Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నేను, రేవంత్, కవిత, ఆ జడ్జి… మొత్తం 6500 మందిమి నక్సలైట్లం…’’

August 8, 2025 by M S R

.

ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణకు హాజరైన తరువాత కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ కొన్ని చదవండి ముందుగాా….

‘‘సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యా, 6 వేల 500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది… నాతోపాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు సహా ఆనాటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పోన్లను కూడా ట్యాప్ చేశారు…

Ads

నా ఫోన్ ప్రతి క్షణం ట్యాప్ చేశారు… టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జీ ఫోన్లను కూడా ట్యాప్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్… ఆఖరకు సొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచుడు… దేశవ్యాప్తంగా మంచి పేరున్న SIB వ్యవస్థను భ్రష్టు పట్టించారు…

ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారు… ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు లాంటి లుచ్చాగాళ్లను ఏం చేసినా తప్పులేదు… మావోయిస్టుల పేర్లు చెప్పి నాతోపాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఫోన్లను ట్యాప్ చేశారు…

సినిమా వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు… పెద్ద వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు….

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నరు… ఇంకా అనేకం…ఆ పైసలన్నీ ఎటుపోయినయ్… ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నడా? ట్విట్టర్ టిల్లు తిన్నడా తేల్చాలి… దీనిపై ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదు? తక్షణమే ఈడీ విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది…

కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయి… ఎందుకు ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను అరెస్ట్ చేయడం లేదు..? సీఎం కూడా వెంటనే సిట్ విచారణకు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వాలి… జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలతోసహా ఉన్నాయి కదా… జడ్జీలను పిలిచి వాళ్ల స్టేట్‌మెంట్ రికార్డు చేసే అధికారం సిట్ పోలీసులకు ఉన్నదా?

నాటి సీఎం కేసీఆర్, ఆయన కొడుకు ట్విట్టర్ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్ కు ఉందా?… అందుకెే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయండి… మీరు లేఖ రాస్తే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధం… సీబీఐ నేరుగా విచారణ చేసే అధికారం అప్పగిస్తే కేసీఆర్, ఆయన కొడుకును ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లం…’’



బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రి… సో, తన ప్రతి మాటకూ విలువ ఉంటుంది… అది బీజేపీ మాటగానే భావించాల్సి ఉంటుంది… రాష్ట్ర స్థాయి సిట్ వల్ల లాభం లేదు కాబట్టి… పాత సీఎం, జడ్జిలు, సినిమా వాళ్లు, పెద్ద వ్యాపారులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు ఎట్సెట్రా ఎవరినీ వదల్లేదు…

రాష్ట్రానికి వచ్చీపోయే బీజేపీ నాయకుల ఫోన్లనూ వదల్లేదు, అదెందుకు బండి సంజయ్ చెప్పడం లేదు… ఆ 6500 లిస్టులో ఆ నంబర్లు ఉన్నాయో లేదో తెలియదు… అడ్డగోలుగా సాగిన ఓ అరాచకపర్వం… నిజంగా రాష్ట్ర స్థాయి సిట్ హోదా, అధికార పరిధి సరిపోదు అనుకుంటే, సీబీఐకి అప్పగిస్తే బెటరేమో, వెంటనే ఈడీ ఎంటర్ అవుతుంది… బండి సంజయ్ డిమాండ్ కూడా అదే…

ఫోన్ ట్యాపింగు ద్వారా ఆ టీమ్ ఏమేం అక్రమాలకు పాల్పడింది, వాటి తీవ్రత ఎంత..? బయటికి ఇంకా తెలియడం ఇంకెన్ని విషయాలున్నయ్..? ప్రభాకరరావు వంటి కీలకబాధ్యులు నోళ్లు విప్పడం లేదు… ఏమో… సీబీఐకి అప్పగించడమే బెటరా… లేదు, లేదు, బీజేపీ కేసీయార్ మీద ప్రేమతో కేసు నీరుకారుస్తుంది అనుకుంటే, ఇప్పటివరకూ ఉన్న పరిశోధన వివరాలతో జుడిషియల్ ఎంక్వయిరీని అడగడం బెటరేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జస్టిస్ సూర్యకాంత్..! కొత్త సుప్రీంకోర్టు సీజేఐ కొన్ని కీలక తీర్పులు ఇవీ..!!
  • ఆ ట్రంప్ కొడుకే వచ్చాడు అతిథిగా… అంగరంగ వైభవం ఓ తెలుగు పెళ్లి…
  • ఊపిరి పీల్చుకోవడానికి మరో విజ్ఞప్తి… ముగ్గురు సీఎంలకు మరో అభ్యర్థన…
  • ‘పవర్’… ఎప్పుడు వాడాలో తెలియాలి… వదిలేయడమూ తెలియాలి…
  • పోటీ… పోటీ…! ఫుడ్, రవాణా, కిరాణం, ఇతర డెలివరీల్లో పోటాపోటీ..!!
  • బీఫ్..! ఇండియా నుంచి ఎగుమతులు – రాజకీయాలు – నిజాలు..!!
  • పేలిపోయిన తేజస్..! ఎవరు బాధ్యులు..? ఏం చేయాలి మనం..? (పార్ట్-3)
  • ఫైనల్ సెల్యూట్…! మనసుల్ని ద్రవింపజేసే ఓ విషాద దృశ్యం..!!
  • తేజస్ ఎందుకు పేలిపోయిందో తెలుసా..? ఇవీ కారణాలు..!! పార్ట్-2
  • తేజస్ కుప్పకూలి, పేలిపోవడం వెనుక పైలట్ తప్పుందా..? పార్ట్-1

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions