Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజబాబు హీరో… దాసరి తొలి సినిమా… ఎస్వీఆర్ నట విశ్వరూపం…

July 1, 2024 by M S R

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం , ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం . కపట జీవితాల సారాంశాన్ని నాలుగు ముక్కల్లో చెప్పేసిన పాట . గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1973 లో వచ్చిన ఈ తాత మనవడు సినిమా .

తాత తిన్న బొచ్చె తరతరాలు అనే సామెతను వివరించే గొప్ప సినిమా . SVR నట విరాట రూపాన్ని మరోసారి ఈ సినిమాలో చూడవచ్చు . కమేడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన రాజబాబుని హీరోని చేసేసిన సినిమా . రాజబాబుకు తన నటనాశక్తిని చూపే అవకాశం వచ్చింది ఈ సినిమాలో . విజయనిర్మల , అంజలీదేవి , రాజసులోచన , గుమ్మడి , సత్యనారాయణ , కొమ్మినేని శేషగిరిరావు , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .

రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు , నూకాలమ్మను నేనే నీ పీకని నొక్కేత్తానే పాటలు శ్రావ్యంగా ఉంటాయి . శ్రీవిద్య నృత్యం చేసిన జానపద బాణీ పాట రాయంటీ నా మొగుడు రంగామెల్లి తిరిగి రాలేదు చాలా బాగుంటుంది . శ్రీవిద్య ఇంత గొప్పగా డాన్స్ చేస్తుందా అని అనిపిస్తుంది .

Ads

సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది అనే పాట కుటుంబ నియంత్రణ అవసరం , అలాగే మీ నాన్నకు నువ్వు గొయ్యి తీస్తే నీకు నేను తీయాలి కదా గొయ్యి అనే సందేశాలను ఇస్తుంది . ఏమిటో ఈ లోకమంతా ఎంతకు అంతుపట్టని వింత తందానా అనే బుర్రకధ కూడా చాలా బాగుంటుంది .

హీరో హీరోయిన్లకు డ్యూయెట్లు లేకుండా , అవి లేవని ప్రేక్షకులకు అనిపించకుండా లాగించేసిన సినిమా . అంత బిర్రయిన కధ , స్క్రీన్ ప్లేలను దాసరి అందించారు . డైలాగులు ఈ సినిమా బలానికి ఒక కారణం . నటీనటుల అద్భుతమైన నటన , శ్రావ్యమైన సంగీతం , రామకృష్ణ , సుశీల , యల్ ఆర్ ఈశ్వరి గొంతులు , దాసరి కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , వెరశి ఒక గొప్ప సెంటిమెంటల్ , ఫీల్ గుడ్ మూవీ .

మూడు కేంద్రాల్లో వంద రోజులు , ఒక సెంటర్లో ఇరవై అయిదు వారాలు ఆడింది . మద్రాసు సవేరా హోటల్లో జరిగిన రజతోత్సవ వేడుకలకు NTR ముఖ్య అతిధిగా విచ్చేసారు . కన్నడంలోకి , హిందీలోకి రీమేక్ అయింది . రెండవ ఉత్తమ చిత్రంగా రజిత నంది అవార్డుని గెలుచుకుంది

మా నరసరావుపేటలో మూడు నాలుగు సార్లు చూసి ఉంటా . టి విలో ఎప్పుడు వచ్చినా కాసేపయినా చూస్తుంటా . దాసరి సినిమాల్లో డ్రామా బాగుంటుంది . డైలాగులు పేలుతుంటాయి . ఆ రెండూ నాకు చాలా ఇష్టం . ఈ సినిమాలో పాటలు , శ్రీవిద్య డాన్స్ బాగుంటాయి . సినిమా యూట్యూబులో ఉంది . చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . An unmissable movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… By డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 55 ఏళ్ల క్రితం గల్లంతు..! ఆ అణు పరికరం కథ తెలిస్తే నేటికీ వణుకే..!!
  • నందమూరి దిష్టి తమన్… తెలియకపోతే అన్నీ మూసుకోవాలి బ్రదర్..!!
  • మూడు తెలుగు సినిమా పాటలు- ఒక నోస్టాల్జియా… అజరామరం…
  • నకిలీలకే ‘మెరుపు’లెక్కువ..! ముగ్గురు గరల్‌ ఫ్రెండ్స్, గర్భాలు..!!
  • తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!
  • హీరో మెటీరియలే..! కానీ ‘ఆది’ నుంచీ ‘డ్రైవ్’ కుదరడం లేదు పాపం…
  • మసక మసక చీకటిలో… మళ్లీ ఆనాటి స్మిత నయగారాలు, నయా రాగాలు…
  • బాలకృష్ణ అఖండ తాండవాలకు బీజం పడింది ఈ సినిమాతోనే..!!
  • మెస్సి టూర్ – నిజమైన సార్ధకత ఎక్కడుంది..? | Khelo India రియాలిటీ చెక్…
  • తగ్గొద్దు… రేవంతన్నా… ఏదేమైనా కానీ… ఈ స్పీడ్ ఆగొద్దు….

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions