‘‘ఇటీవల కన్నుమూసిన గద్దర్ విషయంలో కూడా కేసీఆర్ నిరంకుశంగానే వ్యవహరించారు. ప్రగతిభవన్ గేటు వద్ద పడిగాపులు పడినప్పటికీ ఆయనను లోపలకు అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వద్ద కూడా గద్దర్‌కు ఇలాంటి అవమానం జరిగి ఉండదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్ మద్దతుకోసం కేసీఆర్ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్, తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నానని, గద్దర్ వంటి వాళ్లు దీక్ష విరమించాలని విజ్ఞప్తి […]
“తెలంగాణా ఒచ్చింది లచ్చుమమ్మో లచ్చుమమ్మా… మనకేమి తెచ్చింది లచ్చుమమ్మా…”
(కందుకూరి రమేష్ బాబు….) తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలైన తరుణంలో భువనగిరిలో (1996) జరిగిన సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభ తిరిగి ప్రజాస్వామిక ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కోసం ప్రభావశీలమైన ప్రయత్నం చేసింది. అనంతరం వరంగల్ సదస్సు. ఈ రెండు సదస్సుల్లోనూ గద్దర్ పాట విప్లవ సందేశాన్ని ఇస్తూనే సిసలైన తెలంగాణ వారసత్వ పోరు గీతికలను రచించేలా చేశాయి. అందులో ‘అమ్మా తెలంగాణమా…ఆకలి కేకల గానమా’ ఒకటి. ఇది గద్దర్ భువనగిరి సదస్సుకు హైదరాబాద్ నుంచి వెళుతూ […]
మోహన్‌బాబన్నయ్యా… మీ తమ్ముడు గద్దర్ సినిమాలకు డైలాగులు కూడా రాసేవాడా..?
‘‘భోళాశంకర్ ప్రిరిలీజ్ ఫంక్షన్లో కనీసం గద్దర్‌కు సంతాపం ప్రకటించే సంస్కారం కూడా లేదా చిరంజీవికి..?’’ అని ఓ మిత్రుడు ఆగ్రహపడిపోయాడు… పోనీలే, తమ్ముడు పవన్ కల్యాణ్ నివాళి అర్పించాడు కదా… నా అన్న ప్రజాయుద్ధనౌక పేరిట ఒకటీరెండు స్మరణ వీడియోలు కూడా రిలీజ్ చేసినట్టున్నాడు… మోహన్‌బాబు కూడా అక్కడికి వెళ్లాడు… కానీ ఏమన్నాడు..? గద్దర్ తమ్ముడట… తమది అన్నాదమ్ముల అనుబంధం అట… 49లో పుట్టిన గద్దర్ 52లో పుట్టిన మోహన్‌బాబుకు తమ్ముడెట్లా అయ్యాడు… పైగా గద్దర్ అందరినీ […]
విరోధాభాసం… అబ్బో, తూటా పేల్చిన ఆ తుపాకీయే బాగా కలతపడిందట…
రాజ్యానికి వ్యతిరేకంగా, శ్రామికజనం గొంతుకగా ఏళ్ల తరబడీ పనిచేసిన గద్దర్‌కు అదే రాజ్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మీద చర్చ సాగుతూనే ఉంది… బుల్లెట్నే నమ్మి, బ్యాలెట్‌ను ధిక్కరించిన గళం చివరకు తనే ఓ సొంత పార్టీ పెట్టిన తీరు మీద చాన్నాళ్లుగా చర్చ సాగుతోంది… గద్దర్ మీద విమర్శలు బోలెడు… అఫ్కోర్స్, తను విమర్శలకు అతీతుడు ఏమీ కాదు… వాళ్లో వీళ్లో దేనికి..? ఏ నక్సలైట్ల కోసం తను అవిశ్రాంతంగా, ప్రాణాలకు తెగించి పనిచేశాడో… […]
గాతె గాతె మరుంగా, ఏ గీత్ సున్లో భయ్.., మర్తె మర్తె గావుంగా, ఏ గానా సున్లో భయ్…
ఫేస్ఋక్‌లో మిత్రురాలు తులసి చందు పెట్టిన ఓ వీడియో పోస్టు ఓ కొత్త విషయాన్ని చెప్పింది… అదేమిటీ అంటే… గద్దర్ జీవితం ప్రశాంతంగా ఏమీ లేదు… రాజ్యం, ప్రభుత్వం తననేమీ నిశ్చింతంగా ఉండనివ్వడం లేదు… అంతేకాదు, కర్నాటకలో రెండుమూడేళ్లుగా నడుస్తున్న ఓ కేసులో తనకు ఏ శిక్షయినా పడవచ్చునని ఆయన సందేహిస్తున్నాడు… చివరకు ఉరిశిక్ష లేదా జీవితఖైదు కూడా పడవచ్చునని అంటున్నాడు… ‘‘అది బెగంపల్లి కేసు… 28 ఏళ్ల క్రితం పెట్టబడిన కేసు… అదే అమ్ముగూడ రైల్వే స్టేషన్ […]