Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన జగనిష్టుడు… అందుకే సాక్షికిష్టుడు… అదే రాస్తాడు… దానికే తిట్టేయాలా..?!

March 9, 2023 by M S R

ఏబీకే ప్రసాద్… తెలుగు జర్నలిజంలో ఘనుడు… కానీ ఒకప్పుడు… ఇప్పుడు కేవలం ఓ కాలమిస్టు… అదీ వైసీపీ సానుకూల వ్యాసాలు మాత్రమే రాసుకునే అనుకూలమిస్టు… తన జర్నలిజం కెరీర్‌లో బోలెడు మంది ముఖ్యమంత్రులను, లీడర్లను చూశాడు, పరిశీలించాడు… కానీ ఇప్పుడాయనకు జగన్ మాత్రమే కీర్తించదగిన లీడర్‌గా కనిపిస్తున్నాడూ అంటే… అది ఆయన ఇష్టం… కేవలం అదే కోణంలో సాగే వ్యాసాలు సాక్షికి అవసరం కాబట్టి… సాక్షికి ఆయన ఇష్టుడు… ఇక్కడివరకే…

ఎడిటోరియల్ వ్యాసాలు చదివే పాఠకులెవరున్నారు ఇప్పుడు..? ఏదో ఇలాంటి సుదీర్ఘ వ్యాసరత్నాలు ఏవో ఒకటి పేజీలో పెట్టాలి కాబట్టి, పేజీ నింపాలి కాబట్టి, అదీ జగన్ సానుకూల వ్యాసాలే అయిఉండాలి కాబట్టి… ఏబీకే వ్యాసాలు యథాతథంగా సాక్షిలో అచ్చేస్తారు… అంతే… అందుకే తను జర్నలిస్టును అని కూడా చెప్పుకోడు పాపం ఆయన… చెప్పడు గానీ ఆయన జస్ట్, ఓ వ్యాసుడు మాత్రమే… (ఎడిటోరియల్ వ్యాసాల్లో జనం కాస్త చదివేది ఆంధ్రజ్యోతిలో వచ్చే రాధాకృష్ణ విరచిత కొత్తపలుకు మాత్రమే… కొందరు తిట్టుకుంటూ, కొందరు మెచ్చుకుంటూ… నిజానికి జనం దృష్టికోణంలో ఈ కాలమ్స్ ఎప్పుడో కాలమ్ చెల్లిన పాత్రికేయ ప్రయోగం…)

గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ మీద ఆయన ఆహా ఓహో అని రాసేశాడు… వీళ్లు అచ్చేశారు… కానీ తెలుగుదేశం అనుకూల జర్నలిస్టులకు, కాలమిస్టులకు, వ్యాసులకు ఇది నచ్చలేదు… అంతటి ఏబీకే ఇంత నాసిరకం కాలమ్ రాయడం ఏమిటి అని కస్సుమంటున్నారు సోషల్ మీడియాలో…! ‘‘ఏమయ్యా… విశాఖను, అలాగే ఆంధ్రను పెట్టుబడులు వరించేశాయా..?  రాష్ట్రానికి పారిశ్రామిక వరద వచ్చేసిందంటావా…? ఒక పార్టీ పట్ల అంతులేని విషం …. ఇంకో పార్టీ పట్ల అమృతమంత ప్రేమా బహిరంగంగా ఒలకబోసే ఈయన జర్నలిస్ట్ అని ఎలా అంటారో మా బుర్రలకు అర్ధం కాదు.

తన భాషా పాటవంతో ‘సినీ వంగడం’, ‘గాలివాటు రాజకీయాలు’ అంటూ ఎదుటి పార్టీలని తిడుతూ, తనకిష్టమైన పార్టీలని మాత్రం ధీరుడు , శూరుడు అంటూ పొగిడే ఈయన జర్నలిస్టు ఎలా అవుతాడు..? సరే, ఇప్పట్లో అందరూ పత్రికా ఎడిటర్లూ అంతేలే అంటే, ఈయన్ని ఆ గాటనే కట్టేసాం, పట్టించుకోనవసరం లేదు అని అంటే ఓకే… ఎందుకంటే, ఒక పార్టీలో చేరకుండా, ఆ పార్టీకి బయట నుంచి సపోర్ట్ చేసే ముసుగు వీరులు ఈ రోజు ఎంతో మంది వున్నారు. వారిలో ఈయనా ఒకరు,. అంతే. ఇప్పుడైతే ఈయన్ని మళ్ళీ జర్నలిస్ట్, మహా మేధావి గట్రా బిరుదులూ ఇచ్చేసి పిలవకండి…
ఆయన్ని వైకాపా పార్టీలో చేరమని చెప్పండి,. తప్పేమీ లేదు. ఈ వయసులో కూడా రాజకీయాల్లో, పార్టీల్లో చేరచ్చు. ఇతర పార్టీలని తప్పుబట్టండి. మేమేమీ అనము. కానీ ఇలా మాజీ సంపాదకులు, జర్నలిస్టు అనే ముసుగుల మాటున ఇలా వ్రాయడం ఏమిటి..?’’ ఇలా సాగింది ఓ మిత్రుడి కోపం… అది నాసిరకం వ్యాసమే… గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ మీద అపాత్ర రాతలే… కానీ ఈరోజు ఆయన జర్నలిస్టు కాదు, కేవలం ఓ కాలమిస్టు… నేను జర్నలిస్టును కానహో అని చెప్పుకోనక్కర్లేదు… కాలమిస్టుకు ఓ ఒపీనియన్ ఉంటుంది, అదే రాస్తాడు… దాన్ని ఆక్షేపించాల్సిన పనిలేదు… ఈమాత్రం దానికి ఆయన వైకాపాలో చేరాలా..? ఇదేం సలహా..?! ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అనుకూల వ్యాసాలు రాసే అర్హత లభించునా..? హేమిటో… ఇలాంటి నియమావళి కూడా ఉందా..?!

అసలు జర్నలిస్టు అనే పదానికి సరైన నిర్వచనం ఏమీ ఉండదు… నిష్పక్షపాతి అనే పర్యాయపదం అస్సలే కాదు… వర్తమానంలో ప్రతి జర్నలిస్టూ రంగులు పూసుకున్నవాడే… పత్రిక, చానెల్‌ను బట్టి, వాటి పొలిటికల్ లైన్లను బట్టి, వాటి బాసుల పార్టీలను బట్టి… ఏదో ఓ పార్టీ రంగు చొక్కా వేసుకునేవాడే… జర్నలిస్టులే అలా ఉన్నప్పుడు… జర్నలిజమే అలా ఉన్నప్పుడు… ఖచ్చితంగా ‘దండె కొట్టే’ కాలమిస్టులు నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు..? ఆయనేదో ఈ వయస్సులో పొద్దుపోక ఏదో రాస్తాడు… వీళ్లు కళ్లకద్దుకుని అచ్చేస్తారు… కానీ చదివేదెవరు..? ఈమాత్రం దానికి ఆయన్ని తిట్టిపోయడం దేనికి..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions