Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాట వల్లే రామకృష్ణ థియేటర్ అద్దాలు పగులగొట్టినట్టు గుర్తు…

April 14, 2024 by M S R

Subramanyam Dogiparthi….   తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని సి నారాయణరెడ్డి వ్రాసి , ఘంటసాల పాడిన పాట గుర్తుకొస్తుంది తల్లా పెళ్ళామా సినిమా పేరు తలవగానే . తాను నమ్మింది ఏదయినా ధైర్యంగా అరవగల వాడు NTR . అది సమైక్యాంధ్ర అయినా , కుటుంబ నియంత్రణ విషయమైనా లేక భూ పరిమితి చట్టాలయినా , రావణుడిని దుర్యోధనుడిని హీరోలుగా చూపటమయినా , మరేదయినా . సినిమాలో ఈ పాట పెట్టడం వలన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు రామకృష్ణ థియేటర్ అద్దాలు కూడా పగలకొట్టారని గుర్తు …

1970 లో వచ్చిన ఈ సినిమాలో గొప్ప నూతన సందేశం ఏమీ లేకపోయినా పాటల వలన , NTR వలన హిట్టయింది . NTR ఓ పాట మధ్యలో of course వంటి మాటలను పలకటం జనానికి నచ్చింది . Of course . ఆయన ఏం చేసినా నచ్చుతుంది అనుకొండి . నువ్వు నవ్వుతున్నావు ఖవాలీ మోడల్లో పాటని మహమ్మద్ రఫీ పాడారు . మమతలెరిగిన నా తండ్రి పాటను శాంతకుమారి ఆర్ద్రంగా , చాలా బాగా పాడారు .

తాగితే తప్పేముంది అఫ్ కోర్స్ తాగితే ఒకనాడు తప్పు మరి నేడో తాగకపోతే తప్పు పాట హుషారుగా ఉంటుంది . ఇక్కడ CM గా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి . అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్నారు ; చేసారు . Of course . ముప్పై సంవత్సరాల కింద పరిస్థితులు వేరనుకోండి .

ఓ బంగారు గూటిలోని చిలుకా పేద ముంగిట్లో వాలానని ఉలుకా పాటలో ఇంగ్లీషు మాటలు జనానికి గమ్మత్తుగా వినిపించాయి . బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది అనే పాట హరికృష్ణ మీద చిత్రీకరించబడింది . శ్రీకృష్ణావతారం సినిమా తర్వాత హరికృష్ణ బాలనటుడిగా ఈ చిత్రంలో ముఖ్య పాత్రే నటించారు .

ఆడపడుచు సినిమాలో చెల్లెలుగా నటించి మెప్పించిన చంద్రకళ ఈ సినిమాలో జోడీగా నటించి మెప్పించింది . శాంతకుమారి , రేలంగి , నాగభూషణం , దేవిక , నాగయ్య , ప్రభాకరరెడ్డి , సత్యనారాయణ ప్రభృతులు నటించారు . ఉమ్మడి కుటుంబం సినిమాలో సుబ్బయ్య పాత్ర వంటి పాత్రలో ముక్కామల కనిపిస్తారు . అప్పటివరకు హీరోయిన్లుగా నటించిన దేవిక , సావిత్రిలు వదినలు అయిపోయారు . దేవిక ఈ సినిమాలో వదినయింది .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు వీక్షించవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?
  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions