Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేటీయార్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్…! ఏం జరుగుతోంది..?!

November 20, 2025 by M S R

.

ఫార్ములా వన్ కేసులో కేటీయార్ సహా నిందితులందరి ప్రాసిక్యూషన్‌కు, తదుపరి చర్యలకు గవర్నర్ అనుమతించాడు… జుబ్లీ హిల్స్ ఎన్నికలో రేవంత్ రెడ్డి గెలుపు కూడా దీని వెనుక తరచి చూస్తే ఓ ప్రధాన కారణం… అందుకే ఇన్నాళ్లూ (10 వారాలపాటు) గవర్నర్ దగ్గర ఆగిన ఫైల్ హఠాత్తుగా క్లియరైంది… జుబ్లీ హిల్స్ ఎన్నికకూ దీనికీ లింకె ఏమిటీ అంటారా..? కాస్త వివరాల్లోకి వెళ్దాం…

ఏసీబీ కేసు దర్యాప్తు చేసినా, పలుసార్లు కేటీయార్, అరవింద్ కుమార్ వంటి ప్రధాన బాధ్యుల్ని ప్రశ్నించినా… అరెస్టు జోలికి వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి వెళ్లలేదు… ఎందుకు వెళ్లలేదు, ఎందుకు ఆగాడు, గవర్నర్ కోర్టులోకి బాల్ ఎందుకు పంపించాడు అనేది ఆసక్తికరం…

Ads

నగరంలో బీఆర్ఎస్‌కు, కేటీయార్ నాయకత్వానికి బాగా ఆదరణ ఉంది… ఒకవేళ బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్తే చాలా ఫాయిదా అని బీజేపీలోని బీఆర్ఎస్ ముఖ్యులు బీజేపీ హైకమాండ్ వద్ద ఓ రాంగ్ పిక్చర్ ప్రొజెక్టు చేశారు… అందుకే కేటీయార్ పట్ల బీజేపీ హైకమాండ్ కాస్త సాచివేత ధోరణిని చూపింది… ఒక దశలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనం అనే వార్తలు కూడా వచ్చాయి… కేటీయార్ సోదరి కవిత కూడా దాన్ని ధ్రువీకరించింది…

  • కానీ ఏమైంది..? ఒక దశలోె 10 శాతం వోట్ల తేడాతో జుబ్లీ గెలుపు సులభం అనుకున్న స్థితి నుంచి ఏకంగా 25 వేల భారీ మైనసుతో రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టింది బీఆర్ఎస్… వ్యూహరాహిత్యాలకు తోడు కేటీయార్ నాయకత్వ బలహీనతలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది…

సో, నగరంలో బీఆర్ఎస్‌కు, కేటీయార్‌కు ఇప్పుడంత భేషైన సీన్ ఏమీ లేదని బీజేపీ హైకమాండ్‌కు అర్థమైంది… ఇక్కడ కేసీయార్ దురవస్థనూ చెప్పుకోవాలి… రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు కేసీయార్ ఇక రాజకీయంగా రిటైర్ అయిపోయినట్టే… పైగా అనారోగ్యం… మాగంటి  గోపీనాథ్‌కు స్వయంగా వెళ్లి నివాళి అర్పించిన కేసీయార్ జుబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కనీసం ఓ గంటసేపు కూడా పాల్గొనలేదు… చివరకు వోట్లు వేయాలని కనీస బాధ్యతగా అప్పీల్ కూడా చేయలేదు…

  • ఇదంతా ఏం చెబుతోంది..? రేవంత్ రెడ్డి చెప్పినట్టే నేను రిటైరయ్యాను అని కేసీయారే చెబుతున్నట్టు, ఆమోదిస్తున్నట్టు..!

రెండేళ్లుగా జనంలో లేడు, ఇక వచ్చే సూచనలూ లేవు… కవిత ఆల్రెడీ బయటికి బహిష్కరింపబడి, కేసీయార్ చుట్టూ ఉండే ఉపగ్రహాల జాతకాలు తవ్వి జనానికి చెబుతోంది… అదీ పార్టీకి డ్యామేజీయే… నష్టనివారణకు కూడా కేసీయార్ ప్రయత్నించడం లేదు… ఇక మిగిలింది హరీష్, కేటీయార్… చివరకు ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలాగా చీలిపోతారో, మిగిలిపోతారో… లేదా హరీష్ క్రమేపీ తనూ పార్టీకి దూరమై ‘ప్రత్యామ్నాయం’ వైపు మొగ్గుతాడో…

ఈ స్థితిలో బీఆర్ఎస్‌తో చెలిమికన్నా… అది దెబ్బతినే స్పేసులోకి తాను జొరబడటం మేలని బీజేపీ ఓ అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది… వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్- మజ్లిస్‌తో ఒంటరిగా పోరాడటం బీజేపీ ప్రాథమిక లక్ష్యం ఇప్పుడు…

  • సో, కేటీయార్‌ను ఫిక్స్ చేయడం, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి కేడర్ ఆకర్షించడం తదుపరి ఆలోచన… లేదా ప్రెజర్ బాగా పెంచి, హరీష్ రావును మరో షిండేలా మారేలా పురిగొల్పడం… ఆ దిశలోనే కేటీయార్ మీద ఓఆర్ఆర్ లీజు స్కామ్ కూడా బయటికి తీస్తారు…

ఇక్కడ రేవంత్ రెడ్డి మరింత తెలివిగా… ఒకవైపు కాంగ్రెస్ నాయకుడిగా బీజేపీతో పోరాడుతూనే … మరోవైపు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంతో సఖ్యత నెరుపుతూ డిఫెన్స్ ల్యాండ్స్, పారడైజ్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ల వంటివి సాధించేస్తున్నాడు… కేంద్రం 2047 విజన్‌కు తగినట్టు, తెలంగాణ అభివృద్ధికీ సేమ్ విజన్ ప్రమోట్ చేస్తూ… మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులకు సాయం తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు…

వెరసి ఏం జరిగింది..? రేవంత్ బాగా గ్రిప్ సాధించేస్తున్నాడు పార్టీ మీద, ప్రభుత్వం మీద, పాలన మీద… మరోవైపు ఒకప్పటి కేటీయార్ హవా కాస్తా క్రమేపీ క్షీణ దశకు చేరుతోంది పార్టీ నిర్వహణలో, ఎన్నికల వ్యూహంలో, జనాన్ని కనెక్ట్ కావడంలో, కేడర్‌ను నడిపించడంలో..!

సెంట్రల్ ఇంటలిజెన్స్ వంటి ఏజెన్సీల నుంచి ఫీల్డ్ రిపోర్టు తెప్పించుకున్న బీజేపీ హైకమాండ్‌కు తెలంగాణలో రియల్ పొలిటికల్ సిట్యుయేషన్ అర్థమైంది… ఇన్నాళ్లూ బీఆర్ఎస్ అనుకూల బీజేపీ నేతలు తమ కళ్లకు గంతలు కట్టారని కూడా బోధపడింది…

కేటీయార్ మీద చర్యలకు గవర్నర్ వోకే, బీఎల్ఎన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి చాలు… ఇక అరవింద్ కుమార్ మీద చర్యలకు రెండు పర్మిషన్లు కావాలి… ఒకటి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి, అది ఇచ్చేసినట్టే… మరొకటి డీఓపీటీ అనుమతి… ఎలాగూ గవర్నర్ పర్మిషన్ అంటేనే కేంద్రం వోకే చెప్పినట్టు కదా, సో, ఆ క్లియరెన్స్ కూడా వచ్చేసినట్టే..!!

  • సో, ఇంకా కేటీయార్, బీఆర్ఎస్, కేసీయార్ అనే జపం బదులు సొంతంగా కదులుదాం, కేటీయార్ మీద ఎంత ప్రెజర్ పెరిగితే, బీఆర్ఎస్ కేడర్ ఎంతగా కకావికలం అయితే అంతగా ఫాయిదా తీసుకుందాం అనేది బీజేపీ ఆలోచన… కేటీయార్ కొన్నాళ్లు జైలులో ఉంటే… కేడర్ మరింత చెదిరిపోతుంది, స్థానిక ఎన్నికల్లో మరింత దెబ్బ తీయవచ్చుననేది మరో భావన… చూడాలిక కాలం ఏం చెబుతుందో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
  • ఆ ఎలుకల చెవుల్లో కోరికలు చెప్పుకోవాలి… తరువాత గణేషుడికి చేరతాయి…
  • 500 ఏళ్ల అబద్ధం… తిమ్మరుసును రాయలు శిక్షించనే లేదు… 
  • సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
  • ‘సింహస్వప్నం’… పేరుకు జగపతిబాబు హీరో… కృష్ణంరాజుదే హవా…
  • చేదు వాస్తవం- నిష్ఠుర నిజం… కేసీయార్ పాలన తీరుతోనే ‘సింగరేణి చీకట్లు’…
  • ట్రంపు ఎంత గోకుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే..?
  • ఒక అచ్యుతానందన్… ఒక శిబూ సోరెన్… పద్మాల్లో మోదీ మార్క్ పరిణతి..!
  • దర్శకుడు మారుతికి కొత్త తలనొప్పి… ఫ్యాన్స్ నుంచి కొత్త నిరసన…
  • ప్రియుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు… ఇదీ అలాంటి స్టోరీయే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions