Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింపతీ స్టార్ సమంత..! అటు హాట్ ఫోటోలు… ఇటు పదే పదే అనారోగ్య ప్రస్తావన..!!

March 26, 2024 by M S R

సిటాడెల్ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం సమంత హాట్ ఫోటో సెషన్ ఒకటి మీడియాలో దర్శనమిస్తోంది… అదే సమయంలో తను మీడియాతో ఎక్కడో మాట్లాడుతూ… ‘అటు చాలా కష్టమైన షూటింగ్ అది, మరోవైపు నా అనారోగ్యం… ఓరోజు షూటింగ్ సమయంలోనే పడిపోయాను, టీం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది’ అని చెబుతూ ఉంటుంది… చిత్రమైన మనిషి… గ్లామర్‌కూ రోగానికీ నడుమ ఓ గీత గీయవమ్మా తల్లీ…

ఏడాది క్రితం ఓ మిత్రుడి పోస్టు గుర్తొచ్చింది… అది సమంత నటించిన శాకుంతలం ప్రమోషన్ జరుగుతున్న రోజులు… ‘‘నిన్న మొన్నటి వరకు ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో, ‘నాకు రోగమొచ్చింది, ఎక్కువ మాట్లాడలేను, దయచేసి నా సినిమాను చూడండి’ అంటూ దీనంగా, రోగగ్రస్త లుక్ కోసం మేకప్ వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని, కన్నీళ్ళు పెట్టుకున్న సమంత వెంటనే అమెరికాలో అడుగుపెట్టి హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘CITADEL’ కోసం ఉత్సాహంగా అందమైన ఫోజులు ఇచ్చి, తెలుగు ప్రేక్షకులను వెర్రివాళ్ళను చేసింది…’’ ఇదీ ఆ పోస్టు…

నిజమే… ఇక్కడ శాకుంతలం  సినిమా ప్రమోషన్లలో ముక్కు చీదుతూ, ఎగబీలుస్తూ, టిష్యూ పేపర్‌తో కెమెరాల ముందే తుడుచుకుంటూ ‘విసిగించింది’ కదా… వెంటనే విదేశాలకు వెళ్లాక ఎగిరి గంతులేస్తూ ఫోటో షూట్ చేసింది… నిజానికి యశోద సినిమా ప్రమోషన్లలోనూ అంతే… సరిగ్గా దాని రిలీజుకు ముందు తన రోగాన్ని వెల్లడించింది… యశోద కాస్త బెటరేమో గానీ శాకుంతలం అట్టర్ ఫ్లాప్… దానికి లక్ష కారణాలు ఉండొచ్చు, కానీ వాటిల్లో సమంత సినిమా ప్రమోషన్లలో రోగిష్టిగా కనిపించడం కూడా..! (రంగస్థలం సినిమాలో ఏ మేకప్పూ లేకుండా ఓ పల్లెటూరి పిల్లలా సాదాసీదా దుస్తులతో నటించినా సరే ప్రేక్షకులు వోకే అన్నారు, కానీ శాకుంతలంలో అపూర్వ అందగత్తెగా చూపించడానికి ప్రయత్నించినా సరే, జనం నో అన్నారు…)

Ads

samantha

ఎవరు అంగీకరించకపోయినా… అంగీకరించడానికి మనసు అంగీకరించకపోయినా సరే… రియాలిటీ అది… తను ఎంతసేపూ సింపతీ స్టార్ ముద్ర కోసం ఎందుకు ప్రయత్నించిందో అర్థం కాదు… దాంతో సినిమాలు నడవ్వు… పైగా అది నెగెటివ్ అవుతుంది… సగటు ప్రేక్షకుడికి సినిమాలో పాత్రకు తగిన సమంత కావాలి, ప్రమోషన్ మీట్లలో కనిపించే రోగిష్టి సమంత కాదు… అందుకే ముక్కు ఎగబీలుస్తూ, ఏడుస్తూ, తుడుస్తూ కనిపించిన ఫోటోలు, వీడియోలకూ… అతిలోక సుందరి శకుంతల పాత్రకూ సింక్ కాలేదు, కాదు కూడా..!

దుష్యంతుడు ఆమెను చూడగానే పడిపోతాడు సినిమాలో… కానీ సినిమా చూసే ప్రేక్షకుడికి ప్రమోషన్లలోని సమంత కనిపించింది… సో, అనారోగ్యంతో ఉన్నా సరే, ప్రమోషన్లలో పేషెంట్‌గా కనిపించడంతో సదరు నిర్మాతలు, సమంత కోరుకున్న సింపతీ రాలేదు సరికదా, ఎదురుతన్నింది… అసలే చైతూతో బెడిసిన ప్రేమ, పెళ్లి వ్యవహారం అంతకుముందే ఆమెపై ఓ నెగెటివ్ ఫీల్‌ను పెంచాయి ప్రేక్షకుల్లో…

samantha

చైతూతో పెళ్లి పెటాకులయ్యాక… పర్సనల్ స్టాఫ్‌తో అత్యంత సన్నిహితంగా ఫోటోలు దిగి, ట్వీట్స్ చేసింది… అదేదో పిచ్చి వెబ్ సీరీస్‌లో తమిళ తీవ్రవాదిలా కనిపించి, అందులో బరిబాతల నటిస్తే, దాన్ని తీసివేయించడానికి నాగార్జున నానా అవస్థలూ పడ్డాడని వార్తలొచ్చాయి… తన కుటుంబం పరువు పోతుందని భయపడ్డాడట… తరువాత ఊ ఉంటావా, ఊఊ అంటావా అనే ఓ వెకిలి ఐటం సాంగ్‌లో సమంత అడ్డదిడ్డంగా, ఎడ్డి చూపులతో నర్తించడంతో పాట హిట్టయినా సరే, అది ఆమెకు వ్యక్తిగతంగా మైనసయింది… చైతూ కోసం అక్కినేని కుటుంబం రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసింది… కుటుంబంలోకి ఆహ్వానించింది… ఐనా ఆమె దాన్ని నిలుపుకోలేకపోయిందని ప్రేక్షకుల్లో ఓ వ్యతిరేక భావన ఆమె మీద పెరిగిపోయింది…

samantha

ఈ స్థితిలో ఆమె తన రోగం మయోసైటిస్ గురించి చెప్పుకుంది… అదీ సరిగ్గా యశోద రిలీజుకు ముందు…! ఆ సినిమాకు సంబంధించి సమంత ఆశించిన సానుభూతి ఏమీ పెద్దగా వర్కవుట్ కాలేదు… తరువాత శాకుంతలం సినిమాకూ అంతే… ఇప్పుడు సిటాడెల్ ప్రమోషన్లలోనూ అవే మాటలు… మళ్లీ తనే అంటుంది, నామీద సింపతీ స్టార్ అని ముద్ర వేశారు అని… మరి తను కోరుకున్నదీ అదే కదా… అందుకే కదా, సెలైన్ ఎక్కించుకుంటూ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు రిలీజ్ చేయబడ్డాయి అప్పట్లో…

samantha

సినిమా తారలు ప్రత్యేకంగా దిగివస్తారా..? వాళ్లూ మామూలు మనుషులేగా… రోగాలు, నొప్పులు వాళ్లకుండవా..? అనేది సమంత పోకడకు ఓ విఫల సమర్థన… ఒకవైపు శాకుంతలానికి ముక్కుచీదిన ఆమె సిటాడిల్ ప్రమోషన్‌కు మాత్రం మాంచి మేకప్పు, డ్రెస్సుతో హుషారుగా ఫోజులిచ్చింది… మరి శాకుంతలం ప్రమోషన్లలో శోకాలు దేనికి..? రోగంతో ఉన్నా, నా సినిమాను దయచేసి చూడండంటూ వేడికోళ్లు దేనికి..? ఐనా ప్రధాన కథానాయికకు రోగమొస్తే, జాలితో, సానుభూతితో ప్రేక్షకులు సినిమా చూస్తారా..? ఆమెకు రోగమొస్తే ప్రేక్షకులు కన్నీళ్లు కార్చేంత అభిమానం, ప్రేమ ఏమీ లేవు తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పుడు…!!

అన్నట్టు… సిటాడెల్ కోసం ప్రియాంక చోప్రా బరితెగించి, బరిబాతల కూడా నటించిందని వార్తలున్నాయి… మరి ఇండియన్ వెర్షన్‌లో సమంత ఏం చేసిందో… ఏమోలెండి… కర్మణ్యేవాధికారస్తే అని మరో శ్లోకంతో శోకం కవర్ చేసేయగలదు…

citadel

పుష్ప-2 మాత్రమే కాదు, పుష్ప-3 కూడా చేయబోతోంది అని వార్తలొస్తుంటాయి… వాటిల్లోనూ ఆ వెగటు సాంగ్సేనా..? మరోవైపు పుష్ప ఐటమ్ సాంగ్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాను అని చెబుతుంది తనే… ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు… సిటాడెల్ ఏడాదిగా ఎందుకో రావడమే లేదు… ఇకపై బిజీ కాబోతోంది, వ్యాధి నయమైంది అని ఇంకోవైపు వార్తలొస్తాయి…

మరోవైపు సినిమాలకు దీర్ఘవిరామం తీసుకోబోతోంది, అందుకే ఏమీ కొత్తవి ఒప్పుకోవడం లేదు, చికిత్స కోసం అమెరికా, దక్షిణ కొరియాలకు వెళ్తుందనీ, కొన్నాళ్లు పూర్తి విశ్రాంతి తీసుకుంటుందనీ వార్తలు వచ్చాయి… ఒకటీరెండేళ్లు నటించదు అని రాస్తుంటారు…  గతంలో కుదిరిన కొన్ని అగ్రిమెంట్ల తాలూకు అడ్వాన్స్ డబ్బుల్ని కూడా సమంత వాపస్ ఇస్తున్నదనీ రాసేశారు కొందరు… హేమిటో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions