.
Subramanyam Dogiparthi …. 1987 సంక్రాంతి రద్దీలో వచ్చి నిలదొక్కుకున్న సినిమా ఈ తండ్రీకొడుకుల ఛాలెంజ్ . తమిళంలో 1963 లో వచ్చిన నీదిక్కుపిన్ పాశం అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా .
తమిళంలో MGR , బి సరోజాదేవి , యస్వీఆర్ , కన్నాంబ , యం ఆర్ రాధ నటించారు . తెలుగులో కృష్ణ , రాధ , సుమలత , సత్యనారాయణ , జయంతి , కన్నడ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు .
Ads
ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ , డాక్టర్ దంపతులకు ఇద్దరు కొడుకులు . ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ , మరొకరు న్యాయం లాయర్ . ఊహించని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసరే తన భార్యను ఓ హత్య కేసులో నిందితురాలిగా అరెస్ట్ చేస్తాడు . తండ్రితో ఛాలెంజ్ చేసి తన తల్లిని నిర్దోషిగా రుజువు చేస్తాడు హీరో కృష్ణ .
ఈ సినిమా కూడా 1+2 సినిమాయే . ఇద్దరు హీరోయిన్లుగా రాధ , సుమలత నటించారు . అయితే హీరో గారు మరదలయిన సుమలతను ప్రేమించడు . వన్ సైడ్ లవ్ మాత్రమే . కృష్ణకు చాలా సాదాసీదా సినిమా . సత్యనారాయణకే నటించే అవకాశం కాస్త ఉంటుంది . అలాగే జయంతికి . రాధ , సుమలతలది గ్లామర్ స్పేసే .
విలన్లుగా కన్నడ ప్రభాకర్ , చలపతిరావు , హీరోయిన్ తండ్రిగా గొల్లపూడి మారుతీరావు , పబ్లిక్ ప్రాసిక్యూటరుగా రంగనాధ్ , అతని భార్యగా దీప , ఇతర పాత్రల్లో త్యాగరాజు , మాడా , సిబిఐ ఆఫీసరుగా ఈశ్వరరావు , ఐటమ్ డాన్సరుగా అనూరాధ , తదితరులు నటించారు . పరుచూరి బ్రదర్స్ డైలాగులు కాస్త చప్పగానే ఉంటాయి .
మా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి వాస్తవ్యుడు , సీనియర్ శ్రీరంజని కుమారుడు అయిన యం మల్లికార్జునరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలనన్నీ వేటూరే వ్రాసారు . సుశీలమ్మ , రాజ్ సీతారాంలు పాడారు
. థియేటర్లో బాగున్నా బయట పెద్దగా హిట్ కాలేదు . కృష్ణ సుమలతలకు అప్పా అమ్మా పడిపోయాను ప్రేమలో అనే ఒక డ్యూయెట్ . కృష్ణ , రాధలకు మూడు డ్యూయెట్లు ఉంటాయి .
ఎక్కు ఎక్కు బండి ఎక్కు , లబక్కు జభక్కు నీ నడుము , మాఘ మాసం వచ్చాక మంచు వెన్నెల వచ్చాక అంటూ సాగుతాయి ఈ డ్యూయెట్లు . అనూరాధ హాట్ సాంగ్ ఆటకు రేటుంది సుమా హుషారుగా ఉంటుంది . వేటూరి వారి కలంలో సిరా అయిపోయిందేమో అనిపిస్తుంది .
అయిననూ కృష్ణ మాస్ ఇమేజ్ , రాధ సుమలత గ్లామర్ సినిమాను గట్టెక్కించాయి . అంత సంక్రాంతి రద్దీలో కూడా నిలదొక్కుకుంది . సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు , రాధ సుమలతల అందాభిమానులు చూడొచ్చు . It’s a commercial , family-sentiment , feel good entertainer . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article