.
చిన్న వార్తే అనిపించవచ్చు, కానీ బాగుంది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో వచ్చే 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రముఖులకు, అతిథులకు తెలంగాణ గుర్తుండేలా ఏమైనా కానుక, గుర్తు ఇవ్వాలి కదా…
అదీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలి కదా… అందుకని అతిథులకు ప్రత్యేక బాస్కెట్లు తెలంగాణ కళలు… సంస్కృతికి అద్దంపట్టేలా ఇవ్వనున్నారు అనేది వార్త…
Ads
అందులో ఏముంటాయి..,?
ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు , పెట్టుబడిదారులు హాజరుకానున్నారు… వీరి కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా స్వాగతం పలకనుందిహైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికి గుర్తిండిపోయేలా సాంప్రదాయ కిట్లు , రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ స్పెషల్ బాస్కెట్లలో పోచంపల్లి ఇక్కత్ , ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు… పోచంపల్లి చేనేత విశిష్టత, నాణ్యత తెలిసినవే కదా… అదే బాస్కెట్లలో చేర్యాల నకాషి (పెయింటింగ్స్) కూడా ఉంటాయి.., స్క్రోల్ పెయింటింగ్స్‌గా పిలిచే ఈ చిత్రాలు తెలంగాణ యూనిక్ పెయింటింగ్స్…

అంతేకాదు, హైదరాబాద్ పాతబస్తీ స్పెషల్స్ అత్తరు, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు కూడా ప్రత్యేకం… హైదరాబాద్ పాతబస్తీ ముత్యాలు ఎంత ఫేమసో, అక్కడ దొరికే సెంట్లు, పర్‌ఫ్యూమ్స్ (అత్తరు) కూడా అంతే ఫేమస్… ప్రపంచంలో అత్తర్లు దొరకని దేశం అంటూ ఏమీ ఉండదు కానీ పాతబస్తీ అత్తరు పరిమళానికి ఓ యూనిక్‌నెస్ ఉంటుంది…
![]()
అదేవిధంగా ప్రత్యేక డిజైన్‌తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్‌లో మహువ లడ్డులు, సకినాలు, అప్పాలు, బదామ్ కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి… ఈ సమిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు…

ఇది మహువా లడ్డూ… అంటే ఇప్ప లడ్డూ… ఈమధ్యే దీని పోషక విలువల గురించి ప్రధాని మోడీ కూడా ఎక్కడో ప్రస్తావించాడు… ఐరన్ డెఫిషియెన్సీ, హీమోగ్లోబిన్ కొరత, రక్తహీనతతో బాధపడే పిల్లలు, గర్భిణులు, మహిళలకు ఇవి చాలా ఆరోగ్యకరం… స్వయంసహాయక సంఘాల ద్వారా వీటిని చేయించి, పంపిణీ చేస్తున్నారు… కమర్షియల్ అమ్మకాలు కూడా పెరిగాయి…

ఇది బాదం కీ జాలి… స్వీట్… ఇదీ హైదరాబాద్ పాతబస్తీ స్పెషల్… బాదం, జీడిపప్పు, చక్కెరతో చేస్తారు… లేస్ లైక్ డిజైన్‌తో చేస్తారు… హైదరాబాదీ ఫుడ్ కల్చర్‌కు సింబల్… గుడ్… అతిథుల కోసం ఉద్దేశించిన కిట్ బాగుంది… తెలంగాణతనంతో..!!
Share this Article