కొన్ని సినిమాలను, కొందరు హీరోలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి… ఎలాంటి సినిమాలు అంటే డిఫరెంట్ కాన్సెప్టులతో… రెగ్యులర్ మూస, ఫార్మాట్, హైపర్ హీరోయిజం కథలకు భిన్నంగా వచ్చేవి… అవి సాహసాలు… తీసే దర్శకుడికి, తీయించే నిర్మాతకు… అలాంటి సినిమాయే ఈ తంగలాన్ కూడా…
ఎక్కడా సగటు కమర్షియల్ పోకడకు దారిమళ్లకుండా… కథను స్ట్రెయిట్‌గానే చెబుతూ ఎక్కడా డీవియేషన్ లేకుండా సాగింది… కబాలి వంటి కథతో అందరి దృష్టినీ ఆకర్షించిన పా.రంజిత్ ఈసారి భారీ సినిమాను భుజానికెత్తుకున్నాడు… చాలావరకూ సక్సెసయ్యాడు… ఇక హీరో..?
మన హీరోస్వామ్యంలో అన్నీ సూపర్ హైపర్ హీరోయిక్ కథలే కదా… అప్పుడప్పుడూ ఒక కమలహాసన్, ఒక మమ్ముట్టి… ఇదుగో ఈ విక్రమ్… పాత్ర కోసం తను దైహికంగా, నటనాపరంగా ఏ సాహసం అయినా చేస్తాడు… నటనలో ఇరగదీసేస్తాడు… వంక పెట్టే పనే లేదు… మన తెలుగులో ఇలాంటి సాహసాలు చేయగల సత్తా ఉన్న స్టార్ హీరోలు ఉన్నారా..? (బహుశా త్వరలో రాబోయే సూర్య కంగువ కూడా డిఫరెంట్ జానరే అంటున్నారు…)
Ads
లేరు… నటనకు కొరత ఉందని కాదు, నటించగలరు, కానీ ఒక మూస పాత్రలకే పరిమితం, ఆ లెక్కలు దాటి బయటికి రారు… ఒక్కరైనా ఇలాంటి పాత్రను కల కనండర్రా కాస్త…!
తంగలాన్ కథలో ఓ పూర్వకాలం నాటి తెగ… కథాకాలం కూడా పాతదే… ఆ తెగ కోలార్ బంగారు గనులకు సమీపంలో ఉండేది… వాళ్లను వాడుకుని ఆ గనుల అన్వేషణ జరపాలనేది ఇంగ్లిష్ దొరల ప్రయత్నం… తాము ఉద్దరింపబడతామనే భావనతో హీరో ప్రయత్నాలు… అడ్డుకునే మరో మహిళాపాత్ర ఆరతి… ఈ పాత్రను మాళవిక మోహనన్ చేసింది…
కథను కాసేపు వదిలేస్తే వీళ్లిద్దరూ ఆ పాత్రల్లో జీవించేశారు… పోటీలు పడ్డారు… ఈసారి నేషనల్ అవార్డులకు ఈ ఇద్దరి పేర్లూ పరిగణనలోకి రావాలి… దర్శకుడు కూడా ఆ కాలంలోకి తీసుకెళ్తాడు ప్రేక్షకులను… అడవులు, ఆదివాసీలు, బంగారు గనులు, ఆంగ్లేయులు… చాలా పెద్ద కాన్వాస్… రొటీన్ సినిమాలకు భిన్నంగా అందుకే ఇలాంటి సినిమాల గురించి చెప్పుకోవాలని మొదటే చెప్పింది ఇందుకే…
లోపాలు లేవా..? నిజంగా సినిమా ఇంప్రెసివ్‌గా ఉందా..? ప్రేక్షకుడిని కనెక్ట్ అవుతుందా..? కాదు, లేదు… ఎందుకు..? మనం వేపను తినీ తినీ అదే తీపి అనుకునే స్థితికి చేరుకున్నాం… సడెన్‌గా ఓ డిఫరెంట్ టేస్ట్ దొరికినా మనకు త్వరగా ఎక్కదు… ఐతే అక్కడక్కడా బోర్ కొట్టేలా సీన్లు పడ్డయ్… బిగిగా, వేగంగా సాగిపోయే స్క్రీన్ ప్లే కాదు… స్లోగా సాగిపోతుంటుంది… సోకాల్డ్ కమర్షియల్ వాసనలు ఉండవు… అందుకే డిఫరెంట్ కాన్సెప్టుల్ని ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది…
కల్కి తరువాత మరో చూడబుల్ పెద్ద సినిమా రాలేదు, వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ అంత పెద్ద కనెక్టింగ్ సినిమాలు కావు… ఎంతోకొంత థియేటర్లకు విక్రమ్ రప్పిస్తాడేమో… తెలుగులో వాణిజ్యపరంగా నిలదొక్కుకుంటుందో లేదో తెలియదు గానీ తన సొంత ఇండస్ట్రీ తమిళంలో మాత్రం హిట్ ఖాయం… బీజీఎం విషయంలో జీవీ ప్రకాష్ వోకే… పాటలు సోసో… సినిమాటోగ్రఫీ కూడా వోకే… ఎడిటింగే వీక్‌గా ఉన్నట్టు అనిపించింది… ఓవరాల్‌గా… డిఫరెంట్ సినిమాలు కావాలని కోరుకునే ప్రేక్షకులు ఆదరించతగిన సినిమా…!!
Share this Article