నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఎంత ప్రాక్టికల్ మనిషికైనా సరే కొన్నిసార్లు ఎమోషన్స్ తన్నుకొస్తాయి… కన్నీళ్లు బయటికొస్తాయి… సహజం… ఐతే తను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం వేరు… అది స్టార్ మా పరివార్ అవార్డుల వేదిక…
అంటే ఏమీలేదు… వివిధ మాటీవీ సీరియళ్లలో నటించిన నటీనటులకు అవార్డులు… దాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు… ముఖ్య అతిథుల్లో ఒకడిగా నాగార్జున వచ్చాడు… అదే వేదికగా అక్కినేని వందేళ్ల వేడుక (సెంటినరీ)ను కూడా ప్రదర్శించారు… అక్కినేని పాత పాటల్ని నెమరేసుకోవడం… అమల, సుశీల తదితరులు మాట్లాడారు… ఆ సందర్భంగా నాగార్జున అక్కినేని తలుచుకుని, ఎమోషన్ ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు… తనను ఎప్పుడూ అలా చూడం…
నిజానికి తను కన్నీళ్లు పెట్టుకున్న ఆ ప్రోగ్రాం ప్రోమో చూస్తుంటే (ఆదివారం ప్రసారం అవుతుంది…) నాగార్జున కన్నీళ్లను చూస్తుంటే కొన్ని చకచకా సినిమా సీన్లలాగే గిర్రున తిరుగుతూ గుర్తొస్తాయి… మరీ రీసెంటుగా… తన ఎన్ కన్వెన్షన్ హాలును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది… హైడ్రా తొలి ఆపరేషన్… అది నాగార్జునకు బిగ్ షాక్… దీనిపై ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని దుస్థితి… ఎందుకంటే, చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొంత నిర్మాణం జరిగినట్టు ఆధారాలు కనిపిస్తున్నాయి, గతంలో కేసీయార్ ప్రభుత్వమూ కొంత సతాయించి, వెనక్కి తగ్గింది…
Ads
ఇదే విషయంలో కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా నాగార్జునకు మరో షాక్… అది మరీ పరువు తీసే వ్యవహారం… సరే, కోర్టును ఆశ్రయించాడు… అది పదే పదే వార్తల్లో వస్తున్నన్ని రోజులూ తమ కుటుంబం పరువుకు భంగకరమే… మరీ సమంతను కేటీయార్ దగ్గరకు పంపించడానికి తండ్రీకొడుకులు ఒత్తిడి చేశారనే ఆరోపణ తనకు మరో బిగ్ షాక్…
ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ఈరోజుకూ మెయిన్ స్ట్రీమ్ హీరో పాత్రలే వేస్తున్నా సరే, ప్రతి సినిమా ఫ్లాపు… ఇంకెన్నాళ్లో కొనసాగించలేడు… ఒకవైపు సమంత తన కొడుకు జీవితం నుంచి వెళ్లిపోవడం, చిన్న కొడుకు నిశ్చితార్థం రద్దయి, ప్రతి సినిమా ఫెయిలై, తన కెరీర్, వ్యక్తిగత జీవితం ఈరోజుకూ గాడినపడలేదు… నటి శోభితతో పెళ్లికి అంగీకరించి, నిశ్చితార్థం చేసుకున్నాక నాగ చైతన్య వ్యక్తిగత జీవితం మళ్లీ పట్టాలెక్కుతుందీ అనుకునేలోపు సురేఖ ఆరోపణలతో మనస్తాపం…
అక్కినేని, నాగార్జున రేంజులో చైతూ హీరోగా స్థిరపడే దిశలో అడుగులు సరిగ్గా, స్థిరంగా పడటం లేదు… అదే కుటుంబానికి చెందిన సుమంత్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు… సుప్రియ, సుశాంత్ కూడా పెద్ద పేరు సంపాదించలేదు… వెరసి అక్కినేని ఫ్యామిలీ కొన్నేళ్లుగా ఏదో ఓ ఇష్యూతో, ఫెయిల్యూర్లతో సఫరవుతూనే ఉంది… తను హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ తనకు డబ్బు తెచ్చిపెడుతోంది (స్టూడియో ప్లస్ హోస్టింగ్) కానీ దాని మీద విమర్శలు, కేసులు…
అక్కినేని లెగసీని మెయింటెయిన్ చేయడం అంత ఈజీ కాదు… మద్రాసు నుంచి సినిమా పరిశ్రమను హైదరాబాదుకు తీసుకురావడంలో అక్కినేనిదే ప్రధాన పాత్ర… తన సంపదను ఆ స్టూడియో కోసమే వెచ్చించాడు… ఎన్టీయార్‌తో కూడా ఒక దశలో కయ్యం దాని గురించే… స్టూడియోను లాభాల్లో నడిపించడం ఈరోజుల్లో సులభమేమీ కాదు… కాస్త వేరే సినిమాయేతర కమర్షియల్ పోకడలకు వెళ్లినా పెద్దగా కలిసి వస్తున్నదేమీ లేదని అంటుంటారు మరి… అది చాలా టఫ్ టాస్కే… సో, అనుకోకుండా నాగార్జున కళ్లల్లో నీళ్లు తిరగడం వెనుక ఎన్ని బాధలు, ఎమోషన్స్ ఒక్కటై తన్నుకొచ్చాయో..!!
Share this Article