ఒకప్పుడు… అంటే నవ్యాంధ్ర, అనగా పచ్చాంధ్ర… చంద్రాంధ్ర… టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో… వందల మంది సోషల్ మీడియా వారియర్స్ జగన్ మీద క్రియేటివ్ మీమ్స్, పోస్టులు, వీడియోలతో ఎక్కీ దిగేవాళ్లు… జగన్ ఫ్యాన్స్ కూడా ఆర్గనైజ్డుగా గాకపోయినా బాగానే కౌంటర్ చేసేది… కానీ చంద్రబాబు అదృష్టం తిరగబడి, అవమానకరమైన ఓటమి పొందాక… ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది…
జగన్ సోషల్ మీడియా ఈరోజుకూ పెద్దగా వ్యవస్థీకృతం కాలేదు… కానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, వేధింపులు పెరగడంతో టీడీపీ సోషల్ మీడియా కాస్త డిమోరల్ అయిపోయింది… మూతబడిపోలేదు కానీ, దూకుడు తగ్గింది… చాలారోజుల తరువాత మళ్లీ ఓ క్రియేటివ్ పోస్టు సోషల్ మీడియాలో బాగా రన్ అవుతోంది… ఒసారి ఇది చూడండి…
Ads
https://twitter.com/JaiTDP/status/1330879021387632641
………. చంద్రబాబు హెరిటేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించి, జగన్ అమూల్‌ను రంగంలోకి దింపాడు కదా… ఫస్ట్ ఫేజులో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో మొదటి దశ కొనుగోళ్లకు తెరతీశాడు జగన్… నిజానికి ఆయా సహకార డెయిరీలను ముంచేసి, హెరిటేజ్‌ను బలోపేతం చేశాడని కదా ఆరోపణ… అక్కడే స్టార్ట్ చేశాడు జగన్… ఆ ప్రకటనలు జోరుగా విడుదలయ్యాయి…
దాన్ని కౌంటర్ చేయడానికి ఆ అమూల్ మార్క్ కార్టూన్లనే ఆధారం చేసుకున్నది టీడీపీ సోషల్ మీడియా… అదే మీకు పైన కనిపిస్తున్న ట్వీట్… ఎవరో గానీ చాలా ఆలోచించి, కష్టపడి ట్వీటాడు… చంచల్‌గూడ జైలులో కూర్చున్న జగన్, తన యూటీ ఖైదీ నంబర్… జైలు గది గోడల మీద అమూల్ – హెరిటేజ్ ఈక్వేషన్లను రాసుకుంటున్నట్టుగా…. ఛలో, రెడీ, రెడ్డీ, గెట్ అసెట్… గో…
రెడ్డి గారూ ఓ ఆస్తి కనిపిస్తోంది, రెడీ అయిపో అన్నట్టుగా… ట్వీట్ బాగుంది… అంటే క్రియేటివిటీ కనిపిస్తోంది అని… దీనికి తగిన కౌంటర్ వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఇంకా కనిపించలేదు గానీ… తెలుగుదేశం సోషల్ మీడియా క్రియేటివ్ టీం ఇంకా పూర్తిగా వట్టిపోలేదు, కష్టపడుతోంది అని అనిపిస్తోంది… కాకపోతే ఫైర్ తగ్గి ఉండవచ్చుగాక… !!
ఐనా మన భ్రమ గానీ… ఒక్కసారి అమూల్ వంటి ఆర్గనైజేషన్లు రంగంలోకి దిగాక… పాడిరైతులకు నాలుగు రూపాయల ఫాయిదా కనిపిస్తున్నప్పుడు… ఈ ట్వీట్లతో ఒరిగేది ఏముంది..? హెరిటేజ్‌ను ఒడ్డుకు లాగేదేముంది..? చంద్రబాబు సొంత ఆర్థిక స్థంభం హెరిటేజ్‌ను కూల్చేయాలన్నదే జగన్ ప్లాన్ కదా… ఈ సోషల్ ప్రచారంతో వచ్చే ఫాయిదా ఏముంటుంది..? సరే, కానివ్వండి… ప్రస్తుతం తెలంగాణాలో బీజీపీ వర్సెస్ టీఆర్ఎస్ దారుణమైన సోషల్ వార్ సాగుతోంది… ఇది పెద్దగా ఆనదు కానీ… కానివ్వండి, ఏదో ఒకటి… జనానికి రీచ్ కావాలి కదా…!!
Share this Article