Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!

August 23, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి, అదేదో భారత వ్యతిరేక కుట్రలకు ప్రయత్నించబోతే… విదేశాంగ మంత్రి జైశంకర్ అడ్డుకుని, దేశాన్ని కాపాడాడు అన్నంత బిల్డప్ ఇస్తున్నాయి తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.., కాబోయే పొత్తుందార్లు..!!

పాపం, బండి సంజయ్‌ను తీసేసి, మళ్లీ గులాబీ దోస్త్ కిషన్‌రెడ్డికే పగ్గాలు ఇచ్చారు, తరువాత రాంచందర్‌రావును తెచ్చారు… ఉస్మానియా నుంచి ఎమర్జైన ఆయన అధ్యక్షుడయ్యాక కాస్త పార్టీ గాడిలో పడుతుందని ఆశపడితే… అది మరింత గాడి తప్పి, ప్రస్తుతానికి ఎనిమిది చీలికలుగా వర్ధిల్లుతోంది…

Ads

ఈ ఫ్రస్ట్రేషన్ తను రేవంత్ మీద విమర్శల్లో చూపిస్తున్నట్టున్నాడు, కానీ తన విమర్శల్లో పంచ్ లేదు, డైరెక్షన్ లేదు, ఫైర్ లేదు… సేమ్, హరీష్, కేటీయార్ విమర్శల్లాగే ఉత్తదే దుమ్ముదుమారం… సబ్జెక్టు ముఖ్యం బిగిలూ…

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం మీద విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది, దట్సాల్, ఇక ఎవరూ ఈకలు పీకే ప్రయత్నం చేయకూడదు… ఆ సోయి కూడా తెలంగాణ బీజేపీకి లేకుండా పోయింది… ఏమైనా సీరియస్ ఎలిగేషన్స్ ఉంటే కేంద్ర పార్టీ చూసుకుంటుంది, లేదా వదిలేయాలి…

ధర్మపురి అర్వింద్ అయితే మరీ విదేశాంగ శాఖ ప్రెస్ సెక్రెటరీ స్థాయిలో మాట్లాడేస్తున్నాడు… రేవంత్ రెడ్డి న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాఁ మామ్దానీని కలవాలని ట్రై చేశాడు, తను వెరీ డేంజరస్, యాంటీ ఇండియా, మరి తనను కలిసే విషయాన్ని రేవంత్ రెడ్డి అఫిషియల్ టూర్ ప్లాన్‌లో ఎందుకు సూచించలేదు, ఏమిటి కుట్ర అంటున్నాడు…

మామ్దానీ ఎవరనో తెలుసా..? ఈమధ్య న్యూయార్స్ మెయిన్ ఇండియా డే పరేడ్ అవాయిడ్ చేశాడు కానీ, పాకిస్థాన్ డే ఈవెంట్‌కు హాజురయ్యాడు… పాకిస్థానీ మూలాల్ని మెచ్చుకున్నాడు, పాకిస్థానీలను పొగిడాడు, ఉమర్ ఖలీద్‌కు మద్దతు లేఖ రాశాడు… ఆ ఖలీద్ ఎవరో తెలుసా, 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉపా కింద బుకైన యాంటీ నేషనల్… విదేశాంగ శాఖ కూడా ఈ మామ్దానీ మీద ఓ కన్నేసి ఉంది… అందుకే రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు, మామ్దానీతో భేటీకి ప్రయత్నించినట్టు ట్రిబ్యూన్ కూడా రాసింది…

……… ఇదీ అర్వింద్ చెప్పింది… మామ్దానీ పక్కా యాంటీ ఇండియా, అందులో డౌట్ లేదు… పక్కా పాకిస్థానీ సపోర్టర్, డౌట్ లేదు… పాకిస్థానీ మూలాలున్న టెర్రరిస్టులకూ మద్దతుదారు, డౌట్ లేదు… కానీ తనను కలిస్తే… ఇక ఒక అమెరికన్ సిటీ మేయర్, ఒక ఇండియన్ స్టేట్ చీఫ్ మినిస్టర్ గ్యాంగప్ అయిపోయి దేశానికి వ్యతిరేక కుట్రలు చేసేస్తారా..? సాధ్యమేనా..? హాస్యాస్పదం…

రేవంత్ రెడ్డి

కాక్రోచ్ పార్టీ దెబ్బకు, జెన్‌జీ ధాటికి… మోదీ ప్రభుత్వం ఏ నీడ చూసినా అంతగా భయపడిపోతున్నదా..? ఒకరకంగా ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానాలు పార్టీ, మోదీ ఇజ్జత్ తీస్తున్నవి… ఇదంతా జార్డ్ సోరోస్ కుట్ర, డీప్ స్టేట్ కుట్ర అనేవి ఉత్త శుష్క వాదనలు… ఇక బీజేపీ అధ్యక్షుడి మాటలు మరింత విచిత్రం…

రేవంత్ లండన్‌లో భారత వ్యతిరేక పుస్తకాలు రాసిన ఒకరిద్దరిని కలిశాడట… మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీలు కలిస్తే వాళ్లను అవాయిడ్ చేయలేదట, దాంతో రేవంత్ రెడ్డి కుట్రదారేనట… ఇది మరో హాస్యాస్పదం… లండన్ పర్యటనను విదేశాంగ శాఖ వ్యతిరేకించలేదయ్యా మహానుభావా..?

అసలు పాకిస్థానీ మూలాలున్న ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న ముఫ్తీ మెహబూబాతోనే పొత్తు పెట్టుకుని, అధికారం చలాయించింది కదా, మరి బీజేపీ కూడా దేశవ్యతిరేక శక్తేనా..? సో, ఇవన్నీ పోచుకోలు విమర్శలు, కేసీయార్ మెప్పు కోసం తన్లాడటం మానేసి, గులాబీ భాష బదులు, సొంత కాషాయ భాషలో ఆలోచించి, సరిచూసుకుని స్పందిస్తే బెటర్… కాదా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
  • SIR – తెలంగాణ Chief Electoral Officer కి పద్మశ్రీ ఇవ్వాలి మోదీజీ…!!
  • ఆర్గానిక్ హిట్..! టాలీవుడ్‌కు ఓ ‘మంచిబాట’ చూపిన ఇరుముడి..!
  • నా ముఖం వీడియో తీయనివ్వకండి… మా నాన్న చూస్తే చచ్చిపోతాడు మేడమ్!”
  • Not Appropriate – రేవంత్ USA పర్యటనపై కేంద్రానికి డౌట్లు అర్థరహితం..!
  • ఈమె గుర్తుందా ? అథ్లెటిక్ ట్రాక్ వదిలేసి, రీల్ కెరీర్ ఎంచుకుని ఫ్లాప్ !!
  • ఓహ్, ఈమెను తరిమేయడం వెనుక ఇంత ‘స్పిరిట్’ ఉందా?
  • Awarapan-2 … అనూహ్యంగా హిట్ – భారీగానే వసూళ్లు !!
  • Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions