కొట్టుకతిన్నదే బాల్యం~~~~~~~~~~~~~~~
ఈ మాగికాలంల
చెల్కమీద దొరికే తిండి మస్తు.
Ads
జామ కాయలు
దోస కాయలు
గంగరేగు వంఢ్లు
చింత కాయలు
పుంటి కూర పూలు…
దేనికయినా
నెఱీ పులుపుకైతె
ఇంత ఉప్పుకారం అంటించి
కొస నాలుకకు తాకిస్తే.. అదే అతి మధురం.
పుస్తకాల సంచిల
సెలవస్తె లాగు జేబులల్ల
ఉప్పు పొట్లం, కారప్పొట్లం ఎప్పుడుండేది.
కోమట్ల దుకాండ్ల ఏం ఉంటుండే గనుకా
మా అంటె రసగుల్లలు, బొంగులు, పిప్పరమెట్లు.
అదే చెల్కమీదికివోతె అరొక్కతీరు కాయలూ పండ్లూ.
ఈ చెట్టీచెట్టు తిరిగి ఈడిగీలవడి సంపాయించి
కొట్టుకతిన్నదే తిండి – కొనుక్కతిన్నది ఏమి తిండి..!
ఒక్కమాటల జెప్పాలంటె–
అప్పటిది పచ్చి తిండి – ఇప్పటిది పిచ్చి తిండి..!!
ఇది… మన ఆహారం – మన విహారం.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
(పుంటి కూర పూరెక్కలు ఉప్పుకారంతో తినుడు ఒకనాటి పద్ధతి)
Share this Article