అంబటిపూడి కామాక్షి… మరోసారి చెప్పుకుంటున్నాం… సాధారణంగా టీవీల్లో కనిపించే మ్యూజిక్ కంపిటీషన్, సారీ, సింగింగ్ కంపిటీషన్స్‌లో ఆర్కెస్ట్రాను పెద్దగా పట్టించుకోరు, గుర్తించరు… అరుదు… ఈటీవీ పాడతా తీయగా వంటి షోలలో ఇన్‌స్ట్రుమెంట్స్, ప్లేయర్లను చూపిస్తూ ఉంటారు చాలాసార్లు… అభినందనీయం… కొన్ని టీవీ షోలలో మరీ ట్రాకులతో కథ నడిపించేస్తుంటారు…
జీతెలుగు వంటి చానెళ్లలో సరిగమప వంటి పరమ నాసిరకం షోలలో చెప్పనక్కర్లేదు… జడ్జిల వేషాలు కూడా చిరాకెత్తిస్తున్నాయి… కానీ ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ డెఫినిట్‌గా క్వాలిటేటివ్… చిన్న ఆర్కెస్ట్రా గ్రూపు… సింగర్లకు అదనపు బలం… ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే ఈసారి కోరస్ మీద కూడా కాన్సంట్రేట్ చేశారు… కంటెస్టెంట్లందరూ ఏక్‌సే ఏక్ ఉన్నారు… సూపర్బ్ సెలక్షన్స్…
చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే..? ఆ ఆర్కెస్ట్రాలో కామాక్షి ఉంది… చిన్న ఏజ్… 20 దాటలేదేమో బహుశా… కానీ వెల్ టాలెంటెడ్… ఫస్ట్ సీజన్‌లో వైష్ణవితో స్టేజీ మీదే ఛాలెంజ్ స్వీకరించి అదరగొట్టింది… ఈసారి కూడా ఆమె ఆ ఆర్కెస్ట్రాలో ఉంది… థమన్, ఎస్పీ చరణ్ పదే పదే మెచ్చుకున్నారు ఆమె డ్యుయెట్ ఛాలెంజ్ ఎపిసోడ్‌లో… నాని అయితే ఆమెను చూస్తూ మీ నవ్వు చాలా బాగుంది అని ప్రత్యేకంగా అప్రెసియేట్ చేశాడు… ఆమె వయోలిన్ మీటుతుంటే, వింటుంటే… అదొక ఆహ్లాదం…
Ads
ఈ ఎపిసోడ్‌లో రెండుమూడు పాటల్లో ఆమె వయోలిన్ స్వరమాధుర్యం వీనులవిందు… రియల్లీ నువ్వు అభినందనీయురాలివి తల్లీ… ఈ క్షుద్రమైన టీవీ షోల ప్రయారిటీల్లో ఓ వయోలినిస్ట్‌కు ఈ గుర్తింపు రావడం చాలా అరుదు… గతంలో లేదు గానీ ఇప్పుడు సినిమా పాటల యూట్యూబ్ వీడియోలలో ఏ ఇన్‌స్ట్రుమెంట్ ఎవరు వాయించారో ప్రత్యేకంగా రాస్తున్నారు… అది అవసరమే…
ఈసారి ఎపిసోడ్‌కు ఎస్పీ చరణ్ కూడా ఓ ముఖ్య అతిథి… మామూలుగా చరణ్ అనగానే బాలు తరువాత పాడతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రాములను చెడగొట్టాడనే కోపం ఉండేది… తను కూడా గొప్ప గాయకుడేమీ కాదు… అయితే ఇండియన్ ఐడల్ షోకు వచ్చినప్పుడు తను హుందాగా, పెద్ద మనిషిలా వ్యవహరించిన తీరు బాగుంది… ఎక్కడా ఒక పొల్లు మాట లేకుండా మాట్లాడాడు… థమన్, గీతామాధురి, కార్తీక్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు…
https://www.facebook.com/reel/169584159315177/?s=single_unit
అప్పుడప్పుడూ మేల్ శ్రీముఖిలా మారిపోతున్న హేమచంద్ర ఇప్పుడు కాస్త తగ్గాడు… యాంకరింగ్ అంటే హైపిచ్ అరుపులు అక్కర్లేదు బ్రదర్, అది శ్రీముఖికి మాత్రమే పరిమితమైన ఓ డిసీజ్… కంటెస్టెంట్లు కూడా పేరొందిన పెద్ద గాయకుల్లాగా పాడుతున్న తీరు బాగుంది… ప్రత్యేకించి సంగీతంలో ఏ శిక్షణ లేని బీఎస్ఎఫ్ జవాన్ చక్రపాణి అప్పుడప్పుడూ డామినేట్ చేస్తున్న తీరు ఎక్సలెంట్… పైగా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు తనకు కాస్త నత్తి… పాట అందుకుంటే మాత్రం ఇక తిరుగులేదు… న్యూజెర్సీ నుంచి వచ్చిన డాక్టర్ శృతి, వైజాగ్ నుంచి వచ్చిన సౌజన్య, కార్తికేయ, సాకేత్… గట్టి పోటీదారులుగా కనిపిస్తున్నారు..!!
Share this Article