అసలు తెలుగు తెలిసిన, తెలుగు ప్రధాన కార్యదర్శే కావాలని సీఎం అనుకుంటే కదా… నిన్నటిదాకా సోమేష్‌కుమార్ ఎందుకున్నాడు తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా..? అందుకని అర్వింద్ కుమారా..? రామకృష్ణారావా..? వీరిలో తెలుగువాడు కాబట్టి రామకృష్ణారావుకే ఎక్కువ చాయిస్ అనే విశ్లేషణలూ వేస్ట్… నిజానికి రామకృష్ణారావు మంచి చాయిసే కానీ అర్వింద్ కుమార్ కూడా గులాబీ శిబిరానికి సన్నిహితుడే…
తెలంగాణను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టకుండా, తన సామర్థ్యంతో నెట్టుకొస్తున్నాడు రామకృష్ణారావు… కేసీయార్ బ్యాచ్‌కు కూడా తను బాగా కావల్సినవాడే… కానీ అర్వింద్‌కుమార్ అంటే కేటీయార్‌కు సాఫ్ట్ కార్నర్ కాబట్టి తనకు ఏమైనా చాయిస్ దొరుకుతుందేమో అనుకున్నారు చాలామంది… కానీ ఈ ఇద్దరినీ కాదని, మధ్యలో శాంతకుమారి హఠాత్తుగా, అనూహ్యంగా ఆ కుర్చీలో కూర్చుంది… ఎవరూ ఊహించలేదు ఇది…
నిజానికి సీనియారిటీని ప్రామాణికంగా తీసుకోవాల్సిన పనేమీ లేదు చీఫ్ సెక్రెటరీ పదవికి… సీఎం ఇష్టం… సీనియారిటీని తోసిపుచ్చి, తమ ఆలోచనల తీరుకు శృతి కలుస్తుందనుకున్న ఏ ఆఫీసర్‌నైనా తీసుకోవచ్చు… కాకపోతే జూనియర్లు, సీనియర్లందరితోనూ కలిసి పనిచేయాల్సిన బాధ్యత, అవసరం కొత్త సీఎస్‌పై ఉంటుంది…
Ads
రాణి కుముదిని (కార్మికశాఖ) జూన్‌లో రిటైర్ అవుతుంది, కానీ పెద్దగా లైమ్‌లైట్‌లో లేదామె… రజత్ కుమార్ (ఇరిగేషన్) నవంబరులో రిటైర్‌మెంట్… కేసీయార్‌కు అనుకూల వ్యక్తే… కానీ ఈ పోటీలో ఎక్కడో, ఎందుకో వెనకబడిపోయాడు… శాంతికుమారి (ఫారెస్ట్ శాఖ) సర్వీస్ ఏప్రిల్ 2025 వరకూ ఉంది… సునీల్ శర్మ (ఇంధనశాఖ) సర్వీస్ మే 2024, రామకృష్ణారావు (ఆర్థికశాఖ) సర్వీసే ఆగస్టు 2025 వరకూ, అర్వింద్ కుమార్ (మున్సిపల్ శాఖ) జూనియర్ కాబట్టి 2026 ఫిబ్రవరి వరకూ సర్వీస్ ఉంది…
వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, అశోక్‌కుమార్ సెంట్రల్ సర్వీసులో ఉన్నారు… అఫ్ కోర్స్, కేసీయార్ కావాలనుకుంటే రాష్ట్రానికి తిరిగి తీసుకురావడం పెద్ద ఇష్యూ ఏమీ కాదు… గతంలో శాంతికుమారికి సీఎం కార్యాలయంలో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉంది… సీఎం టీం మీద, సీఎం ఆలోచనల తీరు మీద ఆమెకు పూర్తి అవగాహన కూడా ఉంది… మూడీగా ఉంటూ, తన పనేదో తను చేసుకుంటూ వెళ్లే వివాదరహితం ఆమె… అందరితోనూ బాగానే ఉంటుంది… కానీ ఎవరితో పడలేదో ఏమో గానీ ఆమెను లైట్ తీసుకునేవాళ్లు సీఎంవోలో… ఆమె కూడా ఆ సీఎం ఆఫీసు నుంచి బయటికి వచ్చేసింది… లైమ్‌లైట్‌లో లేకుండా ఫారెస్ట్‌లో పనిచేసుకునేది…
ఇప్పుడామె ఏకంగా చీఫ్ సెక్రెటరీ అయిపోయింది… మూడునాలుగు రోజులు ఉండిపోయే టైపు కూడా కాదు… ఏప్రిల్ 2025 దాకా సర్వీస్ ఉంది… గతంలో ఆమెను చిన్నచూపు చూసి, ఆమె సీఎంవో నుంచి వెళ్లిపోయేలా వ్యవహరించిన వాళ్లంతా ఇప్పుడు ఆమె చెప్పుచేతల్లో పనిచేయాల్సి ఉంటుంది… ఇంట్రస్టింగు… రాబోయే తెలంగాణ ఎన్నికలు కూడా ఆమె హయాంలోనే జరగబోతున్నాయి… సో, తెలంగాణ తొలి మహిళా సీయెస్ కు *ముచ్చట* అభినందనలు…
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఒక చర్చ… కేసీయార్‌కు అత్యంత ఇష్టుడైన సోమేష్‌ను ఏం చేస్తారనేది… ఏముంది..? ఫార్మల్‌గా వెళ్లి ఏపీలో జాయినవుతాడు… అక్కడ శ్రీలక్ష్మి దగ్గర నుంచి చాలామంది సీఎస్ పోస్టుకు రెడీగా ఉన్నారు… సో, తనను జగన్ పెద్దగా ఎంటర్‌టెయిన్ చేయడు… టైమ్ బీయింగుగా జాయినైపోయి, కేసీయార్ గనుక సలహాదారు పోస్టు ఇస్తే, హైదరాబాద్‌కు వచ్చేస్తాడు… అంతే… కేసీయార్ కదా, అలాంటివాళ్లకు ఏదైనా ఇస్తాడు… తోటి అధికార్లకు ఆయనంటే పెద్దగా పడదు, ఎంకరేజ్ చేయకపోవచ్చు… సో, ఇక చేసేదేమీ ఉండదు కానీ జనాన్ని పీడించే ధరణి వంటి పాపం ఊరకే పోదు… నాలుగు శాంతి జపాలు, యాగాలు చేయించుకుంటే బెటర్..!!
Share this Article