ఎస్, నిస్సంకోచంగా ఇది భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి ఇంజక్ట్ చేయడానికి ఉద్దేశించిన సినిమాయే… సినిమా బలమైన మాధ్యమం కాబట్టి కొన్ని క్యాంపెయిన్ చిత్రాల్ని బీజేపీ ప్రజల్లోకి వదులుతోంది… ఆర్టికల్ 370 సినిమా కూడా అదే… కాకపోతే మరీ మన తెలుగు వాళ్లు తీసిన ఇటీవలి వ్యూహం, శపథం, రజాకార్, రాజధాని ఫైల్స్ వంటి సబ్ స్టాండర్డ్ ప్రయత్నాలు కావు… ఒక యురి కావచ్చు, ఒక బస్తర్ కావచ్చు, ఒక ఆర్టికల్ 370 కావచ్చు… కీలకమైన […]
ఓ ఏజ్‌బార్ కోచ్ కథ… ఏజ్‌బార్ హీరోహీరోయిన్లు… ఐనా మైదాన్ ఎందుకు నచ్చింది..?
మైదాన్ సినిమా నచ్చింది… ఎందుకు నచ్చింది..? మన హైదరాబాదీ అన్సంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కమ్ కోచ్ రహీం బయోపిక్ కాబట్టా..? కాదు..! మనకు క్రికెట్ తప్ప మరే ఆటా పట్టదు, అదొక పిచ్చి… కొద్దిగా టెన్నిస్, అంతే… అప్పుడప్పుడూ జావెలిన్ హీరోలు, బాక్సర్లు, అథ్లెట్లు, వెయిట్ లిఫ్టర్లు మెరుస్తున్నా సరే… మగ క్రికెట్ తప్ప మనకు మరేమీ పట్టదు… పైగా ఆయన ఫుట్ బాల్ కోచ్… కాస్తోకూస్తో మనలో హాకీ ఉంది తప్ప ఫుట్ బాల్ తక్కువ… […]
కీర్తిసురేష్ సైలెంట్..! ఆమెకూ తెలుసు… ఊరుకున్నంత ఉత్తమమేదీ లేదని..!!
మాట పెదవి దాటితే మటాష్ అని కొత్త సామెత… సినిమా ఇండస్ట్రీకి ఇది మరీ వర్తిస్తుంది… ఆడ తారలకైతే మరీ మరీనూ… వాళ్లు ఏం మాట్లాడినా మగహం ఒప్పుకోదు… వీళ్ల సిట్యుయేషన్ సున్నితంగా ఉంటుంది… ఏదైనా ఒక్క మాట మనసు విప్పి మీడియా ముందు వెల్లడిస్తే చాలు, దానికి బోలెడు పెడర్థాలు తీస్తారు… మీడియా నానా కథలూ అల్లుతుంది… వెరసి బస్టాండులో నిలబెడతారు, బాధితులైనా సరే..! సరే, వ్యూయర్ షిప్ కోసం యూట్యూబర్లు, మీడియా సైట్స్ ఏవేవో […]
ఆమె పేరు సరళ… అడవి మింగిన వెన్నెల… ఇదీ విరాటపర్వం అసలు కథ…
ఒక కథ కచ్చితంగా చర్చనీయాంశమే… ఎందుకంటే, ఈ కథ వెనుక అనేక పార్శ్వాలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి కాబట్టి… తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి కాబట్టి….. నక్సలైట్ల పేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు… ఇన్ఫార్మర్ల పేరిట నక్సలైట్లు బోలెడు మందిని ఖతం చేశారు… వందల కుటుంబాల్లో కన్నీళ్లు, రక్తం కలగలిసి పారింది… నిజంగా పోలీసుల చేతిలో హతమారిన ప్రతివాడూ నక్సలైటేనా..? నక్సలైట్లు చేతుల్లో ఖతమారిపోయిన ప్రతివాడూ ఇన్ఫార్మరేనా..? నక్సలైట్ అంటే ఎన్కౌంటర్ […]
ఫాఫం ఢీ..! కామెడీ చేయడానికి అర్జెంటుగా ఆర్టిస్టులు కావలెను..!!
సజావుగా నడిచే ప్రోగ్రాం మీద ప్రయోగాలు చేయొద్దు… వికటించి ఎదురుతన్నే ప్రమాదం ఉంటుంది… అచ్చంగా ఈటీవీ ఢీ షో గతి అంతే… నిజానికి సర్కస్ ఫీట్లనే డాన్సులుగా చూపించే ఆ ప్రోగ్రాంలోకి సుడిగాలి సుధీర్ ఎంటరయ్యాక కామెడీ ప్రధానంగా మారింది… డాన్సుకూ డాన్సుకూ నడుమ కామెడీ బిట్లు భలే పేలేవి… యూట్యూబులో విపరీతమైన వ్యూస్ నమోదయ్యేవి… మొదట్లో ఉదయభాను హోస్ట్ చేసేది… తరువాత జూనియర్స్ రెండు సీజన్లకు నాగబాబు బిడ్డ నీహారిక హోస్ట్… తొమ్మిదో సీజన్ నుంచి […]
భామాకలాపం..! ఈమె ఓటీటీ వంటలక్క… ప్రియమణి సరదాగా లాగించేసింది..!!
అదేదో ఢీ అనే డాన్స్ షోలో చూపించినట్టు… ఏదో హైపర్ ఆది అలా చెప్పగానే, అలాగే బావా అని పిలిచి గట్టిగా ఓ హగ్గు ఇచ్చేస్తుంది పాపం అనుకోకండి… మరీ అంత అమాయక కేరక్టర్ ఏమీ కాదు ప్రియమణి బయట… ఫీల్డులో స్ట్రగుల్ అయ్యీ అయ్యీ రాటుదేలి, కూలిపోయిన కెరీర్ గోడను ఎలాగోలా తిరిగి పేర్చుకుంటోంది… భామాకలాపం అనే ఓటీటీ సినిమా (ఆహా) చూస్తున్నంతసేపూ ఆమె మాత్రమే కనిపిస్తుంది… ప్లజెంట్‌గా ఉంది ఆమె… ఎహె, అందం చందం […]
రెడ్ వాల్..! కణకణ మండిన ఆ రోజుల్లోకి… వేలాది మంది జ్ఞాపకాల్లోకి…
ఒక ఫోటో… ఆశ్చర్యం వేసింది… బెంగుళూరు గూన కప్పిన ఓ పాత ఇల్లు… సిమెంటు పూతలతో మాసికలు వేసిన పాత గోడ… పక్కన ఓ జిల్లేడు చెట్టు… గోడపై విప్లవం వర్ధిల్లాలి అనే వాల్ రైటింగ్… సుత్తీకొడవలి గుర్తు… లంగావోణి, బుగ్గల జాకెట్ వేసుకున్న ఓ అమ్మాయి ఆ సుత్తీ కొడవలి గుర్తు చుట్టూ ఓ లవ్ సింబల్ గీస్తోంది… విప్లవాన్ని ప్రేమిస్తోందా..? విప్లవం కూడా ఓ ప్రేమ చర్యే అంటోందా..? ఆ కథలోకి తరువాత వెళ్దాం… […]