. క్రిష్… పూర్తిగా కొడిగట్టిపోయిందా నీలో క్రియేటివిటీ సరుకు..? అనుష్కా… ఫాఫం… రీఎంట్రీతో నిరాశేనా..? ఘాటి సినిమా చూశాక ప్రేక్షకులకు కలిగే భావనలు ప్రధానంగా ఇవే… అప్పుడెప్పుడో క్రిష్ బాగానే తీసేవాడు… ఒక గమ్యం, ఒక కంచె, ఒక కృష్ణం వందే జగద్గురుమ్, ఒక శాతకర్ణి… తరువాత కథానాయకుడు, మహానాయకుడు అట్టర్ ఫ్లాప్స్… మణికర్ణిక షూటింగు నుంచే కంగనా తరిమేసింది… హరిహరవీరమల్లు నుంచి పవన్ కల్యాణ్ తరిమేశాడు… ఇప్పుడు ఈ ఘాటి… మరింత వైఫల్యం… అనుష్క… ఒకప్పటి […]
హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!
మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]
బాలీవుడ్ జేజమ్మగా దీపిక..! గుడ్.. ఆ రాణి పద్మావతికి ఆ పాత్ర ఓ లెక్కా..?
అరుంధతి… ఈ సినిమా అనుష్క నటజీవితానికి పెద్ద బ్రేక్… ఆ సినిమా తరువాతే ఆమె పాపులారిటీ, ఇమేజీ బాగా పెరిగిపోయి, తెలుగు అగ్ర హీరోయిన్‌గా నడిచిపోయింది చాన్నాళ్లు… అదేదో పిచ్చి సినిమాకు బరువు పెరిగేదాకా..! ఆ తరువాత ఇక ఆమె కెరీర్ అస్సలు గాడినపడలేదు… పడుతుందనే సూచనలూ లేవు… కొత్త హీరోయిన్లు వచ్చి దున్నేస్తున్నారు… సెకండ్ ఇన్నింగ్స్ జోష్‌లో లేదు… అదుగో ఇదుగో ప్రభాస్ అనే వార్తలు రావడమే తప్ప తను సై అనడు, ఈమె చెంతచేరదు… […]