Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుప్రీం సరేనంది ! మమత మార్క్ ముస్లిం రిజర్వేషన్లకు తెర !!

July 17, 2026 by M S R

.

మన బెంగాల్‌ను ఓ పశ్చిమ బంగ్లాదేశ్‌లా మార్చేసి, వోట్ల కోసం ప్రొ-ముస్లిం, యాంటీ-హిందూ పాలన సాగించిన మమత బెనర్జీని జనం ఛీకొట్టి దింపేశారు కదా మొన్నటి ఎన్నికల్లో…. తన స్థానంలో ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన సువేందు అధికారి ఆమె దుష్టపాలన ఛాయల్ని చెరిపేయగలడా అనే సందేహం మొదట్లో ఉండేది…

కానీ అందరూ అనుకున్న, ఆశించిన వేగంకన్నా ఎక్కువగా తను దూసుకుపోతున్నాడు… ఎందుకో గానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దృష్టిపెట్టలేదు గానీ, మొన్న సుప్రీంకోర్టులో ఓ డెవలప్‌మెంట్… దానికి ముందుగా నేపథ్యం తెలుసుకుందాం…

Ads

మమత బెనర్జీ  2010 నుంచి 2022 మధ్యకాలంలో 77 వర్గాలకు ఓబీసీ హోదా కల్పించింది… అందులో 75 ముస్లిం వర్గాలే… అంటే హిందువుల్లో వెనుకవడిన వర్గాలకు దక్కాల్సిన సీట్లు, కొలువులు, ఇతర ప్రయోజనాల్ని ముస్లింలకు ధారాదత్తం చేసింది ఆమె… లక్షలాది మందికి ఓబీసీ సర్టిఫికెట్లు కూడా జారీచేసేసింది… తన యాంటీ-హిందూ పాలనకు పరాకాష్ట అది…

ఇదేం అన్యాయమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు… మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని వాదించారు… హైకోర్టు ఈ వాదనను అంగీకరించింది… మమత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని తేల్చింది… 2010 తర్వాత ఓబీసీ జాబితాలో చేర్చిన 77 వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది… దీనివల్ల సుమారు 12 లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది… 2010కు ముందు ఏమేం రిజర్వేషన్లున్నాయో అవి మాత్రమే చెల్లుబాటు అవుతాయని తేల్చిచెప్పింది…

ఈ హైకోర్టు తీర్పుపై మమత బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది… అయితే, తాజాగా ఏమిటంటే..? సువేందు ప్రభుత్వం రాగానే తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మమత అక్రమంగా ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయటానికి నిర్ణయం తీసుకుంది… కానీ హైకోర్టు తీర్పు మీద ఆల్రెడీ మమత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎక్కింది కదా…

సో, సుప్రీంకోర్టులో ఉన్న తమ కేసును విత్‌డ్రా చేసుకుంటామని సువేందు ప్రభుత్వం అడిగింది… దానికి సుప్రీంకోర్టు వోకే చెప్పింది… అంటే ఏమిటి..? ఆ మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పిన హైకోర్టు తీర్పే చెల్లుబాటు అవుతుందన్నమాట… అంటే మమత కేవలం వోట్ల కోసం ముస్లిం వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దయిపోయినట్టే శాశ్వతంగా!!

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అత్యంత వెనకబడిన వారికి 10 శాతం, ఇతర వెనకబడిన వారికి 7 శాతం రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది… మమత దుష్టపాలన రోగలక్షణాలకు సువేందు ఇంకెన్ని చికిత్సలు చేయాలో..!! ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అని చెప్పడానికి మమత ప్రభుత్వ పాలన ఓ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ !! ఆమెకు ఈరోజుకూ కాంగ్రెస్, లెఫ్ట్ సపోర్ట్ జాతీయ స్థాయిలో, అది మరో విషాదం !!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుప్రీం సరేనంది ! మమత మార్క్ ముస్లిం రిజర్వేషన్లకు తెర !!
  • తీస్తా-3 ఓ వార్నింగ్ బెల్..! మేడిగడ్డతో ఆటలాడితే అసలుకే మోసం !!
  • ఆమె మాకొద్దు, మాకసలే వద్దు… శ్రీలీలకు ఏమిటి ఈ దురవస్థ !
  • బుల్‌డోజర్ సర్కారు! ఆ యూనివర్శిటీ 38 బిల్డింగులనూ కూల్చేస్తారట!
  • రాష్ట్రపతి అయ్యాక కూడా… ఆ మహాప్రభు అనుమతిస్తేనే దర్శనం
  • Greatest of All Time..! ఫుట్‌బాల్ GOAT ఎవరు? తేలిపోయినట్టేనా?
  • మన అన్నం పళ్లెంపై ఈయన పేరు! ఆకలి తీర్చిన నాయకుడు!!
  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions