Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్నబ్‌తో టీడీపీ అనవసర కయ్యం… అది యెల్లో రిపబ్లిక్ టీవీ కాదు…

December 9, 2025 by M S R

.

ఇండిగో సంక్షోభం టీడీపీ, రిపబ్లిక్ టీవీల మధ్య చిచ్చు పెట్టింది… మంత్రి లోకేష్ రివ్యూ చేస్తున్నారు, వార్ రూమ్ ఏర్పాటు చేశారు అంటూ టీడీపీ ప్రతినిధి రిపబ్లిక్ టీవీ చర్చలో చెప్పుకొచ్చాడు… దాన్ని ఆర్నబ్ ఒకరకంగా వెక్కిరించాడు…

నిజానికి టీడీపీ ప్రతినిధి చెప్పిన జవాబులే హాస్యాస్పదం… ఇండిగో సంక్షోభంతో లోకేష్‌కు ఏం సంబంధం..? అందుకే ఆర్నబ్ అడిగాడు, రివ్యూ చేయడానికి లోకేష్ ఎవరు అని..! ఎందుకంటే… అది రిపబ్లిక్ టీవీ… యెల్లో మీడియా అసలే కాదు కాబట్టి…

Ads

అందరికీ తెలుసు రిపబ్లిక్ టీవీ బీజేపీకి అనుకూలం అని… ఐనా అప్పుడప్పుడూ బీజేపీని కూడా కార్నర్ చేస్తాడు… ఇండిగో సంక్షోభం మీద ఆడుకున్నాడు తను… తను జర్నలిస్టు… టీడీపీని కార్నర్ చేశాడనే అక్కసుతో దాన్ని బాయ్‌కాట్ చేయడం వల్ల ఒరిగేదేముంది..? ఆర్నబ్‌కు నష్టమేముంది..? టీడీపీతో ఏమిటయ్యా ఈ కయ్యం అని మోడీ ఏమీ మందలించడు తనను..!!

అందుకే ఆర్నబ్ మరోసారి టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు… నన్ను బహిష్కరిస్తారు సరే గానీ, ముందుగా మీ మంత్రి సరిగ్గా పనిచేసేలా చూసుకొండి అని మళ్లీ వెక్కిరించాడు… తను అంతే… పడని మీడియాను బహిష్కరించడం తెలుగు రాజకీయాల్లో సహజమే కావచ్చుగాక… కానీ దీన్ని కాస్త విడిగా చూడాలి…

పూర్తిగా కార్నరయ్యారు కాబట్టే అక్కసుతో ఆ టీవీని బహిష్కరించారు అనే అపప్రథ టీడీపీకే..! అనవసరంగా రిపబ్లిక్ టీవీని గోకుతోంది… అసలు ఆ డిబేట్‌‌లోకి ఎవరు వెళ్లమన్నారు ఆ ప్రతినిధిని..! ఆర్నబ్ అంటే టీవీ5 డిబేట్ ప్రజెంటర్లు అనుకున్నారా ఏమిటి..?!

నిజానికి ఏ రేంజ్ గెస్టయినా సరే, ఆర్నబ్ ఆడుకుంటాడు… అల్లాటప్పాగా కాదు, ముందు కొంత వర్క్ చేస్తాడు, సబ్జెక్టులోకి వెళ్తాడు… కొన్ని మినహాయింపులు వదిలేస్తే ఎక్కువ శాతం జనం కోణంలోనే వెళ్తాడు… కాకపోతే తన డిబేట్ స్టయిల్ చాలామందికి నచ్చదు, అమర్యాదగా బిహేవ్ చేస్తాడని, గెస్టుల పట్ల గౌరవాన్ని చూపించడని… కానీ నిజానికి తను పాపులరైందే ఆ ధోరణితో కదా… అందుకే తను మారడు, అలాగే ఉంటాడు…

arnab



తను ఆడుకునే తీరు ఎలా ఉంటుందో ఓ తాజా ఉదాహరణ… వాల్ స్ట్రీట్ బ్యాంకర్లను, అమెరికా ప్యానెలిస్టులను వాయించిపడేశాడు…

“రష్యా ఆర్థిక వ్యవస్థ చిన్నది, ఇన్‌సిగ్నిఫికెంట్” అని చెప్పిన వారిని లైన్‌లో పెట్టి, ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఫుల్ కార్నర్ చేసేశాడు… ముందుగా “అనేకానేక ఆంక్షలున్నా సరే రష్యా G7 కంటే ఎక్కువ ఎదిగింది, ఇది ఎలా సాధ్యం?” అని అడిగితే వాళ్ల దగ్గర నో ఆన్సర్…

“మీ బోయింగ్ విమానాలు 40% రష్యన్ టైటానియంతోనే తయారవుతున్నాయి, ఇప్పుడు రష్యా మీద ఆంక్షల వల్ల మీరే ఇబ్బంది పడుతున్నారు కదా?” అని మరో ప్రశ్న… అమెరికా ప్యానెలిస్ట్ తడబడుతూ… “అవును, కానీ…” అని ఏదో చెప్పబోగా… ఆర్నబ్ మళ్లీ “…కానీ ఏమిటి? మీ దేశం రష్యా మెటల్స్ లేకుండా నడవగలదా?” అని ఆల్మోస్ట్ దండయాత్ర చేశాడు…

మూడో ప్రశ్న పలాడియంపైన… “మీ సెమీకండక్టర్ చిప్స్‌కి అవసరమైన పలాడియం కూడా రష్యా నుంచే వస్తోంది, ఇప్పుడు మీ ఇంపోర్ట్స్ 30% పెరిగాయి కదా?” అని అడిగాడు… నో ఆన్సర్… చివరగా “ఒకవైపు మీ దేశం 38 ట్రిలియన్ డాలర్ల అప్పుల్లో మునిగిపోతూ అంటే మీరేమో రష్యాను ‘చిన్న ఎకానమీ’ అంటున్నారా?” అని ఇంకో దెబ్బ…

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు విషయంలోనూ ఇదే తరహా దాడి… ట్రంప్ జనవరి 20, 2025న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14172 ద్వారా ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాడు దాన్ని…

దీనిపై ఆర్నబ్ అడిగిన నాలుగు ప్రశ్నలు… 1) ఈ పేరు మార్చడం ద్వారా మెక్సికోను అవమానిస్తున్నారు  కాదా? మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ ‘ఇది ప్రపంచానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే’ అని చెప్పారు, మీరు ఎందుకు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు?” అని ట్రంప్ సపోర్టర్‌ను నిలదీశాడు…

2) “ఈ పేరు మార్పుకు అమెరికా ట్యాక్స్ పేయర్లు భరించే ఖర్చు $ 500 మిలియన్లు అని అంచనా.., మ్యాప్‌లు, వెబ్‌సైట్‌లు, డాక్యుమెంట్లు అన్నీ మార్చాల్సి ఉంటుంది – మరి ఇది అమెరికా ఎకానమీకి ఎలా లాభం?”

3) “గూగుల్ మ్యాప్స్ మెక్సికో యూజర్లకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’  అనే చూపిస్తోంది, మరి ఇది ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అవుతుందా? మీ అమెరికా ‘గ్రేట్‌నెస్’కి ఏమాత్రం పని చేస్తుంది ఇది… ఇక మెక్సికో ‘నార్త్ అమెరికాను, మెక్సికన్ అమెరికా’ అని పిలవాలా?” అని సర్కాస్టిక్‌ ప్రశ్న…

4) “ట్రంప్ ఇదే ఆర్డర్‌లో అలాస్కాలోని డెనాలీ పర్వతాన్ని మౌంట్ మెకిన్లీగా తిరిగి మార్చాడు – ఇవన్నీ అసంబద్ధాలు కాదా? అమెరికా విదేశీయులతో ట్రేడ్ వార్ చేస్తుంటే, పేర్లు మార్చడం ద్వారా ఏమి సాధిస్తారు?” అని అడిగి ఆ ప్యానెలిస్టులను పూర్తిగా గందరగోళంలో పడేశాడు… స్పుత్నిక్ ఇండియా హెడ్ డిమిట్రి సైమ్స్ ఫ్యాక్ట్స్‌తో సపోర్ట్ చేస్తుంటే, ఆర్నబ్ ఇలా అమెరికా ప్యానెల్‌తో ఆడుకున్నాడు… ఆర్నబ్ ధోరణి మీద చాలా విమర్శలు ఉండవచ్చుగాక... కానీ కొన్ని కోణాల్లో మంచి ఆటగాడు...

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • BRS అర్థరహిత విమర్శలు..! ‘కార్బన్ క్రెడిట్స్’పై కుతంత్రం..!!
  • జస్ట్ ఓ మూస మాస్ మూవీ… ఒక హిట్ కాంబో వర్కవుట్ కాలేదు…
  • ఆర్నబ్‌తో టీడీపీ అనవసర కయ్యం… అది యెల్లో రిపబ్లిక్ టీవీ కాదు…
  • బాబూయ్… టీఎంసీ నేతలకు ప్రతిదీ గోకడమే అలవాటుగా ఉంది…
  • నాగబాబు ఇన్‌ఫ్లుయెన్స్ కనిపిస్తోంది… భరణి కెప్టెన్ అయిపోయాడు….
  • ఎవడికి ఏది చేతనైతే… అదే ప్రజాస్వామ్యం, అదే న్యాయం ఈ దేశంలో…
  • తెలంగాణ ఈ దేశంలోని రాష్ట్రమే మోడీ సాబ్… మరిచిపోయినట్టున్నవ్…
  • మమతా బెనర్జీ పార్టీ పునాదులకు పగుళ్లు… అచ్చంగా ‘SIR’ ఫలిస్తోందిలా…
  • రాజేంద్రప్రసాద్- చంద్రమోహన్… ఐనా కామెడీ జాడే లేని ఓ టైమ్‌ పాస్…
  • సొంత మంత్రిపై ఎన్టీఆర్ స్టింగ్ ఆపరేషన్… ఆ ఇంట్రస్టింగ్ కథ తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions