Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…

June 25, 2025 by M S R

.

ముందుగా తమిళ మీడియాలో కనిపించిన ఓ వార్త చదవండి…



2026 తమిళనాడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టాలిన్‌కు ఎక్కువ అవకాశాలు: సర్వే నివేదిక

Ads

‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్’ తమిళనాడులో 2026లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావచ్చు అనే అంశంపై నిర్వహించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 77.83 శాతం మంది స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సర్వేకు సంబంధించి, సంస్థ కోఆర్డినేటర్ తిరునావుక్కరసు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చెన్నైలోని లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులతో కలిసి ఏర్పడిన ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్, ఫిబ్రవరి 5న 234 నియోజకవర్గాల్లో ఈ సర్వేను ప్రారంభించింది. ఈ సర్వే మొదటి దశ 70,922 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఈ నెల 17న పూర్తయింది. ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కార్యకలాపాలు, ప్రజల సమస్యలను పరిష్కరించే పార్టీలు వంటి 10కి పైగా ప్రధాన ప్రశ్నలపై దృష్టి సారించి ఈ సర్వే నిర్వహించబడింది.

తమిళనాడుకు తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న నాయకుల గురించి అడిగిన ప్రశ్నకు, 77.83 శాతం మంది స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. తర్వాతి స్థానాల్లో పళనిస్వామికి 73.30 శాతం, ఉదయనిధికి 67.99 శాతం, అన్నాదురైకి 64.58 శాతం, విజయ్ కి 60.58 శాతం మద్దతు లభించింది.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎవరికి ఓటు వేస్తారని అడిగినప్పుడు, 17.7 శాతం మంది డీఎంకేకు మద్దతు ఇచ్చారు. అన్నాడీఎంకేకు 17.3 శాతం, టీడీపికి 12.20 శాతం, బీజేపీకి 5 శాతం మద్దతు లభించింది. 3.3 శాతం మంది ‘నోటా’కు మద్దతు తెలిపారు.



దినమలర్ పబ్లిష్ చేసిన తమిళ కాపీకి ఇది తెలుగు అనువాదం… సాక్షి కూడా రాసింది ఈ వార్తను యథాతథంగా…

stalin

సరే, నిజంగా అక్కడ పొలిటికల్ సిట్యుయేషన్ ఏమిటనే చర్చ జోలికి వెళ్లడం లేదు గానీ… సగటు రీడర్ కోణంలో ఈ శాతాల్ని ఓసారి కలిపి చూడండి… జస్ట్, ఓ కామన్ రీడర్ యాంగిల్‌లో…

77.83 ప్లస్ 67.99 ప్లస్ 64.58 ప్లస్ 60.58 ప్రధాన అభ్యర్థులకు దక్కిన శాతాలు… శాతం , per cent అంటే వందకు ఎంత అనే కదా లెక్క… మరి ఇది ఎంత అవుతుంది..? పైగా కమలహాసన్ పార్టీ, లెఫ్ట్, ఇతరత్రా పార్టీలు, లీడర్ల లెక్కలు ఇందులో కలపనే లేదు… ఇదెలా..? ఏమో, మెజారిటీ జనం ఇంకా ఈ కొత్త తరహా లెక్కలు, బాష్యాలను ఫాలో కాలేకపోతున్నదేమో…

అలాగే ఏ పార్టీకి ఎంత అవకాశాలు అనే ప్రశ్నకు చూడండి… 17.7 శాతం డీఎంకే ప్లస్ అన్నాడీఎంకే 17.3 శాతం, టీడీపి 12.20 శాతం, బీజేపీక 5 శాతం… 3.3 శాతం ‘నోటా’… 60 శాతం కూడా దాటడం లేదు… హేమిటో… టీడీపీ పేరు తప్పుగా రాసి ఉంటారు, బహుశా విజయ్ పార్టీ టీవీకే కావచ్చు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమే.., అప్పట్లో తప్పలేదుట, తప్పూ కాదుట…
  • రెండేళ్లలో డజను పెళ్లిళ్లు అట… ఆమె నిందితురాలా..? బాధితురాలా..?
  • ఉన్నతాధికారుల పోస్టింగులపై రేవంత్ సర్కారు తెలివైన అడుగులు
  • నిజంగానే ఉత్తరాది రాష్ట్రాలు ఎడాపెడా పిల్లల్ని కనేస్తున్నాయా..?!
  • విజయ్‌కన్నా ఉదయనిధే బెటరట… అవునూ, ఈ లెక్కల తిరకాసులేమిటో…
  • “కాళిదాసు తమిళ్షుడు అవాలనుకుని కణ్ణదాసన్ అయ్యాడు…”
  • హమ్మా… మా తెలుగు ఈగను పోలిన మలయాళ ఈగ క్రియేట్ చేస్తారా..?!
  • హమ్మో అమ్మాయిలా అనుకునే ఈ రోజుల్లో… ఈ టైటిల్, ఈ కథ విశేషమే…
  • నాణ్యతకూ, నమ్మకానికి పేరు హెరిటేజ్… కానీ ఎందుకో ‘పగిలిపోతోంది…’
  • తన పిచ్చి ఆరాధకుడు వర్మకు శ్రీదేవి లీగల్ నోటీస్ ఎందుకిచ్చింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions