.
ముందుగా ఓ వార్త,… రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలపై థర్డ్ పార్టీ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర విభాగాలపై సర్వే
26 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో, 14 మంది ఆరెంజ్ జోన్లో, మిగతా వారు సేఫ్ జోన్లో ఉన్నారని సర్వే వర్గాలు వెల్లడించాయి… సర్వే ప్రకారం కొంతమంది మంత్రులు వారి నియోజకవర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు…
Ads
రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సందర్శించకుండా, హైదరాబాదులో ఎక్కువ సమయం గడుపుతూ.. వారు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు… మరి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు… వీరిలో 8 నుంచి 10 మంది ఇసుక అక్రమ రవాణా, రియల్ ఎస్టేట్ అక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారని సర్వేలో వెల్లడి…
ఆరెంజ్ జోన్లోని ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమై…, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సర్వే వెల్లడించింది… దావోస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ ఎమ్మెల్యేలతో సమావేశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి…
1. రేవంత్ రెడ్డి అలాంటి వాళ్లందరికీ టికెట్లు నిరాకరించగలడా..? తను చెప్పింది అధిష్ఠానం అంగీకరించి వాళ్లు మారకపోతే వేటు వేస్తుందా..? తను కాదు కదా టికెట్లు ఇచ్చేది..?
2. సదరు ఎమ్మెల్యేలు మారకపోతే రేవంత్ రెడ్డి ఏం యాక్షన్ తీసుకోగలడు..? బొటాబొటీ మెజారిటీ ఉండి, బీఆర్ఎస్ జంపింగ్ ఎమ్మెల్యేల కోసం ప్రయత్నాలు చేస్తున్న స్థితిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఏమనగలడు..?
3. ఏడాదిలోనే ఓ అంచనాకు రాలేం… మొన్నటి ఎన్నికల్లో పెట్టిన ఖర్చు పూడ్చుకోవాలి, మళ్లీ ఎన్నికల కోసం సంపాదించుకోవాలి, నియోజకవర్గంలో కేడర్ మెయింటెయిన్ చేయాలి, రాజకీయాలు అంటేనే తడిసిమోపెడు యవ్వారం… పీత కష్టాలు పీతవి… సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు అనేది నేరం కాదు కదా ఫాఫం…
4. నిజానికి సర్వే జరగాల్సింది ఎమ్మెల్యేల పనితీరు మీద కాదు… స్థూలంగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు మీద… జనాభిప్రాయం… సిక్స్ గ్యారంటీల అమలు తీరు మీద… హైడ్రా, రియల్ ఎస్టేట్, మూసీ, వందల ఎకరాల్లో వక్ప్ పేరిట రిజిస్ట్రేషన్ల నిషేధం ఎట్సెట్రా చాలా అంశాల మీద…
5. రేవంత్ పార్టీ అధిష్ఠానం కాదు… పార్టీలో చాలా వర్గాలుంటాయి… సో, రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, సేఫ్ జోన్ ఏమీ వర్తించవు… అందరూ బఫర్ జోనే…
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు, గెలుపోటములు అనేవి చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి… వర్తమానంలో జరగాల్సిన సర్వే ఇది కాదు… ప్రభుత్వ నిర్ణయాల్లో వేటిని జనం మెచ్చారు, వేటిని జనం తిడుతున్నారు, పరిపాలన మీద పట్టు ఎలా ఉంది..? ఓవరాల్‌గా జనం ఫీడ్ బ్యాక్ ఏమిటి..? ఏడాది దాటింది కదా పగ్గాలు చేపట్టి, అందుకే మొదట తన పాలన మీదే రేవంత్ రెడ్డి థర్డ్ పార్టీ సర్వే చేయించుకోవాల్సింది..! ఏమో… ఆల్రెడీ అధిష్ఠానం కనుగోలు సునీల్ టీమ్ ద్వారా సర్వే చేయించిందేమో..!!
Share this Article