.
మేడిగడ్డ బరాజ్ మెడలు విరిగినా… అన్నారం, సుందిళ్ల కూడా పనికిరాకుండా పఢావు పడినా… తెలంగాణ రైతాంగం వ్యవసాయంలో తమ రికార్డులను తామే తిరగరాస్తోంది… కాళేశ్వరంతోనే తెలంగాణ రైతును ఉద్దరించినట్టు కేసీయార్ క్యాంపు చేసుకునే ప్రచారాలు ఉత్త హంబగ్ అని తేలిపోతోంది…
పెద్ద పెద్ద లోతైన గణాంకాలు అవసరం లేదు గానీ… ఈసారి వానాకాలం సాగు విస్తీర్ణం కొత్త రికార్డు… అదీ కాళేశ్వరం వినియోగంలోకి లేకపోయినా..! ఎంత అంటే..?
Ads
ఇప్పటికే 67 లక్షల ఎకరాల్లో వరి… ఇంకా పెరుగుతుంది… ఈ సమయానికి సాగయ్యే సాధారణ విస్తీర్ణం 56 లక్షల ఎకరాల వరి విస్తీర్ణంతో పోలిస్తే 11 లక్షల ఎకరాల పెరుగుదల… అన్ని పంటల సాగు విస్తీర్ణం పరిశీలించినా … ఈ సమయానికి 1.25 కోట్ల ఎకరాల్లో సాగు జరిగేది, ఇప్పుడది 1.32 కోట్ల ఎకరాల్ని దాటిపోయింది…
ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే అర్థమైపోతుంది…
- ఇది వానాకాలం పంటల స్థితి… మొత్తం వ్యవసాయ సంవత్సరం పూర్తయ్యాక లెక్కలు తీస్తే ఈసారి తెలంగాణ రైతు కొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు… స్థూల ఉత్పత్తిలో, దిగుబడిలో కూడా..!
మొన్న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లినప్పుడు ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 2014కు ముందు జస్ట్ 15 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండేదని, కేసీయార్ వచ్చాక అది కోటీ ఇరవై లక్షలకు పెరిగిందని చెప్పుకొచ్చాడు…
రాష్ట్ర విభజన నాటికి వరి విస్తీర్ణం 15 లక్షల ఎకరాల వరిసాగు కాదు… అక్షరాలా అరకోటి ఎకరాలు… ఇదీ అసలు లెక్క… (ప్రభుత్వం అప్పట్లో పబ్లిష్ చేసిన గణాంకాలే…)
2013- 14లో 19.95 లక్షల హెక్టార్లు… అంటే 50 లక్షల ఎకరాల్లో వరి… ఈ చిన్న ఉదాహరణ ఎందుకు చెప్పుకోవడం అంటే…? బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చిన ఏదో ఫిగర్ చెప్పేసి, ఆహా ఓహో అని ప్రచారం చేసుకోవడం, అబద్దపు లెక్కల్ని జనం చెవుల్లో పెట్టడం గురించి..!
- కేసీయార్ పాలన పూర్తయ్యాక… అంటే కాళేశ్వరం బండి నొగలు విరిగాక కూడా తెలంగాణ రైతు వరి మాత్రమే కాదు, అన్ని పంటల సాగులో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడని పైన అంకెలు చెబుతున్నాయి… అంటే రాష్ట్ర వ్యవసాయ విస్తీర్ణం పెరుగుదలలో కాళేశ్వరం వాటా ఏమీ లేదని తేలిపోతోంది కదా…
సరే, పంటల కోణంలో ఓసారి పరిశీలిస్తే… వరిలో సన్నాల సాగు పెరుగుతోంది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన, ఇస్తున్న బోనస్ ప్రైస్ ఫలితం అది… ఇక్కడ పండిన సన్నాలను ఇక్కడ జనమే తినాలనే భావనతో ప్రభుత్వం రేషన్ పథకంలో దొడ్డుబియ్యం బదులు సన్నబియ్యం ఇస్తోంది… ఖజానాపై భారం పడుతున్నా సరే…
ఫలితంగా గతంలో దొడ్డు రేషన్ బియ్యాన్ని అమ్ముకునే కార్డుదారులు ఇప్పుడు తామే ఆ బియ్యాన్ని తీసుకుపోయి వండుకుంటున్నారు… మార్కెట్‌లోనూ సన్నబియ్యం ధరలు తగ్గాయి…
వానాకాలం సాగు విశ్లేషిస్తే… వరి, మొక్కజొన్న పెరుగుతోంది… కానీ పత్తి తగ్గడం లేదు… చిరుధాన్యాల సాగు కూడా తగ్గుతోంది… అపరాలు, నూనెగింజల సాగు పడిపోతోంది… ప్రభుత్వం అటువైపు రైతుల్ని ప్రోత్సహించే విధానాలు, ప్రోత్సాహకాల్ని ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోంది..!! యూరియా వంటి సప్లయ్స్ విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంది…
- చివరగా… రుణమాఫీలు, రైతుభరోసా, సన్నాలకు బోనస్… అన్నీ కలిపితే… అది హరిత తెలంగాణ..!!
Share this Article