Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!

September 4, 2026 by M S R

మిత్రుడు చౌడారపు రామకృష్ణ ఫేస్ బుక్ పోస్టు… ఇంట్రస్టింగు… ఏమిటంటే? గణితంలో తిర్యగ్రేఖ- రాజకీయ గణితంలో సురేఖ… ఫస్ట్ అర్థం కాలేదు… అసలు తిర్యగ్రేఖ అంటే ఏమిటో కాస్త వివరం తెలుసుకుంటే… అవును కదా, సురేఖకు ఇది బాగానే వర్తిస్తుంది అనిపించింది… తిర్యగ్రేఖ అంటే ఇంగ్లిషులో Transversal Line …

మూమూలు మ్యాథ్స్, అంటే గణితంలో తిర్యగ్రేఖ అంటే… గణితంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను (లైన్లను) వేర్వేరు బిందువుల వద్ద ఖండించే రేఖను తిర్యగ్రేఖ (Transversal) అంటారు…  ఎందుకంటే సూటి రేఖకు, లేదా సరళ రేఖకు ఒకే దిశ ఉంటుంది. తిర్యగ్రేఖకు మాత్రం దారిలో ఎదురయ్యే ప్రతి రేఖతో ఏదో ఒక చోట ఖండన ఉంటుంది…

మంత్రి కొండా సురేఖ రాజకీయ ప్రయాణం కూడా అచ్చం అలాంటిదేనా? ఆమె కెరీర్ చూస్తే అలాగే అనిపిస్తుంది… మొదట్లో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్ బాగా ప్రోత్సహించాడు, అప్పుడు ఆమె ఓ ఫైటర్… వైఎస్ మరణించాక రోశయ్య లైన్‌ను కట్ చేసింది… తరువాత బీఆర్ఎస్… తరువాత కాంగ్రెస్… ఇప్పుడు రేవంత్ రెడ్డి లైన్‌ను కట్ చేసింది…

Ads

susmitha

దాంతో ఏమొచ్చింది..? ఏమీ రాలేదు… రోశయ్యను వ్యతిరేకించి, సీఎంగా ఆయన మొహం చూడాలని కూడా లేదు అని వ్యాఖ్యానించినప్పుడూ ఏమీ రాలేదు… ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసినా ఏమీ రాలేదు… పైగా ఉన్న పదవి ఊడింది… ఇదే తిర్యగ్రేఖ సిద్ధాంతం, పోకడ…

ఓసారి సినిమా వాళ్లతో వివాదం (నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు)… తరువాత సొంత పార్టీ నాయకులపైనే సొంత జిల్లాల్లో విభేదాలు… ఇప్పుడు ఏకంగా సీఎంపైనే దాడి… వెరసి… ఏం ఒరిగింది..? ఏమీ లేదు… తిర్యగ్రేఖ సాధించేదేమీ ఉండదు… గణితంలో గానీ, రాజకీయ గణితంలో గానీ…

తిర్యగ్రేఖ

….. అలా ఆమె వ్యాఖ్య ఒకటి బయటకు రావడం ఆలస్యం… రాజకీయాల్లో మరో కొత్త కోణం తెరపైకి రావడం ఖాయం అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది… ఇక్కడ అసలు ఇబ్బంది సురేఖగా మాట్లాడటంలో లేదు. మంత్రి మాట్లాడటం తప్పు కాదు. కానీ మంత్రి మాట్లాడిన ప్రతి మాట ఒక కొత్త రాజకీయ సమస్యను సృష్టిస్తేనే అసలు సమస్య!

ఓ సాదాసీదా నాయకుడి మాటకూ ఓ మంత్రి వ్యాఖ్యకూ తేడా ఉంటుంది… దాని పరిణామాలు కూడా అలాగే ఉంటాయి… ఓ మామూలు నాయకుడు ఏం మాట్లాడినా పెద్ద ఫరక్ పడదు, ఎవరూ పట్టించుకోరు, కానీ ఓ మంత్రి మాట్లాడితే దానికి ఓ విలువ ఏర్పడుతుంది… ఫలితం కనిపిస్తుంది… ఉల్టా కావచ్చు కూడా…

బర్తరఫ్ చేస్తే చేశారు, నేను మాత్రం కాంగ్రెస్ వీడను అంటోంది… అంటే పార్టీలోనే ఉంటూ చికాకు పెడతాను అన్నట్టుగా…! అక్కడే సురేఖ ‘తిర్యగ్రేఖ’ సిద్ధాంతం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతుందా అన్న ప్రశ్న వస్తోంది… పార్టీ రేఖ ఒకటి… సురేఖ రేఖ మరొకటా?

konda

ప్రతి రాజకీయ పార్టీకీ ఒక అధికారిక రేఖ (Line) ఉంటుంది. ప్రభుత్వ విధానం ఒక రేఖ. పార్టీ వ్యూహం మరో రేఖ. మంత్రుల మాటలు ఇంకో రేఖ. ఇవన్నీ ఒకే దిశలో సాగితేనే ప్రభుత్వం, పార్టీ ఒకే మాట మీద ఉన్నాయనే భావన ప్రజల్లో ఉంటుంది. కానీ వాటిని మధ్యలో ఖండిస్తూ మరో రేఖ వెళ్తే? అదే తిర్యగ్రేఖ! సురేఖ విషయంలో ఇప్పుడు రాజకీయ చర్చ కూడా ఇక్కడికే వచ్చి చేరుతోంది.

konda

బూమరాంగ్ అంటే తెలుసు కదా… ఎవరిపైనో ప్రయోగిస్తే, అది టార్గెట్‌ను తాకితే ఓకే, కానీ తిరిగి రువ్వడిగా వచ్చి తననే తాకితే..? ఇప్పుడు సురేఖ పరిస్థితి ఇదే… నిజానికి వివాదం ఆమెను వెతుక్కుంటూ వస్తుందా… ఆమె వివాదాన్ని వెతుక్కుంటూ వెళ్తుందా? ఇదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న… పార్టీలోనే ఉంటూ తలనొప్పులు క్రియేట్ చేస్తే ఆమె రేఖ తిరగబడే ప్రమాదం ఉంది… అప్పుడు దాన్ని తిర్యగ్రేఖ అనరు, మరో పేరు వెతకాలి!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?
  • సర్కారూ బీ అలర్ట్ ! సన్నబియ్యం ధర వందకు చేరే సూచనలు !!
  • తిను, తినను… ఇదేం తెలుగు భాషరా మీ మొహాలు మండా…
  • ఆటే సవాల్ అన్నాడు నాగార్జున – అంతే, ఆట చూడటమూ సవాలే !!
  • ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే… కేసీయార్ మరో బిగ్ బ్లండర్…
  • మన జేమ్స్ బాండ్… ‘దురంధర్‌’ల నిర్మాత… తెరపైకి ఆ మహా గూఢచారి!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions