Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…

September 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi....  మరో లేడీస్ సెంటిమెంట్ పిక్చర్ ఈ తలంబ్రాలు . తలంబ్రాలు అనే టైటిల్ కన్నా ఆడది తలచుకుంటే వంటి ఇంకేదో టైటిల్ పెట్టి ఉంటే ఇంకా ఆప్ట్‌గా బాగుండేదేమో ! సక్సెస్ అయింది కాబట్టి తలంబ్రాలే కరెక్ట్ అని తేల్చాల్సి ఉంటుంది .

సినిమాకు షీరో జీవితే . తమిళంలో అప్పటికే అరంగేట్రం చేసి ఉన్న జీవితకు తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా . మొదటి సినిమాలోనే షీరో పాత్ర లభించటం , జీవితంలో భర్త దొరకటం అదృష్టమే . ఆమెతో పాటు ఆమె చెల్లెలు ఉమ కూడా నటించింది . ఉమ తర్వాత పెద్దగా తెరపై కనిపించలేదు… (కొన్ని సినిమాలు ఆగిపోయి, ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుని, వెండితెరకు గుడ్ బై చెప్పింది)…

Ads

uma

  • జీవిత చాలా బాగా నటించింది . మొదట్లో అమాయకురాలిగా , తర్వాత రాటుదేలిన స్త్రీగా , మళ్ళీ సగటు బలహీన భారతీయ స్త్రీగా , క్లైమాక్సులో అపర కాళీగా , ఏకాదశావతారంగా డిఫరెంట్ షేడ్సుని ప్రస్ఫుటంగా చూపించింది .

jeevitha

అయితే ఎక్కువ సినిమాలు నటించకుండానే వైవాహిక జీవితం కొరకు నటన ఆపేసింది . ఈ సినిమాకు ముందు మంచి బాలుడు పాత్రల్లో నటించిన రాజశేఖరుకు ఈ సినిమాలో నెగటివ్ సైకో పాత్ర లభించింది . బాగా మెప్పించాడు కూడా . మంచి పేరు వచ్చింది .

మరో ప్రధాన పాత్ర కళ్యాణ్ చక్రవర్తిది . బాగా నటించాడు . మరో ప్రధాన పాత్ర అంజి . పది పైసలిస్తేనే కానీ ఏమీ చేయడు . ఇస్తే ఏం చేయమన్నా చేసేస్తాడు . ఆఖర్లో లారీ కింద పడి చచ్చిపోయి అయ్యో అని ప్రేక్షకుల చేత అనిపించుకుంటాడు . అతనికీ ఇదే మొదటి సినిమా అనుకుంటా . పేరు సుబ్బారావు అనుకుంటా . Subject to correction .

సినిమాలో ఎక్కువ పాత్రలు కనిపించవు . కనిపించినా ఎక్కువ సేపు ఉండవు . జూనియర్ ఆర్టిస్టులతో లాగించేసారు . సినిమాకు బలమంతా కధ , కధనమే . బిర్రయిన స్క్రీన్ ప్లే , పటిష్టమైన దర్శకత్వం . అనుభవజ్ఞులయిన నిర్మాతలు కదా ! స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటారు .

యం యస్ రెడ్డి గారి కుమారుడు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాత . దర్శకుడు కోడి రామకృష్ణ . అతని ఎకౌంటులో మరో మంచి సినిమా .

 

సినిమా విజయానికి మరో కారణం సత్యం సంగీతం , మల్లెమాల , రాజశ్రీల లిరిక్స్ , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ గాత్రం . పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . బాగా హిట్టయిన పాట ఇది పాట కాదే కాదు , ఏ రాగం నాకు రాదు , వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిది . రాజశ్రీ అద్భుతంగా వ్రాసారు .

మరో హిట్టయిన పాట ఓ దానవుడయిన మానవుడా హృదయం లేని కిరాతకుడా . ఓ రాతిరీ నువ్వెళ్ళిపో కూడా శ్రావ్యంగా ఉండటమే కాకుండా చిత్రీకరణ కూడా బాగుంటుంది . నిన్న నీవు నాకెంతో దూరం డ్యూయెట్ కూడా బాగుంటుంది . టైటిల్సుతో వచ్చే పాట బుల్లి పాప కోరేది తల్లి పాలు కన్నెపిల్ల కోరేది తలంబ్రాలు శ్రావ్యంగా ఉంటుంది .

పాత సినిమాల్లో పాటల లిరిక్సుకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు . సంగీతం ఢాంఢాంగా ఉండకపోవటం వలన ప్రేక్షకులకు సాహిత్యం , సాహిత్యంతో పాటు ట్యూన్లు గుర్తుండేవి . బేక్ గ్రౌండ్ మ్యూజిక్ డైలాగులను , లిరిక్సును మింగేయకుండా ఆహ్లాదంగా వినిపించేది .

ఇప్పటి సినిమాల సంగీత దర్శకులు ఏమనుకుంటున్నారంటే BGM అంటే స్క్రీన్ని పగలకొట్టడం అనుకుంటున్నారు . వాళ్ళకు తగ్గ దర్శకులు , సౌండ్ ఇంజనీర్లు తగలడుతున్నారు . టివిలో చూసేటప్పుడు సౌండ్ పెంచకపోతే ఏక్టర్ల డైలాగులు వినిపించవు . సౌండ్ పెంచితే ఢాంఢాంలు తప్ప ఇంకేం వినిపించవు . ఈ సమస్య నాకేనా అందరిదీనా తెలవదు .

గణేష్ పాత్రో డైలాగులు పదునుగా ఉంటాయి . అప్పట్లో మహిళా ప్రేక్షకులకు బ్రహ్మాండంగా నచ్చేసిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడండి . ఎక్కడా స్లో కాదు . బిరబిరా సాగుతూనే ఉంటుంది . Watchable . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…
  • ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions