ఒక్కసారిగా టీవీ, సినిమా ట్రేడ్ నిపుణులకు పిచ్చెక్కిపోయింది… మహేశ్ బాబు సినిమాయే దానికి కారణం… ఆమధ్య సర్కారువారి పాట సినిమా తీశాడు కదా… సరే, కమర్షియల్‌గా హిట్… 60 కోట్ల దాకా ఖర్చు పెడితే 200 కోట్ల దాకా వసూళ్లు రికార్డయ్యాయి… థియేటర్లలో హిట్… కానీ టీవీల్లో..?
ఇప్పుడు టీవీల్లో ఎవడూ సినిమాలు చూడటం లేదు కదా… వీలున్నప్పుడు తాపీగా ఓటీటీల్లో చూస్తున్నారు, అదే బెటర్ కదా… అందుకని టీవీ ముందు కదలకుండా కూర్చుని, ఆ చెత్త యాడ్స్ భరిస్తూ సినిమాలు చూసే అలవాటు వేగంగా పోతోంది… అందుకే పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు సైతం టీవీ రేటింగ్స్‌లో ఢమాల్ అంటున్నయ్…
ఆర్ఆర్ఆర్ కాస్త నయం… గతంలోని రాజమౌళి సినిమాలతో పోలిస్తే ఈ 19 రేటింగ్స్ చాలా తక్కువే, కానీ ఇటీవల ట్రెండ్స్‌లో చూస్తే ఆర్ఆర్ఆర్ రేటింగ్స్ కాస్త నయమే అనుకోవాలి… తరువాత కేజీఎఫ్-2 ఘోరమైన రేటింగ్స్ (6.5) నమోదు చేసుకుంది… ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల వసూళ్లు చేస్తేనేం, టీవీలో ఆ సినిమా చూసినవాడు దిక్కులేడు…
Ads
ఇక కమలహాసన్ విక్రమ్ మరీ దారుణమైన రేటింగ్స్… 3.8 రేటింగ్స్… అంటే స్టారాధిస్టార్లున్నా, భారీ సినిమాలున్నా సరే జనం టీవీల్లో సినిమాలు చూడటానికి ఇష్టపడటం లేదు అని అర్థం… తెలుగు సినిమాల టీవీ రేటింగ్స్ లెక్కలు తీస్తే, ఇటీవల ఇదే ట్రెండ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది… పెద్ద సినిమాలే ఇలా ఉంటే, ఇక చిన్నాచితకా సినిమాలు దేఖినవాడే లేడు…
ఈ స్థితిలో మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఓ విశేషం ఇప్పుడు… ఫస్ట్ రిలీజులో దెబ్బతిని, సెకండ్ రిలీజులో హిట్టయిన సినిమాలాగా ఉంది పరిస్థితి… ఆమధ్య అక్టోబరులో ఇదే సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా రిలీజ్ చేస్తే 9.45 రేటింగ్స్ వచ్చాయి… ఇప్పుడున్న కటకటలో ఇది కాస్త బెటరే…
కాకపోతే మహేశ్ బాబు సినిమాల్లో అత్యంత ఘోరమైన రేటింగ్స్ సాధించినవి స్పైడర్ (6.7), తరువాత బ్రహ్మోత్సవం, మహర్షి సినిమాలు కూడా దాదాపు అంతే… సో, సర్కారు వారి పాట ప్రీమియర్‌కు 9.45 రేటింగ్స్ రావడం గొప్పే… అయితే విశేషం ఏమిటంటే… మొన్నటి ఆదివారం ఆరో తారీఖున మళ్లీ ప్రసారం చేశారు… సెకండ్ రిలీజ్ అన్నమాట…
హైదరాబాద్ బార్క్ రేటింగ్స్‌లోనే 6.77 రేటింగ్స్ వచ్చింది… ఈసారి మాటీవీ టాప్ 30 జాబితాలో నిలబడింది… గ్రేటే… హైదరాబాదేతర కేటగిరీలు కూడా కలిపితే బహుశా మొత్తం 8.50 వరకూ రేటింగ్స్ ఉండవచ్చు… అంటే ప్రీమియర్ ఫస్ట్ రిలీజుకు వచ్చిన 9.45 రేటింగ్స్‌కు చాలా దగ్గర… నిజానికి సెకండ్ రిలీజ్, అంటే పదే పదే రిపీట్ ప్రసారాలకు ఇక రేటింగ్స్ ఉండవు… ఐనాసరే, ఈ సర్కారువారి పాటకు ఈ రేటింగ్స్ రావడం ఏమిటి..? ఇదీ విస్మయం…
అంటే ట్రెండ్‌కు భిన్నంగా రేటింగ్స్ రావడం… కొంపదీసి థియేటర్లకు మళ్లీ ఎప్పటిలాగే ప్రేక్షకులు వెళ్లి సినిమాలు చూస్తున్నట్టుగా… టీవీల ముందు కూర్చుని కదలకుండా సినిమాల్ని చూడటం మళ్లీ అలవాటైపోయిందా..? అబ్బే… అంత సీన్ లేదు… రాబోయే కొన్ని సినిమాల రేటింగ్స్ చూద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం…!!
Share this Article