తాప్సీ పన్ను… దాదాపు పద్నాలుగేళ్లుగా మూవీ ఇండస్ట్రీలో ఉంది… తెలుగులో కొన్ని సినిమాలు చేసినా సరే, ఆమెకు మంచి పేరు తీసుకొచ్చినవి హిందీ సినిమాలే… ఆమె పేరు వినగానే గుర్తొచ్చేది దర్శకరత్నుడి బొడ్డు యవ్వారాలు… ఆయన మీద తాప్సీ చేసిన వ్యాఖ్యలు, ఆమెపై రాఘవేంద్రుడి ఫ్యాన్స్ వీరంగం కూడా గుర్తొస్తాయి… ఆమె అప్పుడప్పుడూ ఓపెన్‌గా కామెంట్స్ విసురుతూ ఉంటుంది…
అలాంటి తాప్సీ కూడా ఏ ఒక్క రోజూ తన బాయ్ ఫ్రెండ్ గురించి, పదేళ్లుగా సాగుతున్న రిలేషన్ షిప్ గురించి, పెళ్లి గురించి… ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు… ఇండస్ట్రీలో రూమర్స్‌లో అప్పుడప్పుడూ ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని వినడమే తప్ప… ఎన్నెన్నో తారల యవ్వారాల డొంకల తీగెలు లాగే బాలీవుడ్ మీడియా ఆమె లవ్ స్టోరీ గురించి ఒక్క ముక్క రాయలేకపోయింది…
Ads
నా ప్రైవేటు లైఫ్, నా ఇష్టం అంటూ జవాబులు దాటేసేది… అంతెందుకు..? ఈరోజుకూ వాళ్ల లవ్ స్టోరీ గురించి ఎవరూ పెద్దగా రాయలేకపోతున్నారు… అప్పుడెప్పుడో 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంలో వాళ్లిద్దరూ కలిశారు, తరువాత పదేళ్లపాటు బంధం కొనసాగుతూ వస్తోంది, ఇప్పుడు పెళ్లిచేసుకున్నారు అనే వాక్యాలు తప్ప వేరే విషయాలేమీ ఎవరూ రాయలేదు, చదవలేదు…
సిక్కు-క్రిస్టియన్ పద్ధతుల మేళవింపుతో జరిగిన పెళ్లికి కూడా పెద్దగా హడావుడి లేదు, హంగామా లేదు… అట్టహాసాలు, ఆడంబరాలు కూడా లేవు… కనీసం తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఏమీ చెప్పలేదు… పెళ్లికి వెళ్లిన కొద్ది మంది తన సన్నిహితుల్లో ఒకరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటీరెండు ఫోటోలు షేర్ చేసుకుంటేనే మీడియాకు ఆ పెళ్లి గురించి తెలిసింది… బహుశా ముంబైలో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేస్తుందేమో…
హేమిటో… తాప్సీ అర్థం కాదు ఫాఫం… చాలా సెలబ్రిటీ పెళ్లిళ్లలాగే చాలామందిని పిలవాలి, ధూంధాం చేసేయాలి… చివరకు పెళ్లీ, ఎంగేజ్మెంట్, రిసెప్షన్ ఫోటోలు, వీడియోలను కూడా అమ్ముకోవాలని తెలియదు… అప్పుడెప్పుడో ఆమే చెప్పింది… ‘‘పదేళ్ల బంధం మాది, ఇంకా గర్భం లేదు, కానీ నాకు పిల్లలు కావాలి, పెళ్లి చేసుకుంటా త్వరలో..’’ అని..! ఎవరేమన్నా రాసుకోనీ, ఏమన్నా కూయనీ… ఇంతకుమించి ఒక్క మాట చెప్పను అన్నట్టుగా…!!
నేను తింటున్నా, పడుకుంటున్నా, బయల్దేరినా, తుమ్మినా, దగ్గినా… అంటూ ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ దాన్ని కూడా పాపులారిటీ ప్రమోషన్లా భావించే సెలబ్రిటీల నడుమ తాప్సీ ధోరణి ఒకింత విశేషమే… తన ప్రొఫెషన్కూ, తన ప్రైవేట్ లైఫ్‌కూ నడుమ ఓ బలమైన గీత గీసుకుంది ఆమె… ఇంతకీ ఆమె భర్త గురించి తెలుసా మీకు..?
మథియాస్ బో… పుట్టుక డెన్మార్క్… బ్యాడ్మింటన్ ప్లేయర్… చాలా మెడల్స్ వచ్చినయ్… 2012 సమ్మర్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత… ఇండియా జాతీయ మేల్ డబుల్స్ ప్లేయర్లకు కోచ్ ప్రస్తుతం… 39 ఏళ్లకే రిటైర్డ్… ప్రస్తుతం 43 ఏళ్లు… తాప్సీ వయస్సు 36… ఆల్ ది బెస్ట్ తాప్సీ..!
Share this Article