సికింద్రాబాద్… ఉజ్జయిని మహాంకాళి గుడి… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు… గుడి బయటికి రాగానే హడావుడిగా బండి సంజయ్ అమిత్ షా చెప్పుల్ని వెతికి, పట్టుకొచ్చాడు… కాస్త వంగి విధేయంగా నిలబడ్డాడు… అమిత్ షా కనీసం వారించలేదు… ఇదీ జరిగింది… లంబాచోడా వివరణలు అక్కర్లేదు… జరిగింది బాగాలేదు… హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్‌కు సైతం చివ్వెరపుట్టించేలా జరిగింది… సహజంగానే బీజేపీ అంటే అగ్గిమండుతున్న టీఆర్ఎస్ దీన్ని […]
అమిత్ షా విందు భేటీ సరే… కానీ జూనియర్‌తో తక్షణ ఫాయిదా ఏముంది..?!
రాజ్యసభకు నామినేటైన విజయేంద్రప్రసాద్ పూనుకుని అమిత్ షాతో జూనియర్ ఎన్టీయార్ భేటీని ఆర్గనైజ్ చేశాడనేది నిజం… రామోజీకి గానీ, ఇతరులకు గానీ సంబంధం లేదు… అందుకే తను రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి అమిత్ షాతో కలవలేదు… నోవాటెల్ హోటల్‌లో కలిసి భోజనం చేశాడు… మంచి ప్రయారిటీ ఇచ్చినట్టే… అయితే ఎందుకు..? వదిలేయండి, ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా నటించావు బ్రదర్ అని అభినందించాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు, మరీ ప్రత్యేకించి పిలిచి భోజనం పెట్టాల్సిన పనిలేదు… […]