Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీకి ఇరువైపులా గోకుడు… ధాటిగా జనంలోకి వెళ్లే కౌంటర్ వాయిస్ లేదు…

April 29, 2024 by M S R

తెలంగాణ రాజకీయాల్లో వేడి బాగా పెరిగింది… అంతా అయిపోయింది అనుకున్న బీఆర్ఎస్, రోజుకో ప్రముఖ నాయకుడు వదిలేసి వెళ్లిపోతున్నా, తనకు ఓ జీవన్మరణ సమస్య అన్నట్టుగా సర్వశక్తులూ ఒడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తోంది… సరిగ్గా నడవలేని స్థితిలోనూ కేసీయార్ వీలైనన్ని సభల్లో పాల్గొంటున్నాడు… ఇంకోవైపు హరీష్, కేటీయార్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు…

చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు రాకపోతే పార్టీకి రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులో వాళ్లకు తెలుసు… అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని కార్నర్ చేస్తూ, కొత్తకొత్త పాయింట్లతో దాడి చేస్తున్నారు బీఆర్ఎస్ ముగ్గురు ముఖ్యులు… ఐతే ఆ ముగ్గురు తప్ప మీడియాలో మరో బీఆర్ఎస్ ప్రముఖుడెవ్వరూ కనిపించడం లేదు, వినిపించడం లేదు…

కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ మీద లేవనెత్తుతున్న పాయింట్లు బీజేపీని డిఫెన్స్‌‌లో పడేస్తున్నాయి… లేదా అంత ధాటిగా జవాబులు చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది… ఉదాహరణకు, మా గోదావరి నీళ్లను ఎత్తుకుపోయే కుట్ర చేస్తోంది బీజేపీ… అనే విమర్శకు సరైన జవాబు బీజేపీ క్యాంపు నుంచి కరువైంది… ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించే నదుల అనుసంధానం మోడల్ ఖచ్చితంగా తెలంగాణకు నష్టమే…

Ads

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేస్తారు లేదా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు అని మరో విమర్శ… దీనికి కూడా సరైన క్లారిఫికేషన్ లేదు బీజేపీ క్యాంపు నుంచి… కేంద్ర పాలిత ప్రాంతం చేసి, ఇండియా రెండో రాజధానిగా చేస్తే తెలంగాణ సమాజం ఏమీ వ్యతిరేకించదు… అది హైదరాబాద్ అభివృద్ధికే బెటర్… కానీ మళ్లీ ఆంధ్రాతో ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని తెలంగాణ అంగీకరించదు… అదే జరిగితే బీఆర్ఎస్‌ నెత్తిన పాలుపోసినట్టే…

మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీనే టార్గెట్ చేసుకుంది… బీఆర్ఎస్ పని అయిపోయినట్టే గానీ బీజేపీకి మంచి సంఖ్యలో సీట్లు వస్తాయని పార్టీ అంతర్గత అంచనా కావచ్చు… పార్టీకి మంచి సంఖ్యలో సీట్లు రాకపోతే తెలంగాణ కాంగ్రెస్‌లో ఇష్యూస్ ఎక్కువ అవుతయ్… అందుకే రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు… ఇతర రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్‌గా తిరుగుతూనే తెలంగాణలోనూ దాదాపు ప్రతి ఎంపీ సీటులోనూ సభ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు…

ఏకంగా రిజర్వేషన్ల అంశాన్ని గోకాడు… బీజేపీని ఒకరకంగా డిఫెన్స్‌లో పడేశాడు… చివరకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తెర మీదకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది… ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను తీసేస్తాం అనే బీజేపీ పాయింట్‌ను చాకచక్యంగా మొత్తం రిజర్వేషన్లనే రద్దు చేస్తారు అనేవైపు డైవర్ట్ చేయగలిగింది కాంగ్రెస్… ఒకవైపు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అంటూ జాతీయ స్థాయిలో అటాక్ సాగుతుండగా, దానికి రిజర్వేషన్ల అంశాన్ని కూడా సెగ పెరిగేలా పెంచింది కాంగ్రెస్…

మోడీ మళ్లీ వస్తే ఇక ఎన్నికలే ఉండవు, రాజ్యంగం రద్దు చేస్తారు, రిజర్వేషన్లను తీసేయం అనే క్లారిటీలు కూడా ఇవ్వలేదా బీజేపీ..? కిషన్‌రెడ్డి ప్రెస్ మీట్లు, మీటింగుల్లో ప్రసంగాలు అంత ధాటిగా ఉండవు, జనంలోకి పోవు… బండి సంజయ్ మాటలు సగం అర్థమే కావు… ఈటలకూ మీడియాలో పెద్ద ప్రయారిటీ రావడం లేదు… రఘునందన్ బాగానే మాట్లాడగలడు కానీ తనూ మీడియాకు ఆనడం లేదు…

bjp

వోట్లు, సీట్లు పెంచుకునే అవకాశాలున్నా, ఎంతోకొంత సానుకూలత ఉన్నా, బీజేపీ ప్రచారపర్వంలో మాత్రం సరైన సామర్థ్యం, నైపుణ్యం చూపించడం లేదు… తాజాగా పత్రికల్లో ఫస్ట్ పేజీలో యాడ్స్ స్టార్టయ్యాయి… పెంక మీంచి పొయ్యిలకు అని ఒకేసమయంలో బీఆర్ఎస్‌ను, కాంగ్రెస్‌ను దాడి చేసే రీతిలో ఉన్నాయవి… (పెనం నుంచి పొయ్యిలోకి)… బాగానే ఉన్నయ్, కానీ నిర్దిష్టంగా గోదావరి నీళ్లు, ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, రిజర్వేషన్లు, రాజ్యాంగం వంటి అంశాల్లో క్లారిటీ, ఎదురుదాడి లేకపోతే వీటితోనూ ఫాయిదా లేదు…

అమిత్ షా శిబిరం రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో రేవంత్ మీద ‘ఫేక్ వీడియో’ అంటూ కేసు పెట్టింది… తద్వారా తమ మాటల్ని వక్రీకరించారని జనానికి చెప్పడం ఉద్దేశం… కానీ దీనివల్ల చర్చ మరింత బలంగా జరుగుతుంది, అదీ బీజేపీకే నష్టం… అమిత్ షా గానీ, మోడీ గానీ తెలంగాణ పర్యటనలకు వచ్చినప్పుడు ఇలాంటి అంశాలపై సరైన వివరణ సమర్థంగా ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది… లేకపోతే ఈ రాష్ట్ర బీజేపీ నాయకులతో డిఫెన్స్ సాధ్యం కాదు..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions