Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది ఓరకంగా శ్రీశ్రీ సినిమా… కానీ ఒక్క పాటా రాయలేదు… అదోరకం ‘తీర్పు’…

August 15, 2024 by M S R

రాష్ట్ర ప్రభుత్వం వినోద పన్నును రద్దు చేసిన మొదటి తెలుగు సినిమా . NTR జడ్జిగా నటించిన మొదటి సినిమా , అప్పట్లో అది అరుదైన పాత్రే… (తరువాత కాలంలో జస్టిస్ చౌదరి సూపర్ హిట్)… 1975 లో వచ్చిన ఈ తీర్పు సినిమా . సినిమాగా ఒక వినూత్న ప్రయోగం . చనిపోయిన వ్యక్తుల కంకాళాలు కోర్ట్ బోన్లోకి ఎక్కి తమ గోడును వెళ్ళబోసుకునే సరికొత్త ప్రయోగాన్ని చేసారు .

డబ్బులు ఎలా వచ్చాయో నాకు ఐడియా లేదు . విమర్శకుల , విశ్లేషకుల మన్ననలను , అభినందనలను మాత్రం అందుకుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డును పొందింది . మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది .

యు విశ్వేశ్వరరావు , మహాకవి శ్రీశ్రీల సంయుక్త ప్రయత్నం , ప్రాజెక్ట్ . వారిద్దరే ఈ సినిమా కధ , పాటలు , మాటలు , నిర్మాణం అంతా కలిసి చేసారు . విశ్వేశ్వరరావు లాయరుగా కూడా నటించారు . సావిత్రి , ముక్కామల , ప్రభాకరరెడ్డి , సంగీత , మాదాల రంగారావు ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో పాటలన్నింటినీ విశ్వేశ్వరరావే వ్రాసారు . చక్రవర్తి సంగీతాన్ని అందించారు . వాటిల్లో గొప్పగా చెప్పుకోవలసిన పాట విభాత వేళ పాట . శ్రావ్యంగా కూడా ఉంటుంది . మిగిలిన పాటలు ఆలోచింపచేసేవి లాగా ఉన్నా , పాటలుగా హిట్ కాలేదు . థియేటర్లో వినబుల్ గా ఉంటాయి .

Ads

బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకిలు పాడారు . సీతమ్మ చచ్చింది ద్రౌపది చచ్చింది సీతమ్మ బతికింది ద్రౌపది బతికింది పాట ఆరోజుల్లో కాబట్టి జనం పట్టించుకోలేదు . ఇప్పుడయితే సామాజిక బహిష్కరణ , ఆర్ధిక బహిష్కరణ చేసి ఉండేవారు .

ఈ సినిమాకు హిరో , విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు , ఉండరు . కధే హీరో , విలన్ . మా నరసరావుపేటలో ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు . థియేటర్ పేరు మా నరసరావుపేట ఫ్రెండ్సే చెప్పాలి . గుంటూరులో లిటిల్ కృష్ణాలో ఆడింది . రెండు చోట్లా చూసాను . జడ్జిగా NTR ” let the society be hanged ” అని చెప్పే తీర్పు నాకు బాగా నచ్చిన డైలాగ్ .

దురదృష్టం ఏమిటంటే ఈ సినిమా వీడియో కానీ , పాటల వీడియో కానీ యూట్యూబులో లేవు . పాటల ఆడియో మాత్రమే ఉంది . విశ్వేశ్వరరావే 1983 లో కీర్తి కాంత కనకం అనే మరో సందేశాత్మక సినిమాను తీసారు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…
  • ఆమె కథలో బోలెడు నాటకీయత… కానీ ‘క్రియేటివ్ ఫ్రీడమ్‌’పైనే భయం…
  • ప్చ్… చిరంజీవి, రాఘవేంద్రరావు, విజయశాంతి లెవల్‌లో ఆడలేదు…
  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions