Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘తెలంగాణ ఫ్యామిలీ రిజిష్టర్’ – ఏమిటి? ఎవరికి? ఎందుకు?

July 28, 2026 by M S R

 

‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ! …. కానీ, ఏమిటిది..? దేనికి ఉపయోగం..? ఓసారి చూద్దాం…

రాష్ట్ర ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలను వేగంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ వివరాల ధృవీకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ, ఒకే రకమైన ప్రామాణికమైన రికార్డును అందుబాటులోకి తెచ్చేందుకు ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ (Telangana Family Register) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి 172 నంబర్ జీవో జారీ చేశారు.

Ads

మీసేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్! పౌరులు తమ కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా పొందేందుకు వీలుగా మీసేవ (MeeSeva) పోర్టల్ ద్వారా ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ (Telangana Family Register Certificate) అనే కొత్త సర్వీస్‌ను ప్రవేశపెడుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారాగానీ, మీసేవ ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత యూజర్ చార్జీలు చెల్లించి ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉత్తర్వుల్లోని ప్రధాన విషయాలు! పౌరసరఫరాల శాఖ కమిషనర్ పర్యవేక్షణలోని ఆహార భద్రత కార్డ్ (Food Security Card / Ration Card) డేటాబేస్ నుండి ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివరాలను సేకరించి ఈ రిజిస్టర్‌ను తయారు చేస్తారు. రిజిస్టర్‌లో ఉండే వివరాలు….

> ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఇది రేషన్ కార్డు నంబర్‌గానే ఉంటుంది)
> యజమాని పేరు
> కుటుంబ సభ్యులందరి పేర్లు
> యజమానితో ఉన్న సంబంధం
> వయస్సు, పుట్టిన తేదీ
> జెండర్
> ఆధార్ నంబర్
> ప్రస్తుత నివాస చిరునామా (ఇంటి నంబర్, వీధి, గ్రామం/ వార్డు, గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ, మండలం, జిల్లా).

ఎవరు దరఖాస్తు చేయాలి?
రిజిస్టర్‌లో పేరు ఉండి, 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యుడు మాత్రమే తమ కుటుంబ రిజిస్టర్ కాపీ కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తులో రేషన్ కార్డ్ నంబర్‌ను ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న రెండు పని దినాలలో సర్టిఫికెట్ అందించబడుతుంది.

రేషన్ కార్డులోని చిరునామా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్‌కి అప్లికేషన్ ఆటోమేటిక్‌గా రూట్ అవుతుంది. పరిశీలన అనంతరం తహసీల్దార్ తమ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్‌ను ఆమోదిస్తారు. అనంతరం పౌరులు మీసేవ నుండి డిజిటల్ సంతకం కలిగిన సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హక్కులు, ఆస్తుల పంపిణీకి వర్తించదు! ఈ జీవోలో ప్రభుత్వం ఒక కీలక స్పష్టతనిచ్చింది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్, సర్టిఫికెట్ కేవలం రేషన్ కార్డ్ ఆధారంగా రూపొందించిన కుటుంబ సభ్యుల రికార్డు మాత్రమే. ఈ సర్టిఫికెట్ ద్వారా ఆస్తులపై ఎలాంటి చట్టపరమైన హక్కులు, టైటిల్ లేదా ప్రయోజనాలు సిద్ధించవు. అలాగే దీనిని వారసత్వ ధృవీకరణగా పరిగణించరు. ప్రభుత్వ పథకాల లబ్ధికి ప్రత్యేక హక్కుగా కూడా దీనిని కోరలేరు.

సాంకేతిక అనుసంధానానికి ఆదేశాలు! ఈ నూతన సేవలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొని రావడానికి ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ పౌరసరఫరాల శాఖ డేటాబేస్‌తో అవసరమైన Application Programming Interface (API) ఇంటెగ్రేషన్ ఏర్పరచాలని, సివిల్ సప్లైస్ కమిషనర్ దీనికి తగిన సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెవెన్యూ అధికారులకు దీనిపై స్పష్టమైన సూచనలిచ్చి, అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.
– మానేటి ప్రతాపరెడ్డి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిష్టర్’ – ఏమిటి? ఎవరికి? ఎందుకు?
  • సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ! ‘ముచ్చట’ ముందే చెప్పింది!!
  • అపర కుబేరులు ఐతేనే పిల్లనిస్తారట! గొంతెమ్మ పేరెంట్స్ !!
  • పాడలేను అన్న పాటకే… జాతీయ పురస్కారం అందుకున్న నైటింగేల్!
  • సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!
  • ప్రధాని మోడీ ఈ మూడో దఫా పదవీకాలం పూర్తి చేయగలడా..?!
  • ఇప్పుడంటే బొద్దింకలు ! ఈ ‘జెంటిల్‌మేన్’ ఎప్పుడో చర్చించాడు !!
  • గౌరీ ప్రియ ! ఇకపై పాత్రల ఎంపికే ముఖ్యం – పొరపడితే వైష్ణవి కథే !!
  • అత్తింటి అపోలోఉండగా… కోయంబత్తూరు ఎందుకు రాజా..!!
  • తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా ! రేవంత్ ‘పెద్ది’ పరిణతి !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions