.
ముందుగా సీనియర్ జర్నలిస్టు Murali Buddha
పోస్టు చదవండి… తరువాత ఈనాడు ప్రచురించిన ఓ ఫోటో రైటప్ చదవండి దిగువన…
Ads
ఓ వ్యక్తి వద్ద అట ?
ప్రపంచానికంతా తెలిసింది ఈనాడు వారికి తెలియక పోవడం ఓ విచిత్రం ..
ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పడిపోయిన ఓ వ్యక్తి వద్ద రోదిస్తున్న మహిళ అట ..
ప్రతి ఛానల్ , అన్ని భాషల మీడియా ఈ ఫోటోను హైలెట్ చేసింది .
వారికి ఈ నెల 19న పెళ్లి అయింది . అతని పేరు వినయ్ … ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు . పక్కన రోదిస్తున్నది అతని భార్య ..
ఈనాడు రెండు లైన్ల క్యాప్షన్ లో అన్ని తప్పులా ?
కాల్పుల్లో పడిపోయాడా ? కాల్పుల్లో మరణించిన వ్యక్తిని పడిపోయాడు అంటారా ?
ఓ వ్యక్తి వద్ద రోదిస్తున్న మహిళ అట ?
భర్త కాల్పుల్లో మరణిస్తే భార్య రోదిస్తుంటే ఓ వ్యక్తి మరణిస్తే ఒక మహిళ రోదించడమా ?
బాబు 75 ఏళ్ళ జన్మదిన ప్రత్యేక సంచిక మీద అంత శ్రద్ద పెట్టిన వారు దేశాన్ని కదిలించిన హృదయ విదారక దృశ్యం మీద ఇంత నిర్లక్ష్యమా ?
ఇదుగో ఆ ఫోటో రైటప్…
అక్షరాలా నిజం కదా… పొద్దున ఈనాడు చదవగానే అందరికీ అనిపించింది ఇదే… ఈనాడు ఒకప్పుడు తెలుగు పాత్రికేయానికి దిక్సూచి, మార్గదర్శి… ఇప్పుడు తనకే ఏ దిక్కూ తెలియని పయనం…
చివరకు ఫస్ట్ పేజీ కంటెంటు కూడా సరిచూసుకునే స్థితిలో లేదు ఈనాడు… తెలుగులో నంబర్ వన్ అని చెప్పుకునే పత్రిక దురవస్థే ఇలా ఉంటే, దాన్ని చూసి వాతలు పెట్టుకునే మిగతా పత్రికల గురించి ఇక చెప్పుకోవడమే వేస్ట్ అన్నట్టుగా ఉంది పరిస్థితి…
పైగా భిన్నమైన కోణాల్లో కూడా పెద్దగా ప్రజెంటేషన్ కనిపించలేదు… ఉన్నంతలో ఆంధ్రజ్యోతి కాస్త బెటర్… (తెలుగు పత్రికల్లో)… చిన్న చిన్న డిజిటల్, వాట్సప్ ఎడిషన్లు కూడా సమర్థ పాత్రికేయాన్ని చూపిస్తున్న ఈ రోజుల్లో ఆ పత్రిక ఘన వైభవం అంతా గత వైభవమే…
Share this Article