.
బిగ్‌బాస్ అంటేనే ఓ ఫేక్… అంతా స్క్రిప్టెడ్ యవ్వారం… ప్రేక్షకులకు ఏం చూపించాలో, ఆట ఎలా ఆడించాలో, ఎవరిని బయటికి పంపించాలో అంతా వెల్ ప్లాన్‌డ్… ఏ కంటెస్టెంటుతో ఎంతమేరకు ముందస్తు ఒప్పందాలుంటాయో ఆమేరకే కథ నడుస్తూ ఉంటుంది…
ఐనా సరే, జనం చూస్తూ ఉంటారు… సినిమాలు, వెబ్ సీరిస్, టీవీ సీరియళ్లు చూడటం లేదా..? ఇదీ అంతే… పేరుకే రియాలిటీ షో… సరే, ఈసారి తిక్క ప్రయోగాలు చేశారు, వికటించాయి… టీఆర్పీలు దెబ్బతిని ఎప్పటిలాగే చేతులు, మూతులు కాలుతున్నాయి…
Ads
ఇప్పుడు చెప్పుకునేది ఏమిటంటే..? ప్రేక్షకుల వోట్లు అనూహ్యంగా మారిపోతున్న తీరు… అంటే ఫేక్ వోటింగు ఈ బిగ్‌బాస్ వోటింగును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదన్నమాట… బయట ఉండే ఆయా కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ అన్ని కథలూ పడుతుంటాయి… అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ వోటింగు ఏమిటో మనకు తెలియదు, వాళ్లు చెప్పరు… చెబితే వాళ్లు అనుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేరు కదా…
ప్రతిసారీ తనూజ నామినేషన్లలో ఉంటుంది… ప్రతిసారీ టాప్ వోటింగులో ఉంటుంది… కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె బిగ్‌బాస్ దత్తపుత్రిక అనే ప్రచారం ఇతర కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్ స్టార్ట్ చేశాయి… మ్యాగ్జిమం ఎఫెక్ట్ పెడుతున్నయ్ ఆమె పాపులారిటీని దెబ్బతీయడానికి…
అకస్మాత్తుగా పడాల కల్యాణ్ టాప్ వోటింగులో కనిపిస్తుంటాడు… (అఫ్ కోర్స్, అనఫిషియల్ పోల్ ప్లాట్‌ఫారాల మీద)… ఎలా..? ఇన్నాళ్లూ తను ఉండీ లేనట్టుగా ఉన్నాడు హౌజులో… ఒకేసారి తనకు ఈ పాపులారిటీ ఏమిటి..? ఇన్నాళ్లూ టాప్ త్రీ కంటెస్టెంట్ అని చెబుతున్న సుమన్ శెట్టి ఆల్ ఆఫ్ సడెన్ వోటింగు జాబితాలో కిందకు జారిపోయాడు…
రీతూ ఎప్పుడూ ఓ మోస్తరు సాదాసీదా వోటింగే… ఆమెను చాన్నాళ్లు హౌజులో ఉంచుతారనీ, లవ్ ట్రాకు కోసం డెమో పవన్‌ను కూడా కంటిన్యూ చేస్తారనీ అనుకున్నదే… కానీ తనూజ..? ఆమె డెఫినిట్‌గా ఫైటర్… తన పాయింట్ ఏమిటో స్పష్టంగా, ఏ తొట్రుపాటు లేకుండా చెప్పగలదు… మొదటి నుంచీ ఆమె ఈ సీజన్‌లో క్లియర్ డామినేషన్ చూపిస్తోంది…
ఎమోషన్ ఆమెకు మైనస్ అంటారు గానీ… ఎమోషనే ఆమె బలం… ఎప్పుడూ కుట్ర, ఫౌల్ ప్లే కనిపించలేదు… ఇమాన్యుయెల్ ఈరోజుకూ నామినేషన్లలో లేడు… పైగా మూడుసార్లు కెప్టెన్… చివరకు మొన్న అందరినీ నామినేట్ చేసిన బిగ్‌బాస్ ఇమ్మూను మాత్రం వదిలేశాడు, హౌజ్ అభిప్రాయం పేరిట… వోకే, తను ఎంటర్‌టెయినరే కానీ… నిజంగా తనూజకన్నా తను కదా బిగ్‌బాస్ దత్తపుత్రుడు… మరి తనూజ మీద ఈ ముద్ర దేనికి..?

ఇప్పుడున్నవాళ్లలో పూర్ పర్‌ఫార్మర్స్ నిఖిల్, గౌరవ్… తరువాత దివ్య… రీతూ, డెమోన్, సంజన, భరణి… మధ్యస్థ స్థాయి… బయట వినిపించే అభిప్రాయాలను (సోషల్ పోస్టులు) బట్టి టాప్ ఫైవ్ ఎవరంటే… 1) తనూజ 2) ఇమాన్యుయెల్ 3) సుమన్ శెట్టి 4) సంజన 5) భరణి… మరి హఠాత్తుగా ఎక్కడో ఉన్న పడాల కల్యాణ్ పైకి ఎలా చేరుకున్నాడు వోటింగుల్లో..? అంతా మాయ..!!
ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం… తనూజ టాప్… ఆమె ప్లే ఫెయిర్… కాదని బిగ్‌బాస్ ఏ వేషాలు వేసినా అది షోను మరింత దిగజార్చడమే..!!
Share this Article