కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా… 26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… […]
ఫాఫం జగన్… హల్దీ అంటే గోరింటముద్ద అట… ఫన్నీగా రాసి పారేశాడు…
చాన్నాళ్ల తరువాత సాక్షి ఫన్ డే అనబడే సండే మ్యాగజైన్ తిరగేస్తుంటే… ఓచోట కర్సర్, కళ్లు ఆగిపోయాయి… ఫాఫం జగన్ అనుకుని ఓసారి బలంగా నిట్టూర్చాల్సి వచ్చింది… ఈనాడును కొట్టేస్తాననే గప్పాలతో ప్రారంభమైన ఈ పత్రిక చివరకు ప్రభుత్వ నిధులతో నాలుగు కాపీలు కొనుగోలు చేయించే దయనీయ పత్రికగా మారిపోయింది… పోనీ, ఏమైనా ఎడిటోరియల్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే అదీ దిక్కులేదు… అంతకుముందు ఆదివారం నాటి మ్యాగజైన్‌లో ఓ కవర్ పేజీ సుదీర్ఘకథనం చేయించారు… దాని శీర్షిక […]