అంతా మాయ అనిపిస్తోందా..? టీన్యూస్ యాడ్ మెటీరియల్ చూశారా..? హైదరాబాద్ సిటీ బార్క్ రేటింగుల్లో ఏకంగా రెండో ప్లేసుకు వెళ్లిపోయింది… ఎన్టీవీ, టీవీ5 మూడు, నాలుగు ప్లేసులకు దిగిపోగా… వీ6 ఐదో ప్లేసుకు పడిపోయింది… బీఆర్ఎస్, సర్వేలు, బీజేపీ ఆగ్రహం, కవిత అరెస్టు ప్రమాదం, నమస్తే తెలంగాణ ఎట్సెట్రా విషయాల్లో కేసీయార్‌కు తలనొప్పులు ఎలా ఉన్నా… టీన్యూస్ మాత్రం రేటింగుల్లో ఎదిగి ఆయనకు కాస్త సంతృప్తి కలిగిస్తోంది…
ఇదెలా సాధ్యం..? టీన్యూస్‌కు అసలు ప్రొఫెషనలిజమే తెలియదు కదా… తెలంగాణ ప్రభుత్వం, కేసీయార్, బీఆర్ఎస్ పార్టీ విధానాల డప్పు తప్ప ఇంకేమీ కనిపించదు కదా అంటారా..? అదే అడిగితే ‘‘జనం యాంటీ- బీజేపీ స్టోరీల పట్ల ఆసక్తిగా ఉన్నారు… మేం తీసుకున్న ఆ లైన్ వల్ల జనం మా చానెల్ వైపు వస్తున్నారు’’ అంటున్నారు టీన్యూస్ ముఖ్యులు… కొంత రీజనబుల్ వివరణే… ప్రత్యేకించి ఆదానీ, అధికధరలు వంటి అంశాల్లో మోడీ మీద జనానికి అసంతృప్తి పెరుగుతోంది… బీఆర్ఎస్ ఎలాగూ ఇప్పుడు యాంటీ- బీజేపీ పొలిటికల్ స్టాండ్‌తో ఉంది కాబట్టి టీన్యూస్ ఆ వ్యతిరేక వార్తలతో పండుగ చేసుకుంటోంది…
Ads
బార్క్ రేటింగ్స్ మీద చాలామందికి చాలా సందేహాలున్నయ్… కానీ రేటింగ్స్, పాపులారిటీ లెక్కలకు దీన్నే పరిగణనలోకి తీసుకోకతప్పడం లేదు… మొన్నమొన్నటిదాకా టీన్యూస్ రేటింగుల్లో ఎక్కడో ఉండేది… అలాంటిది ఏకంగా సెకండ్ ప్లేసులోకి వచ్చి నిలుచోవడం ఒకింత ఆశ్చర్యమే… వీ6 చానెల్ ఐదో ప్లేసుకు వెళ్లిపోయింది… ఇవి రెండూ ప్రధానంగా తెలంగాణ చానెళ్లు… ఈటీవీ తెలంగాణ న్యూస్ చానెల్ ఒకటి ఉంటుంది గానీ అది పేరుకే… అదెక్కడో సుదూరంగా ఉండీ లేనట్టు కనిపిస్తుంది రేటింగ్స్ జాబితాలో…
స్థూలంగా రెండు రాష్ట్రాల రేటింగ్స్ పరిశీలిస్తే… ఎన్టీవీ జీఆర్పీలు తగ్గి, టీవీ9 జీఆర్పీలు కొద్దిగా పెరిగినా సరే… ఆ రెండింటి నడుమ తేడా భారీగానే ఉంది… ఇప్పట్లో టీవీ9 ఎన్టీవీని కొట్టే పరిస్థితి కనిపించడం లేదు… టీవీ5 పేరుకు మూడో ప్లేసులో కనిపిస్తున్నా సరే, ఫస్ట్-సెకండ్ చానెళ్లకన్నా దూరంగా ఉండిపోతోంది… ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటంటే… కేవలం తెలుగుదేశం డప్పుగా భావించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యావరేజ్ జీఆర్పీల్లో వీ6 చానెల్‌ను కొట్టేసి, నాలుగో ప్లేసులో కనిపిస్తోంది… ఎనిమిదో వారం రేటింగ్స్ పరిశీలించినా సరే, వీ6కు అర అడుగు దూరంలో ఉంది… వైసీపీ డప్పు ఎక్కడో ఏడో స్థానంలో బిక్కుబిక్కుమంటూ కనిపించింది…
ఈ చార్ట్ గమనిస్తే తెలుగు వినోద చానెళ్లు, తెలుగు న్యూస్ చానెళ్ల స్థితిగతులు స్థూలంగా అర్థమవుతాయి… వినోద చానెళ్ల సంగతిని మరో కథనంలో చదువుకుందాం…!
Share this Article