ఎల్. బి. శ్రీరామ్ గారికి, నమస్సులు. మీరు నిర్మించి, నటించిన “కవిసమ్రాట్ విశ్వనాథ”ను యూట్యూబ్ లో చూశాక స్పందనగా ఈ నాలుగు మాటలు. “అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్” నిజమే. విశ్వనాథలాంటి శిష్యుడిని పొందగలిగే భాగ్యం చెళ్ళపిళ్ళవారికి దక్కింది కానీ…నన్నయ్య, తిక్కనలకు దక్కిందా? “ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట […]