం…
నీ వైఖరి ఇలాగే ఉంటే మాకు ఇబ్బందికరం… నీలాంటి ద్వేషులను సహించే కాలనీలు దొరుకుతాయి… అక్కడికి వెళ్లిపో… అని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జారీ చేసిన నోటీసు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది… ఒకరకంగా ఆమెకు తను నివసించే లొకాలిటీ కాలనీ బహిష్కరణను విధిస్తోందన్నమాట…
ఇండియాటుడే ఆమెను దీనిపై స్పందన కోరినప్పుడు… అసలు నోటీసు జారీ చేస్తున్న సదరు వెల్ఫేర్ అసోసియేషన్‌కూ తను నివసిస్తున్న లొకాలిటీకి అసలు సంబంధమే లేదని చెప్పింది… అంతేకాదు, తన ఫేస్ బుక్ వీడియోల్లోనే తన స్పందనను చెప్పేస్తున్నాననీ, దాన్ని మించి చెప్పడానికి ఏమీ లేదనీ, తన వీడియోల్లోనే తన వివరణ కూడా ఉందని పేర్కొంది…
వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెను కలిసి అడిగినప్పుడు కూడా ఆమె నుంచి సరైన సమాధానం రాలేదట… ‘తను ఓ చదువుకున్న వ్యక్తిలా మాట్లాడలేదు… రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి… ద్వేష ప్రసంగాలు, విషపు చర్యలను ఆమోదించేది లేదు’ అంటోంది ఆ అసోసియేషన్…
అసోసియేషన్ తనకు, తన తండ్రి అయ్యర్‌కు ఒక విజ్ఞప్తి చేసింది… ‘మంచి పౌరులుగా వ్యవహరించండి… ప్రశాంతతను భగ్నం చేయకండి… మీ బిడ్డ చర్యల్ని మీరు ఖండించాలి… ఆ బాధ్యత మీది… మీ బిడ్డ ఆలోచన ధోరణి మా కాలనీకే కాదు, సొసైటీకి కూడా మంచిది కాదు’ అని దాని సారాంశం… (న్యూస్ సోర్స్ :: ఇండియాటుడే)
Share this Article