తెలుగులో ఇమేజ్ దాదాపుగా ఇద్దరికీ ఈక్వల్… ఫస్ట్ కేటగిరీ కాదు, అలాగని తీసిపారేయలేం… కాబట్టి ఫుల్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణలతో సంక్రాంతి పోటీలో వాళ్లు నిలవలేరు అని అందరికీ తెలుసు… అనుకున్నట్టుగానే ఇద్దరి సినిమాలూ తేలిపోయాయి… వారసుడు తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు కానీ తమిళంలో టాక్ మిక్స్‌డ్… కాబట్టి తెలుగులో పెద్దగా వర్కవుట్ కాదు… కానీ డబ్బింగ్ ఖర్చే కదా, వచ్చినకాడికి వస్తాయి, లేకపోతే లేదు… కాకపోతే మరీ ఇలాంటి సినిమాలను తమిళంలో తీశాడేమేమిటబ్బా అనే పరువునష్టం ప్రచారం దిల్ రాజుకు మిగిలింది…
ఇక అజిత్… ఎవరు ఏమనుకున్నా సరే, తన స్టయిల్ తనది… ఎంతగా తను వద్దనుకుంటున్నా సరే, తమిళనాడులో విజయ్ వర్సెస్ అజిత్ ఫ్యాన్స్ రచ్చ ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంది… ఇప్పుడు వారసుడు, తెగింపు దాదాపు సేమ్ రేంజ్ సినిమాలు… రెండింటికీ తెలుగులో ఇప్పుడు స్కోప్ లేదు… ఇక తమిళనాట తమ ఫ్యాన్ బేస్ ఆధారంగా ఏదో అలా పోటీపడటమే… రూపాయి ఎక్కువ తక్కువ ఇద్దరికీ దాదాపు సేమ్ కలెక్షన్లు రావచ్చు… కాకపోతే ఆ రెండింటిలో ఏది బెటర్..?
అసలు ఆ ప్రశ్నే వేస్ట్… రెండూ వేర్వేరు జానర్లు… రెండూ చూడకపోయినా నష్టం లేదు… అదే కేటగిరీ… రొటీన్, ఫార్ములా, సోసో కథలు, సోసో కథనాలు… చూడాల్సిన ప్రయోగాలేమీ కావు రెండూ… నిజానికి తెగింపు కథనంలో దర్శకుడు బాగా గందరగోళానికి గురయ్యాడు, మనల్ని కూడా అదే గందరగోళంలో పడేస్తాడు… కానీ యాక్షన్ సీన్లపరంగా ఇరగదీశాడు… పలుచోట్ల హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లు ఉంటాయి…
Ads
మధ్యమధ్య చిన్న చిన్న కామెడీ బిట్లు… అజిత్ మార్క్ హీరోయిజయం… ఫైట్లు… సినిమా మొత్తం తుపాకీ కాల్పులే… దీపావళి బాణాసంచా మోతల్లాగా…!! కానీ అదొక్కటే సరిపోదు కదా సినిమా అంటే… ఓ హీరోయిన్‌ను పట్టుకొచ్చారు… మంజు వారియర్… పర్లేదు, ఓమోస్తరు పాత్ర మరీ వారసుడులో రష్మిక టైపులో కాదు… అదేమిటో గానీ హీరో అజిత్‌కు, దర్శకుడు వినోద్‌కు మంచి శృతి కుదిరింది… అంతకుముందు నెర్కొండ పార్వై, వలిమై చేశారు… ఇప్పుడు ఈ తెగింపు…
మరీ సూపర్ డూపర్ ఫార్ములా ఏమీ ఉండదు… ఫ్యాన్స్ మెచ్చేట్టుగా ఓ సినిమా తీశామా, వదిలామా… అంతే… సేఫ్ సైడ్, రిస్క్ లెస్ సినిమాలు ఇవి… నిర్మాత కూడా సేమ్… అజిత్, శ్రీదేవి నడుమ పాత ఒప్పందమేదో ఉన్నట్టుంది… అందుకే బోనీకపూర్ అడగ్గానే అజిత్ డేట్లు ఇచ్చేస్తుంటాడు… నిజానికి బ్యాంకర్ల మోసాలు గట్రా చెప్పడానికి మంచి కథే… కానీ ఆ కథను చెప్పడంలో దర్శకుడు దారుణంగా ఫెయిలయ్యాడు…
స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగుగా ఉండదు… పైగా లాజిక్ లేని సీన్లు కొన్ని, పూర్ డబ్బింగ్… అందుకే అక్కడక్కడా బోర్… ఐతేనేం, యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం థియేటర్ దడదడలాడిపోతుంది… యాక్షన్‌కూ యాక్షన్‌కూ నడుమ సినిమా పడుకుంటుంది… చిత్రమైన కథనం… విచిత్రమైన చిత్రం…!! అవునూ, ధనుష్, విజయ్, అజిత్… ఎవరూ తమ తెలుగు వెర్షన్ల ప్రమోషన్లకు ఎందుకు రావడం లేదు, చూసేవాళ్లు చూస్తారు, లేకపోతే పోనీ అనే తేలికభావనా..?!
Share this Article