Sunitha Ratnakaram…… ప్రకాష్ రాజ్ ఈ సినిమాని తెలుగూ, తమిళమూ, కన్నడ భాషల్లో 2014 లో తీసాడు, 2011 మలయాళం సినిమా ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ ఆధారంగా… కన్నడంలో తప్ప అన్నిచోట్లా బానే తన్నేసిందట. అయినా 2016 లో హిందీలో మొదలెట్టాడు. రకరకాల కష్టాలు దాటుకుని ఇప్పుడు ఈ 2022లో ‘జీ5’ ద్వారా ఎట్టకేలకు విడుదలైంది. ఇవేమీ తెలీకుండానే నానా పాటేకర్ కనపడుతున్నాడని చూడటం మొదలుపెట్టా ఓ రెండు మూడు వారాల ముందు…
కాసేపటికి శ్రేయా కనిపించి ఇంక నడిపించేసా… సినిమా ఓ పదిహేను ఇరవై నిమిషాలు అయ్యాక, ఇదెక్కడో చూసినట్టు అనిపించి, కాసేపటికి ‘ఉలవచారు బిర్యానీ’ గుర్తొచ్చింది… అంచేత సినిమా గురించి ఏమీ రాయట్లేదు. ఆ సినిమా చూసింది ‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా’ పాట ఇచ్చిన పుష్ వల్ల మాత్రమే… బోలెడన్ని స్టిగ్మాలూ, స్టీరియోటైపులూ చక్కగా డిస్కస్ చేశారు ఒరిజినల్ మాదిరే…
Ads
సినిమా గోవా లో సెట్ చేయడం బావుంది. మురళీశర్మ కూడా ఈ సినిమా ప్యూపా దశలోనే ఒప్పుకున్నాడు. పాపమ్. ఈ సినిమాలో నాకు చాలా నచ్చే సన్నివేశం మాత్రం పెళ్ళిచూపులకి వెళ్లి, ఆ ఇంట్లో నుంచి వంటవాడిని తెచ్చుకోవడం… తడ్కా లో అట్లా బాగా పండిన సన్నివేశం ఇంకో పెళ్ళిచూపుల్లో. ఇది రెస్టారెంటులో. మనవాడికి తిండిదా ముఖ్యం ఆవిడేమో మా వంటావిడ వండినవే తింటాను, నో మసాలా నో ఆయిల్ గట్రా గట్రా అనేస్తుంది అప్పటికే… ఇంతలో వచ్చిన వెయిటర్ తో నిమ్మకాయ నీళ్లు తెమ్మంటుంది ‘నో షుగర్, నో ఐస్’ కలిపి… మనోడి మాట ‘నీంబూ చలేగా!?’… కాసేపు హాయిగా స్నేహితుల్లాగా మాట్లాడుకుని, మీకు నేను తక్కువేలెండి అని ఆవిణ్ణి మర్యాదగా పంపేయడం బావుంటుంది…
ఒక నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో చూసేయొచ్చు. బ్రిలియంట్ కాస్ట్, ఓ మాదిరి కొత్తదనం ఉన్న స్క్రిప్ట్ ఉన్నా ఏదో తేడా మాత్రం వుంది ఈ సినిమాలో… చాలా నీరసంగా వుంది, నానా కూడా at times … బహుశా ఒక అరవై డెబ్భై నిమిషాల్లో తీస్తే సరిగ్గా ఉంటుందేమో!? ఇది రికమెండేషన్ పోస్టు కాదు, అట్లా అని అరికమెండేషనూ కాదు…
Share this Article