పదే పదే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి తెలంగాణలో… కేసీయార్ హైదరాబాద్ పాతబస్తీని పూర్తిగా విడిచిపెట్టేశాడు… ఒవైసీ మీద ప్రేమో, భయమో గానీ కరెంటు బిల్లులు ఎవరూ కట్టరు, నీటి బిల్లులు ఎవరూ కట్టరు… అసలు పాతబస్తీలో ప్రభుత్వమే లేదు అనేది వాటి విమర్శల సారాంశం… అంటే పాతబస్తీలో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి… బిల్లులు కట్టినా, కట్టకపోయినా… మజ్లిస్‌కు కోపం రాకూడదనీ, ముస్లిం వోట్లు పోకూడదని మొత్తానికి అధికార యంత్రాంగమే పనిచేయడం లేదని విపక్షాలు, ప్రత్యేకించి బీజేపీ పదే పదే విమర్శిస్తూ ఉంటుంది…
దీనికి మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలోనే సమాధానమిస్తూ… ఓల్డ్ సిటీలో కరెంటు చోరీని నిరూపిస్తే బిల్లులన్నీ మేమే కడతాం అని సవాల్ విసిరాడు… 95 శాతం అధికారిక కనెక్షన్లు అని చెప్పాడు… దీనికి తెలంగాణ జేఏసీ సోషల్ మీడియా వేదికగా సూపర్ కౌంటర్ ఇచ్చింది… చార్మినార్, ఆస్మాన్‌గఢ్, బేగమ్‌బజార్ డివిజన్లలో (హైదరాబాద్ దక్షిణం) డిస్ట్రిబ్యూషన్ లాసెస్… అంటే సరఫరా, పంపిణీ నష్టాలను అధికారిక గణాంకాలతో వివరించింది… సరఫరా, పంపిణీ నష్టాలు ప్లస్ వాణిజ్య నష్టాలు… వాణిజ్యనష్టాలు అనగా బిల్లు ఎగవేతలు లేదా కరెంటు చౌర్యం…
Ads
చూశారు కదా… తెలంగాణ రాష్ట్ర సగటు సరఫరా నష్టాల శాతం కేవలం 9 శాతం కాగా, హైదరాబాద్ బేగమ్‌బజార్‌లో ఇది 35 శాతం, చార్మినార్‌లో 38 శాతం, అస్మాన్‌గఢ్‌లో ఏకంగా 39 శాతం ఉన్నాయి… అంతేకాదు, అధికారిక లెక్కల స్క్రీన్ షాట్ కూడా తన పోస్టులో పొందుపరిచింది… మరి ఇప్పుడు అక్బరుద్దీన్ ఏమని సమాధానం ఇవ్వాలి..?
ఈ నష్టాల విలువ ఏటా సుమారు 700 నుంచి 800 కోట్లు అని అంచనా… ఇందులో నిజంగానే టెక్నికల్ లాసెస్ కొన్ని తీసేసినా సరే, ఏటా 500 కోట్ల మేరకు వాణిజ్య నష్టాలుంటయ్… మరి అక్బరుద్దీన్ ఈమేరకు తనే కట్టేస్తాడా..? ఇంకా నిరూపించాల్సింది ఏముంది..? సర్కారు అంకెలే చాలా స్పష్టంగా ఈ నష్టాల శాతం ఎంతో చెబుతూనే ఉందిగా… విచిత్రం ఏమిటంటే, ఈ విమర్శల్ని పదే పదే చేసే బీజేపీకి మాత్రం ఈ కౌంటర్ చేతకాలేదు… తెలంగాణ జేఏసీ ఆ పనిచేసి చూపించింది… సబ్జెక్టుల మీద అధ్యయనం లేని తీరు బీజేపీకి ఇప్పటికైనా సమజైందా..? అఫ్‌కోర్స్, కాంగ్రెస్ ఏ సోయీ ఉండదు,..!!
Share this Article