. వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్‌కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం… అంతెందుకు..? ఇదే వర్మ […]
ఈ పుష్పరాజ్ సంగతి సరే… ఏపీలో రాంగోపాలవర్మ అరెస్టు తప్పదా..?!
. అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే క్రమంలో… దేవుళ్లను అరెస్టు చేస్తారా వంటి కొన్ని పిచ్చి కూతల్ని ట్వీటుతున్నాడు కదా రాంగోపాలవర్మ… నిజానికి తనే ఓ పెద్ద ఫ్రాడ్… ఆ ముఖ్యమైన వార్త ఒకటి ఈ పుష్పరాజ్ వార్తల్లో పడి ఎవరూ పట్టించుకోలేదు గానీ… వర్మ నాసిరకం పనితనం, మోసకారితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో… అప్పట్లో జగన్ రాజకీయ జీవితం మీద వ్యూహం, శపథం అని సినిమాలు తీశాడు కదా… జగన్ క్యాంపు డబ్బు సమకూర్చింది… అప్పుడే మనం […]
మేల్ శ్రీరెడ్డి..! చంద్రబాబు సోషల్ వేటలో వర్మ మీద కేసు నమోదు..!!
నేను ఆ డర్టీ పిక్చర్స్‌ను షేర్ చేయదలుచుకోలేదు ఇక్కడ… కానీ రాంగోపాల్ వర్మ చంద్రబాబు అండ్ గ్యాంగు మీద చాలా నీచమైన, కేరక్టర్ అసాసినేషన్ సినిమాలు తీశాడు… అంతకుమించి పిచ్చి పిచ్చి గ్రాఫిక్ బొమ్మలతో సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు… చెత్తా బొమ్మలు… ఆఫ్టరాల్ రాజకీయ విమర్శగా తీసుకోలేం దాన్ని… గతంలో ఎన్టీయార్ మీద కృష్ణ సినిమాలు తీశాడు… కానీ వ్యక్తిగతంగా కించపరచలేదు… తన రాజకీయ విధానాల్ని, పోకడల్ని విమర్శించాడు… అది జస్ట్, విమర్శ… అందులో తప్పులేదు… […]
డెమొక్రటిక్ మూవీ… చిప్ కొట్టేసిన వర్మ బుర్రలో మరో దిక్కుమాలిన ఆలోచన…
వర్మ… భ్రష్టుపట్టిపోయిన ఒకప్పటి క్రియేటివ్ డైరెక్టర్… ఈ వ్యాఖ్యకు వివరణలు కూడా అనవసరం… ఐతే ప్రయోగాలు చేయడంలో దిట్ట, కానీ తలతిక్క ప్రయోగాలు… తను తీసిన రాజకీయ చిత్రాలన్నీ పెద్ద బక్వాస్… చాలా చిత్రాలు డిజాస్టర్లు… తనలోని దర్శకుడు ఏనాడో చచ్చిపోయి, యూట్యూబ్ యాంకర్లతో పిచ్చి ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టుతూ అదోరకం ఆనందం పొందే దిగజారిన స్థాయి తనది… మొన్న జగన్ మీద తీసిన రెండు పార్టుల సినిమాలు మెగా బంపర్ సూపర్ బ్లాక్ […]
ఓహో… వ్యూహం వెబ్ సీరీస్ పేరు శపథం చాప్టర్-1 గా మార్చింది అందుకేనా..?!
ఏదో పరువు దక్కించుకునే పిచ్చి ప్రయత్నం… రాంగోపాలవర్మ జగన్ అధికార ప్రస్థానం మీద వ్యూహం అనే సినిమా తీశాడు కదా… అది మొదటి ఆటకే నీటిబుడగలాగా ఫట్‌మని పేలిపోయింది కదా… అనేక థియేటర్లలో డెఫిసిట్… సరిగ్గా టికెట్లు తెగక ఆటనే ఎత్తేసిన థియేటర్లూ ఉన్నట్టు వార్తలొచ్చాయి కదా… వర్మ జాబితాలో మరో అతి పెద్ద డిజాస్టర్ చేరింది కదా… తను ఎలాగూ ఎప్పుడూ మునిగే బ్యాచ్, కానీ జగన్ పరువును కూడా నిలువునా ముంచేశాడు కదా… ఎన్నికల […]
ఈ పని సాక్షి టీంకు అప్పగించినా… పొలిటికల్ ‘వ్యూహం’ ఇంకాస్త బాగుండేది…
వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..? అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని […]
వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్‌ఫెక్ట్…
వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి… పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… […]
వర్మ ఒక్కడే బతికితే సరిపోతుందా..? వర్శిటీ వీసీ ఏం పాపం చేశాడు మరి…!!
అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు… నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ […]
హాహాశ్చర్యం..! ఆర్జీవీతో జగన్ బయోపిక్..! ఇదేమి కొత్త విపత్తు స్వామీ..?!
ఈరోజు వార్తల్లో ఆసక్తిగా అనిపించిందీ, జగన్‌ను చూస్తే జాలేసిందీ ఓ వార్త ఉంది… అదేమిటంటే..? రాంగోపాలవర్మ అనే ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు జగన్మోహన్‌రెడ్డి బయోపిక్ తీయబోతున్నాడట… తాడేపల్లికి వెళ్లి, జగన్‌తో భేటీ వేసి, సినిమా బడ్జెట్, కథ కమామిషూ మాట్లాడి, మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడట… సినిమా పేరు జగన్నాథ రథచక్రాలు అట… వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసం ఈ సినిమా ఉపయోగపడాలట… ఇన్ని ‘ట’లు ఎందుకంటే..? ఇవేవీ ధ్రువీకరించబడిన వార్తలు కావు కాబట్టి… ఇప్పుడప్పుడే ఎవరూ దీని […]
వర్మే గెలిచాడు… లారా క్లీన్ బౌల్డ్…! నేహా ఔట్… ఇనయ సేఫ్…!!
రాంగోపాలవర్మ గెలిచాడా..? బ్రియాన్ లారా గెలిచాడా..? సీరియస్ ప్రశ్న కాదులెండి… జస్ట్ ఫర్ ఫన్… నిజానికి వర్మకూ, లారాకు సాపత్యం ఏమిటసలు..? పోలిక పెట్టకూడని రెండు వేర్వేరు కేరక్టర్లు… ఎక్కడి వర్మ..? ఎక్కడి లారా..? లారా పేరు తెలియని క్రికెట్ ప్రేమికుడు ఉండదు… తనది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లెజెండ్ స్టేటస్… వర్మ ప్రస్తుత దురవస్థ మనం చూస్తున్నదే, కొత్తగా చెప్పుకునేది ఏముంది..? అయితే… ఓ పోటీలో లారా మీద వర్మ గెలిచాడు… నిజం… మాటీవీలో బిగ్‌బాస్ షో […]