Murali Buddha………. ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీకి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు … ఓ జ్ఞాపకం …
1999 ఎన్నికల సమయం .. చంద్రబాబు నివాసంలో మీడియా నిరీక్షణ .. ఉదయం నుంచి రాత్రి వరకు… పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షణ.. హాలులో సోఫాలోనే జారగిలపడి … కళ్ళు మూతలు పడ్డాయి .. కళ్ళు తెరిచి చూస్తే పక్కన చింపిరి జుత్తు తో అదే సోఫాలో ఓ మహిళ …. గంటల తరబడి తిండి తిప్పలు లేక అసహనం , నీరసం … పక్కన ఆమె కనిపించడంతో అసహనంగానే ఏంటీ మీరు కూడా టికెట్ కోసమా.? అని అడిగితే అటు నుంచి ఊహించని సమాధానం. శృంగవరపు కోట అసెంబ్లీ సీటు అడిగితే , భద్రాచలం పార్లమెంట్ సీటు ఇచ్చారు అని సమాధానం. నిద్ర తేలిపోయింది. మరెందుకు వచ్చారు అంటే ?
టికెట్ తీసుకోని నేను ఇంట్లోనే ఉన్నాను, ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవడం లేదని ఫిర్యాదు చేశారట. దాంతో బాబు గారు రమ్మంటే వచ్చాను అని సమాధానం. అంతకు ముందు ఆమెను పార్టీ కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదు. ఆమెతో మాట్లాడినా రాజకీయాల గురించి ఏమీ తెలియదు అని అర్థం అవుతుంది. విషయం తెలుసుకుంటే ఆమె భర్త ఎన్టీఆర్ భవన్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహించే పోలీసు. 99 ఎన్నికల్లో బాబు తటస్తుల నినాదం ఇచ్చారు .!
Ads
ఒక అప్లికేషనే కదా ఇస్తే పోయేదేముంది అని ఆమె భర్త చెప్పడంతో ఇచ్చారు .st అసెంబ్లీ నియోజక వర్గం శృంగవరం కోటకు దరఖాస్తు చేస్తే ఏకంగా భద్రాచలం పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. అసలు ప్రచారం చేయడం లేదని బాబు పిలిచి మాట్లాడిన అభ్యర్థి దుంపా విజయ మేరీ… ఎన్నికల్లో విజయం సాధించారు కూడా … తటస్తుల కోటాలో టీడీపీలో చేరినవారు ఆ తరువాత పెద్దగా కనిపించలేదు . విజయ మేరీ కూడా తరువాత కనిపించ లేదు.
……………
జెరాక్స్ చేసుకొని మళ్ళీ ఇచ్చేస్తా అనగానే వెయ్యి పేజీల బుక్ నా చేతిలో పెట్టాడు ఆ ఎంపీ … నవ్వు వస్తున్నా ఆపుకుంటూ సీరియస్ గానే అడిగాను మళ్ళీ ఇవ్వాలి అంటూ అతను లావు పాటి బుక్ చేతిలో పెట్టాడు . పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలతో ఓ బుక్ తయారు చేసి ఎంపిలకు ఇస్తారు … వీటిని చదివే ఎంపీలు చాలా తక్కువ .. వార్తలు రాసుకోవచ్చు అని మీడియాకు ఆసక్తి .
అలాగని మీరు ఎలాగూ చదవరు, మాకు ఇవ్వండి అని అడగలేం … అలా ఇస్తే కనీసం బుక్ చదివే ఓపిక లేదు రాష్ట్రం గురించి వీళ్ళేం మాట్లాడుతారు అని మీడియా అనుకుంటుంది అని సందేహం . దాంతో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు జెరాక్స్ తీసుకోని ఇస్తా అనగానే సైఫుల్లా అనే ఎంపీ ఇచ్చేశాడు .
ఏ రిపోర్టర్ ఐనా వెయ్యి పేజీలు జెరాక్స్ తీసుకోని ఇస్తాడా ? ఇవ్వాలన్నా మీటింగ్ ముగియగానే తిరిగి వెళ్లి పోయిన అతని ఎలా ఇస్తారు .. ఈ టెక్నీక్ చూసి మిత్రుడు వార్త రిపోర్టర్ నాగేశ్వర్ రావు ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి వద్దకు వెళ్లి సార్ జెరాక్స్ తీసుకోని ఇస్తా అంటే నిర్మొహమాటంగా అతను తిరస్కరించాడు . నేను అక్కడికి వచ్చి టెక్నీక్ మంచిదే కానీ సరైన వ్యక్తి వద్ద ప్రయోగించలేదు … మొత్తం ఎంపీల్లో ఆ బుక్ కచ్చితంగా చదివే వారు ఎవరైనా ఉన్నారా అంటే సోలిపేట పేరు ముందు చెప్పవచ్చు .. సోలిపేటను వదిలి ఇంకెవరి వద్ద నైనా ప్రయత్నించు అని చెప్పాను .. సోలిపేట రాజ్యసభ సభ్యులు ఐనా వ్యవహారాలు ఏమీ ఉండవు, శ్రద్దగా చదువుతారు .
సైఫుల్లా విషయానికి వస్తే…. కాలం కలిసి వస్తే అదృష్ట లక్ష్మి ఇంటికి వచ్చి తలుపు తడుతుంది అనడానికి ఉదాహరణ … 96 లో ఆయనకు ఫోన్ లేదో లేక ఎన్టీఆర్ భవన్ లో ఆయన ఫోన్ నంబర్ లేదో కానీ ఎన్టీఆర్ భవన్ నుంచి అనంతపూర్ లో పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సైఫుల్లాను పిలిపించి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . 96లో రాయలసీమ నుంచి ఒక ముస్లిమ్ నాయకుడి అవసరం పడింది . సైఫుల్లా పంట పండింది . బాబు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలను , సంపన్నులను రాజకీయాల్లోకి ఆకర్షించారు . తటస్తుల కోటానో , రిజర్వేషన్ కేటగిరి కిందనో ఒక్కోసారి ఊహించని విధంగా కొందరి పంట పండింది .. Mla టికెట్ కోసం దశాబ్దాల తరబడి నిరీక్షించే వారు ఎంతో మంది కనిపిస్తారు కొంత మందికి అదృష్టం అలా వళ్ళో వచ్చి వాలి పోతుంది . రాజకీయాలు లాటరీ లాంటివే …
Share this Article