నగ్న సత్యం … ఓ జ్ఞాపకం … కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు … బట్టలపై పన్నులు విధించాలి అని నిర్ణయం … దీనికి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులతో కలిసి చంద్రబాబు ఇందిరాపార్క్ వద్ద ధర్నా …. ఈ పన్ను విధింపు వల్ల ప్రజలు ఇక బట్టలు కట్టుకోలేరు అని టీడీపీ తీవ్ర ఆందోళన … దేశంలో ఎన్ని కోట్ల మంది బట్టలు వేసుకుంటారో, వారంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏమవుతుందో వస్త్ర వ్యాపారాలు గణాంకాలతో సహా వివరిస్తున్నారు … ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి … వర్షపు తుంపర్లు పడుతుంటే సునామీ అని ప్రచారం చేసే సత్తా ఆ పార్టీకి ఉంది …
బాబు ధర్నా అంటే రిపోర్టర్ గా కవర్ చేయాలి . హడావుడిగా వెళ్లి ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో బైక్ పార్క్ చేసి లాక్ వేస్తుంటే … పక్కనే ఉన్న చెట్టు వెనక నుంచి ఓ ఆదిమానవుడు నా వైపు రాసాగాడు …
80 ప్రాంతంలో తెలుగులో ఆదిమానవుల మూగ సినిమాలు చాలా వచ్చేవి. సినిమాలో మాటలు ఉండవు. శరీరంపై ఆకులే ఉండేవి … అలానే ఇతని శరీరం మీద నూలు పోగు కూడా లేదు. నడుముకు ఆకులు ఉన్నాయి …
Ads
దగ్గరకు వచ్చి పలకరించి ఎలా ఉంది అని అడిగాడు … వస్త్రాలపై పన్ను వేస్తే జనం ఇక బట్టలు కట్టుకోకుండా ఆకులు కట్టుకొని తిరుగుతారు అని సింబాలిక్ గా చూపిస్తున్నాడు అన్నమాట .. పార్టీ నిరసన ప్రోగ్రాం ఏది జరిగినా ఈనాడు సిటీ పేజీలో ఇతని ఫోటో రావలసిందే …
రైతు, నిరుద్యోగి, ధరలు పెరిగితే కుటుంబరావు… ఏ నిరసన ఐనా ఇతని ఫోటో తప్పని సరి … రైతు ఆవేదన, నిరుద్యోగి ఆక్రోశం అంటూ క్యాప్షన్ తో ఇతని ఫోటో … అన్ని వేషాలు ఒకే వ్యక్తివి అని ఫోటో గ్రాఫర్ కు తెలుసు, సబ్ ఎడిటర్ కు తెలుసు. మంచి ఫోటో కావాలి అంటే తప్పదు …
అతని పేరు కృష్ణ గౌడ్ అంబర్ పేట టీడీపీ చోటా లీడర్ .. దగ్గరకు వచ్చి ఎలా ఉంది అని అడిగితే, నీ కోణంలో సూపర్ … ధర్నాకు సంబంధించి బాబు ఫోటో వేసినా వేయక పోయినా నీ ఫోటో వేసి తీరాల్సిందే అన్నాను .. అతను వెళ్ళాక మరో యువ లీడర్ చౌదరి అని మీలాంటి వాళ్ళు కూడా అతన్ని ఎంకరేజ్ చేయడం బాగా లేదు … మేం ధర్నాకు డబ్బు ఖర్చు చేసి ఏర్పాట్లు అన్నీ చేస్తే మాకు ప్రచారం రాదు … అతను వచ్చి బట్టలు విప్పి ఆకులు కట్టుకుంటే ప్రచారం అని బాధ పడ్డాడు … చూడు చౌదరి, అతను చేసింది కరెక్ట్ అని నేను చెప్పలేదు … అతని కోణంలో కరెక్ట్ అన్నాను ..
బట్టలు వేసుకొని రావడం కామన్ … ఇది మీడియాకు నచ్చదు … పూర్వం మీడియా అంటే ప్రజలకు సమాచారం చేరవేసేది అని … ఇప్పుడు మీడియా అంటే వినోదం, కాలక్షేపం … విలువలు లేకుంటేనే మీడియాలో ప్రాధాన్యత లభిస్తుంది … పైగా అదే మీడియా పడిపోతున్న విలువలు అంటూ గగ్గోలు పెడుతుంది.
దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కల అరుపులు వినిపించాయట … చెట్టు చాటు నుంచి ఆకులు కట్టుకొని వచ్చిన ఆ చోటా లీడర్ వచ్చినప్పుడు … వెర్రి తలలు వేయబోతున్న మీడియా శబ్దాలు అప్పుడు వచ్చే ఉంటాయి …. By Budda Murali…
Share this Article