Priyadarshini Krishna… అష్టాదశ పురాణాలు క్షుణ్ణంగా చదువుకోలేదు కానీ, చాలామంది నా కాంటెంపరరీస్ కంటే కొంచెం ఎక్కువే చదువుకున్నాను. డాన్స్ (కూచిపుడి) లోతుగా చదువుకోవడం (సాధన ప్రదర్శన మాత్రమే కాదు) వల్ల లక్షణ గ్రంథాలను కూడా చదువుకునే అదృష్టం కలిగింది.
ఈ ఉపోథ్ఘాతం ఎందుకంటే …ఈ వ్యాసం కొంచెం సీరియస్ విషయం కనుక… రామజన్మభూమిని చుట్టుకొని కొన్నివందల సంవత్సరాలుగా ఎన్నో వివాదాలు, ఘోరాలను భారతీయులమైన మనం మన పూర్వ తరాలవారు చూస్తూ అనుభవిస్తూ సహిస్తూ వున్నారు…. చిట్టచివరికి భారత అత్యున్నత న్యాయస్థానం అయోధ్య ప్రాంతం ఇక్ష్వాకుల రాజవంశీయుడైన శ్రీరాముని జన్మ ప్రదేశమే అని తీర్మానించింది. ఇది ఒక సనాతనాచారిగా నాకు గొప్ప సంతోషకరమైనవార్త. ఇప్పుడు అదే ప్రదేశంలో దేవాలయం నిర్మితమై శ్రీరాముని మూలవిరాట్టు రూప ప్రాణప్రతిష్ట జరిగే సమయం ఒక మథురమైన వార్త.
ఈ కార్యక్రమానికి కూడా అనేకానేక విఘ్నాలు కలిగించే బ్యాచ్, రాళ్ళు రువ్వే బ్యాచ్ రెడీ అయింది…. ఇది చాలా సహజం… రాములవారే స్వయంగా యాగాలను కాపలా కాసి రాక్షసమూక విఘాతం కలిగించకుండా చూసుకున్నాడు. మనమెంత! అయోధ్యయే నిజమైన శ్రీరామ జన్మభూమి అనే విషయం అసలు సుప్రీంకోర్టు ఎలా రూఢీకి వచ్చింది అంటే… పైన చెప్పిన పద్దెనిమిది పురాణాలలో ఒకటైన స్కాంద పురాణాన్ని, గరుడ పురాణాన్ని ప్రాతిపదిక స్క్రిప్చర్ ఎవిడెన్స్ గా తీసుకుంది. ( రామజన్మభూమి జడ్జిమెంట్ కాపీని చదువుకోగలరు)
Ads
సరయు నది తమస నదీ మధ్య గల పరీవాహక ప్రాంతం అయోధ్య. అక్కడే ఇక్ష్వాకుల వంశరాజు దశరథునికి రాముడు జన్మించాడని సుస్పష్టంగా వుంది. ఈ పురాణం ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం రాసినది. మనకి మౌఖిక వారసత్వంగా కూడా వచ్చింది. ఇది పక్కనపెడదాం…. ఇప్పుడు లేటెస్టుగా ‘రామ్ లల్లా’ మూలవిరాట్టు ప్రాణప్రతిష్ట చేయనున్న మోదీ చుట్టూ బురద బకెట్లతో కొందరు మొదలయ్యారు. అందులో సుబ్రహ్మణ్య స్వామి ఒకడు.
పద్నాలుగేళ్ళ వనవాసం చేసిన రాముడు తన సీతని అపహరించిన రావణునితో యుద్ధం చేసిన రాముని గుడిలో విగ్రహ ప్రాణప్రతిష్ట చేయడానికి భార్యని విడిచిన మోదీ ఎంతవరకు అర్హుడు అని ట్వీట్ చేసాడు. గత కొన్ని వందల ఏళ్ళుగా దేవాలయాల స్థాపన దేవతామూర్తుల ప్రాణప్రతిష్టలు అనాదిగా… కొండొకచో వైదికకాలం నుండి… ఆయా ప్రాంతపు పాలకుల చేతుల మీదుగానే జరిగాయి…
ఆ మాటకొస్తే, రామజన్మభూమిలోని దేవాలయపు మూలవిరాట్టు ‘రాం లల్లా’ ప్రాణప్రతిష్టను అయోధ్యనేలిన అనేకానేక ఇక్ష్వాకు అనువంశీక రాజులు/ జైన తీర్ధాంకరులచేత పునర్‌స్థాపితం కావింపబడింది.మోదీ అనువంశీకుడు కాకున్నా ఈ కాలపు పాలకుడు. అదొక్క క్వాలిఫికేషన్ చాలు ఆయన అర్హుడు అని చెప్పడానికి.
స్త్రీలను చెరపట్టిన రావణుడినే మనం భక్తునిగా సాహిత్యవేత్తగా అక్కున చేర్చుకుని, ఆయన రచించిన శివతాండవ స్త్రోత్రాన్ని మన పూజార్చన కార్యక్రమాల్లో చేర్చుకున్నాం… అంతకంటే దారుణమైన వ్యక్తితం మోదీది కాదు కదా… పోలిక సరికాకపోయినా… ఇది ఒప్పుకు తీరాల్సిన సత్యం… ఐనా తను సన్యసించానని మోదీయే చెప్పుకున్నాడు కదా… మరిక అనర్హత ఏమున్నట్టు..?
Share this Article