Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో డైలాగ్స్… పైగా నెగెటివ్ రోల్… ఐదే నిమిషాల భలే పాత్ర…

December 4, 2024 by M S R

.
తాయారమ్మ బంగారయ్య . సినిమా టైటిలే కాదు ; సినిమా అంతా వాళ్ళదే . టైటిల్ పాత్రల్లో సత్యనారాయణ, షావుకారు జానకిలు అదరగొట్టేసారు .

ఆడంబరాలతో , ఇగోలతో , స్వాతిశయంతో పాడయిపోయిన కాపురాలను రిపేర్ చేసే కధాంశంతో చాలా సినిమాలే వచ్చాయి . కానీ , ఈ సినిమా కధని దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు చాలా పకడ్బందీగా వ్రాసుకున్నారు . అంతే బిర్రుగా స్క్రీన్ ప్లే , అందుకు తగ్గట్లుగానే దర్శకత్వం వహించారు .

ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ సింహభాగం సత్యనారాయణ, షావుకారు జానకి, కొమ్మినేని శేషగిరిరావులదే . శంకరాభరణం సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మరి కొంతమంది భాగస్తులతో తీసిన ఈ సినిమా 1979 లో విడుదల అయింది .

Ads

మేము ఈ సినిమాను మా గుంటూరులో రంగమహల్లో చూసాం . ఇప్పుడు ఆ రంగమహల్ , ముందున్న శేషమహల్ రెండూ లేవు . చరిత్ర గర్భంలో కలిసిపోయాయి . మళ్ళా సినిమాకొద్దాం .

ఈ సినిమా సక్సెస్ అవటానికి మరో ఇద్దరు కూడా కారణమే . ఒకరు సంభాషణల రచయిత జంధ్యాల . ఎక్కడ రిపేర్ల అవసరం ఉంటే అక్కడకు డ్యూటీలో దిగిపోదామా అనే సత్యనారాయణ, షావుకారు జానకిల డైలాగ్ చాలా సందర్భానుసారంగా ఉంటుంది . మరొకరు సంగీత దర్శకుడు చక్రవర్తి . ఆ సంగీతానికి వేదికను కల్పించింది ఆత్రేయ, వీటూరి .

వీటూరి వ్రాసిన మై నేం ఈజ్ బంగారయ్య నే చెప్పిందే బంగారమయ్య పాట ఈ సినిమాకు ఐకాన్ సాంగ్ . ఆ పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది . సుశీలమ్మ, బాల సుబ్రమణ్యాలు చాలా బాగా పాడారు . సత్యనారాయణ, షావుకారు జానకిలు ఇరగతీసారు .

మరో శ్రావ్యమైన పాట సంగీత , చంద్రమోహన్ ధరించిన పాత్రల మీద ఉంటుంది . ఆత్రేయ వ్రాసిన ఆనాడు ఈనాడు ఏనాడు ఆడబొమ్మని చేసాడు మగవాడు పాట .

ఈ సినిమాలో ప్రధాన కధాంశం రెండు జంటల కాపురాలు రిపేర్లు చేయబడుట . రంగనాధ్, సంగీత ఒక జంట అయితే మరో జంట చంద్రమోహన్, మాధవి . ఈ ప్రధాన కధాంశానికి సమాంతరంగా అస్పృశ్యత అంశంపై మరో కధని నడిపించాడు దర్శకుడు . అందులో రాజబాబు, కొత్త నటి జయ నటించారు . రాజబాబు, అతని స్నేహితులు పాడే పాట ఛాయాదేవిని టీజ్ చేసే పాట కూడా బాగుంటుంది . గుడిసె పీకి మేడ మీద వేయాలి అనే పాట ఇది . ఆత్రేయ వ్రాసారు .

ఈ సినిమాలో ఓ విశేషం ఏమిటంటే చిరంజీవి ఓ అయిదు నిమిషాలు తళుక్కుమంటారు . డైలాగ్స్ లేకుండా . నెగటివ్ రోల్ . ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య, డబ్బింగ్ జానకి, మాడా, శరత్ బాబు, తదితరులు నటించారు .

సినిమా, పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . Undoubtedly a watchable , sentimental , feel good movie . ముఖ్యంగా సత్యనారాయణ, షావుకారు జానకిల పాత్రలను చెక్కిన తీరు , వారిద్దరి నటన ఈ సినిమాకు బలం . వారి నటనను తప్పక చూడాల్సిందే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… ( — దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!
  • సజ్జనార్ స్టెప్పుల్లో తప్పేముంది? విమర్శించడమే ‘రాంగ్ స్టెప్ !!
  • యథా కేసీయార్- తథా హరీష్ రావు… పక్కా యాంటీ దళిత్ పాలసీ…
  • ప్యారడైజ్‌ మూవీలో సవారీ కులదేవత, ఆ ఉగ్రశక్తి ఎవరో తెలుసా..?
  • మహానటి బోల్డ్ కేరక్టర్ – అసలు డోరోతి కంట్రవర్సీ ఏమిటంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions