.
నిన్ననే చెప్పుకున్నాం కదా, అల్లు అర్జున్ మీద కేసు మరింత బిగసుకుంటోందని… అదే జరుగుతోంది…
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుని, రేవతి అనే మహిళ మృతిచెందడం, ఆమె కొడుకు ఐసీయూలో ఉండటం… థియేటర్ బాధ్యులతోపాటు అల్లు అర్జున్ మీద కూడా కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించడం తెలిసిందే…
Ads
సరే, అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు… కానీ రెగ్యులర్ బెయిల్‌కు దిగువ కోర్టును ఆశ్రయించాల్సిందే మళ్లీ…
ఇన్నాళ్లు సంధ్య థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ రాక సమాచారం పోలీసులకు ఇచ్చిందనీ, పోలీసులో బందోబస్తు పెట్టలేక ఫెయిలయ్యారనే ప్రచారం సాగింది…కానీ ఆ షో సందర్భంగా సినిమా టీం హీరో హీరోయిన్లతో సహా ఎవరూ రావద్దని, వస్తే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కష్టమని పోలీసులు సంధ్య థియేటర్‌కు రాసిన లేఖ తాజాగా విడుదలైంది… ఈ లేఖ విషయం హైకోర్టులో బెయిల్ వాదనల సందర్భంగా సబ్మిట్ చేశారా లేదా తెలియదు…
కానీ ఈ తొక్కిసలాటకు పూర్తి కారణం పోలీసుల ఫెయిల్యూరో అనే ప్రచారం పెరిగేసరికి ఇక పోలీసులు ఇంకాస్త సీరియస్‌గా తీసుకున్నారు…
సెక్యూరిటీ, క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు లేకపోయినా ఓ పాపులర్ హీరోను రప్పించడం థియేటర్ తప్పు, తన కోసం క్రౌడ్ విరగబడతారని తెలిసీ అక్కడికి రావడం హీరో తప్పు అనేది పోలీసుల వాదన…
సో, ఇప్పుడు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ రద్దు కోసం పోలీసులు ప్రయత్నిస్తారని ప్రచారం జరిగింది… అది రుజువు కాలేదు కానీ..?
థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని పోలీసులు తాజాగా సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు… 1979 లో లైసెన్స్ జారీ చేసినట్టుగా ఆ నోటీసులో ఉంది…
ఏయే కారణాలతో థియేటర్ ఫెయిల్యూర్ ఉందో చెబుతూ, మూడు పేజీల నోటీసు జారీ అయ్యింది… సరే, వాళ్లు లాయర్లను పెట్టుకుంటారు, సమాధానం ఇస్తారు, కొన్నాళ్లు పంచాయితీ నడుస్తుంది…
(ఈ నోటీసు 12న జారీ చేసినట్టుగా తేదీ వేసి ఉంది… అంటే అయిదు రోజులు అప్పుడే అయిపోయాయి)
ఐతే ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారనడానికి ఇవన్నీ సంకేతాలు… రెగ్యులర్ బెయిల్ వాదనల సందర్భంగా ఇవన్నీ విచారణకు వస్తాయి…
ఐతే మరొక్కసారి… బెనిఫిట్, ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్టు మంత్రి అప్పట్లో ప్రకటించాడు కదా… ఆ ఆదేశాలు విడుదలయ్యాయా..? విడుదలయితే మరి సుదర్శన్ థియేటర్ (సంధ్యకు ఇటువైపు, అదే సిట్యుయేషన్ ఉంటుంది)లో 20న మరో ప్రీమియర్ షోకు ఎవరు అనుమతి ఇచ్చినట్టు..? పోలీసులకు ఈ విషయం తెలుసా..?
Share this Article