శరత్ కుమార్ చింత….. తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో దొరుకుతుంది. అన్ని భాషల సినిమాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తాడు. ఈ వెబ్ సైట్‌ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఫలితం లేకపోయింది. ఎదుట ఉన్నది ఎంతటి వాడైనా తమిళ్ రాకర్స్ లెక్క చేయరు. వీళ్లకు భయం భక్తి అనేవి లేవు. సినిమా విడుదలైన మార్నింగ్ షోకే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్ లో లైవ్ చూపిస్తామని బెదిరిస్తారు.
విశాల్ లాంటి కొందరు హీరోలు రియల్ హీరోలుగా మారి వేటాడినా.. అస్సలు భయపడరు. తమిళ్ రాకర్స్ మాఫియా ముందు ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే. తమిళ సినిమా.. తెలుగు సినిమా .. హిందీ సినిమా అనే భేదం వీళ్లకు అస్సలు లేదు. తమిళనాడు- ఆంధ్రా- మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ చేపట్టినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఫస్ట్ డే ఫస్ట్ షో వరల్డ్ ప్రీమియర్ బై తమిళ్ రాకర్స్ అని నేరుగా పోలీసులను సైబర్ క్రైమ్ బ్రాంచీనే బెదిరించేంత సత్తా ఉన్నోళ్లు.
సినిమాల నుండి వెబ్ సిరీస్ ల వరకు అన్నింటిని కూడా కాపీ చేసి పైరసీ వెర్షన్ ను ఆన్ లైన్ లో ఉంచడం ద్వారా నిర్మాతలకు వందల కోట్ల నష్టం కలిగిస్తున్న తమిళ్ రాకర్స్ మీద సోనీ లివ్ లో, ఆగస్ట్ 19 నుండి వెబ్ సిరిస్ Streeming కాబోతుంది. తమిళ్ రాకర్స్ కు చెందిన వారు పైరసీకి మాత్రమే పాల్పడం కాకుండా ఇతర నేరాలకు కూడా చేస్తున్నారు. వారు సమాజం నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు అన్నట్లుగా ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతుంది.
Ads
ఇదంతా ట్రైలర్ లో హింట్ ఇచ్చాక నిజమైన తమిళ రాకర్స్ కు తెలియకుండా ఉంటుందా. వాళ్ళు ట్రైలర్ చూసినట్టు ఉన్నారు. అసలు తమకు సంబంధం లేని నేరాలను చేసినట్టు ఈ సిరీస్ లో చూపించారని, ఇది చాలా తప్పని, మీ ఫిలిం ఇండస్ట్రీలో అందరూ దొంగలే, ఒకరినొకరు మోసం చేసేవారేనని… కొత్త సినిమాల పైరసీ విషయంలో మాకు మీ ఇండస్ట్రీ జనాలే హెల్ప్ చేస్తారని,.. కమల్ హాసన్ సినిమా ఉత్తమ విలన్ రిలీజైన మూడు గంటలకే మా చేతికి HD ప్రింట్ ఇచ్చారని, ఒక సినిమా నిర్మాత ఇంకో సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేయాలంటూ తమను కాంటాక్ట్ అయ్యాడని, ఇలా మీ ఇండస్ట్రీలోనే పెద్ద దొంగలు ఉన్నారని.. అలాంటపుడు పైరసీ చేస్తున్న తమ గురించి బయటపెట్టడం, మా గురించి నెగిటివ్ గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఓ చిన్న వార్నింగ్ లాంటిది తమ వెబ్ సైట్ లోనే ఉంచారు.
తమిళ రాకర్స్ పైరసీ నెట్ వర్క్ నిజంగా ఎలా పని చేస్తుంది? థియేటర్ల నుంచి హెచ్ డి క్వాలిటీ సినిమా ఎలా బయటికి వస్తుంది? ఈ మిస్టరీని తెలుసుకోవాలంటే ఈ వెబ్ సీరీస్ చూడాలన్నమాట. ఈ సిరిస్ లో 2013 లో రిలీజైన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా లీక్ గురించి చెప్పబోతున్నారుట మరి..! ఇష్టారాజ్యంగా పైరసీయేతర వ్యవహారాల్లోకి తమిళరాకర్స్ ను లాగితే, సోనీ లివ్ మీద సదరు సైట్ ఎలా స్పందిస్తుందనేదీ ఆసక్తికరమే…!!
Share this Article