.
‘‘బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సహనం అలవర్చుకుంటే మంచిది. వీళ్లకు ఇంకా బలుపు తగ్గలేదని ప్రజలు భావిస్తే మరో పర్యాయం కూడా అధికారానికి దూరంగానే ఉండవలసి వస్తుంది…’’
‘‘కాంగ్రెస్, బీజేపీల వలె బీఆర్‌ఎస్ కూడా ఒక రాజకీయ పార్టీ మాత్రమే. తెలంగాణ సమాజంపై ఆ పార్టీకి ప్రత్యేకంగా పేటెంట్ ఏదీ లేదు…’’
Ads
‘‘జగదీశ్‌రెడ్డి వంటి రాజకీయ మరుగుజ్జులకు కేటీఆర్ చిన్నసారు కావొచ్చుగానీ, ప్రజలెందుకు లెక్క చేస్తారు! కేసీఆర్‌నే ప్రజలు మట్టికరిపించిన విషయం అప్పుడే మరచిపోతే ఎలా? ’’
‘‘వయసు, అనుభవం రీత్యా కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థులను తిట్టినా ఎవరూ పెద్దగా నొచ్చుకోలేదు. కేసీఆర్ వాడిన భాషను కేటీఆర్ వాడడాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా హర్షించలేక పోతున్నాయి…’’
‘‘తెలంగాణ అస్తిత్వం ఇవాళ మాత్రమే కాదు రేపు కూడా పదిలంగానే ఉంటుంది. బీఆర్‌ఎస్ గానీ, మరొక పార్టీ గానీ ఉండొచ్చూ లేకపోనూ వచ్చు. తెలంగాణ మాత్రం సగర్వంగా నిలబడే ఉంటుంది…’’
ఇవన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న పేరాలు… కానీ అన్నీ నిజాలే… తెలంగాణ జనం అనుకుంటున్నవే… కేటీయార్ మీద ఓ వెగటు, క్షుద్ర చానెల్ ఏదో రాసింది, కూసింది, ఖచ్చితంగా తప్పే… తప్పున్నరే… కానీ దీంతో తెలంగాణ అస్థిత్వం మీదే దాడి జరుగుతున్నదనే వితండ సూత్రీకరణలు దేనికి..? మీడియా అంతు చూస్తామనే ప్రేలాపనలు దేనికి..?
కేటీయార్‌ను ఎప్పుడో పట్టాభిషిక్తుడిని చేయాలని అనుకున్న కేసీయార్ కొడుక్కి ఇంకా జనంలో యాక్సెప్టెన్సీ రావడం లేదని గమనించి, వెనక్కి తగ్గాడు… కేటీయార్ వాడుతున్న భాష ఇంకా ఇంకా ఆ యాక్సెప్టెన్సీ లెవల్‌ను దెబ్బతీస్తున్నదనే సోయి కేటీయార్ క్యాంపులో కొరవడింది… లేకపోతే ‘‘వందా, వాడి బొందా’’ వంటి నీచ స్థాయి భాష ఏమిటి.,.?
హరీష్ రావు కూడా చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని రోజూ విమర్శిస్తాడు గానీ సబ్జెక్టుకు పరిమితమవుతాడు... నిందలు, తిట్లు, కుసంస్కార నీచ భాష ఉపయోగించడు...
ఒక సీఎంను తిట్టడం సంస్కారమా అని అప్పట్లో కేసీయార్ ఉరిమేవాడు గుర్తుందా..? మరి రేవంత్ రెడ్డి సీఎం కాదా..? అది ఓ వ్యక్తిని కాదు, ఆ కుర్చీని తిట్టడం కాదా..? ఇదేమంటే రేవంత్ భాష బాగుందా అనే వాదన వినిపిస్తారు… ఇది సరేగానీ… వంద సీట్లు గెలుస్తామని ఓ పార్టీ ముఖ్యమంత్రి ధీమాను వ్యక్తం చేస్తే అది తప్పెలా అవుతుంది..?
- అది కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు విశ్వాసాన్ని ప్రోది చేసే ప్రయత్నం కావచ్చు… తనకు అంతర్గతంగానూ, అధిష్ఠానం నుంచి ఎదురవుతున్న సవాళ్లకూ ఓరకమైన సమాధానం చెప్పే ప్రయత్నం కావచ్చు… జరిపించే సర్వేలతో వచ్చిన నమ్మకం కావచ్చు… కానీ ఇదే కేటీయార్ క్యాంపు ప్రచారం చేయలేదా అప్పట్లో ‘‘సారు, కారు, పదహారు’’ అని…
అంటే… కేసీయార్, పార్టీ కారు గుర్తు, పదహారు ఎంపీ సీట్లు అని… ఏమైంది..? దెబ్బకు కారు బోరుకొచ్చింది… సారు కూడా షెడ్ దాటి బయటికి రావడం లేదు… అంతెందుకు..? మొన్నటి లోకసభ ఎన్నికల్లో ఏమొచ్చింది…? గుండు సున్నా…!
చివరగా… అదే రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే…. తెలంగాణలో క్షీణించిన ఎర్ర పార్టీలు, ఆరేడు సీట్లకు పరిమితమైన మజ్లిస్‌ను పక్కనబెడితే… బీఆర్ఎస్ మాత్రమే కాదు, కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన ఉనికిని కలిగిన పార్టీలే… ఇందులో ఒక పార్టీ తెలంగాణను ఇచ్చింది… మరో పార్టీ దానికి సహకరించింది… సో, ఏ పార్టీకి గుండుగుత్తాగా పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ..!!
Share this Article