జాతీయ పార్టీలను వదిలేస్తే… ప్రాంతీయ పార్టీల కోణంలో… కేవలం ఆయా పార్టీల అధినేతలు, కుటుంబాల అవసరాలను బట్టి సిద్ధాంతాలుంటయ్… రాజీలుంటయ్… కాళ్ల బేరాలుంటయ్… సాగిలబడటాలుంటయ్… ఏసీబీలు, ఈడీలు, సీబీఐలు కన్నెర్ర చేస్తే నడుంలు మరింత వంగిపోతయ్… పొత్తులకూ అంతే… ఎవరి అవసరం వాళ్లది… చివరకు జాతీయ పార్టీలు సైతం నంబర్లాటలో పైచేయి కోసం ప్రాంతీయ పార్టీలో ‘కుమ్మక్కు’ కావడం మన రాజకీయ విషాదం… చంద్రబాబు వంటి అత్యంత విశ్వాసరహితుడితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏమిటనేది తాజా ప్రశ్న… […]
సీఎం పదవికి రెడీగా ఉన్నాను…. ఇప్పటికీ పవన్ అడుగుల్లో అవే పొరపాట్లు…
పవన్ తొలి మాటతోనే నాయకుడు కాదనిపించింది … చిరంజీవి పవన్ పార్టీలతో అనుబంధం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ——– ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కొద్దిగా చదివాక అన్నాదమ్ముల పార్టీలు , ఒక రిపోర్టర్ గా వాటితో అనుబంధాలు గుర్తుకు వచ్చాయి . పవన్ ఉపన్యాసం పూర్తిగా వినాలి అంటే తన అభిమాని అయినా కావాలి , వ్యతిరేకించే రాంగోపాల్ వర్మ అయినా కావాలి . లేదా ఆ వార్తను […]
పవన్ తప్పేముంది ఫాఫం… ఏపీ పాలిటిక్సులో అందరూ సంస్కార పురుషులే కదా…
నిజానికి ఏపీ రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు… ఒకడిని మించి మరొకడు… వైసీపీ, టీడీపీ క్యాంపుల్లో కొందరు పేరొందిన నేతలున్నారు… బూతులు తప్ప మరో భాష రాదు… పీకేదేమీ ఉండదు, ఆ భాషలో వాగడం తప్ప…! సాక్షాత్తూ నా భార్యను అవమానిస్తున్నారంటూ అంతటి సుదీర్ఘమైన కెరీర్ ఉన్న చంద్రబాబు భోరుమని ఏడవడం ఏపీ బురద రాజకీయాల్లో ఓ మరుపురాని ఘట్టం… అంతకుముందు జగన్ మీద కూడా అసెంబ్లీలోనే అలాంటి దాడి జరిగేది… సో, ఎవరూ తక్కువ కాదు… […]
తెలుగు హీరోలు ఎలుగ్గొడ్లు అట… వీడెవడో చాలా దూరం వెళ్లిపోయాడు…
Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ […]
తొక్కి నారతీయడం కామన్… కానీ పీకే అడుగుల్లో కులధోరణే ఓ కొత్త మార్పు…
…… By…. కృష్ణ సాయిరాం ……. పట్టుతప్పిన లీడ్………………………………. జర్నలిజంలో సీనియర్లు, జూనియర్ల మధ్య తేడాను స్పష్టంగా తేల్చి చెప్పేది లీడ్ పట్టుకోవడంలోనే… రెండు మూడేళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్టులు సైతం యథాతథంగా రిపోర్టు చేయమంటే చేసేస్తారు. కానీ సీనియర్లు రాజకీయ పరిణామాలు, నూతనత్వం, చెప్పిన విషయంలోని డెప్త్, పాయింట్ ప్రాధాన్యతను బట్టి లీడ్ తీసుకుంటుంటారు. అదే సీనియార్టీని వెల్లడిస్తుంది. ఏ వార్తకైనా లీడే ముఖ్యం… వార్తను లీడ్ చేసేది అదే… రిపోర్టర్లు పంపే వార్తలను సీనియర్లు డెస్క్ […]
పవన్ కల్యాణ్ కోరుకున్నదే జరిగింది..! వైసీపీకే ఓ స్ట్రాటజీ లేకుండాపోయింది..!!
పవన్ కల్యాణ్ పిచ్చోడేమీ కాదు… జనం అన్ని ఎన్నికల్లోనూ ఘోరంగా తిరస్కరించి ఉండవచ్చుగాక… ఎంచక్కా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉండవచ్చుగాక… కానీ తను నిర్మించుకున్న పొలిటికల్ ప్లాట్ఫాం మనుగడ కాపాడుకోవాలి కదా… ఎప్పుడో ఓసారి, ఏదో ఓ సందర్భం, ఏదో ఓ అంశాన్ని పట్టుకుని ప్రచారతెర మీదకు రావడం… నేను రాజకీయాల్లోనే ఉన్నానహో అని చాటుకోవడం… అది ఆయన అవసరం… నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు… ఆ గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సహా అందరూ […]