Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంపై కూడా అబద్ధాలే..!!

November 8, 2023 by M S R

👉అబద్దం: తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ “నంబర్ 1”

👉నిజం: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటి (CEA) తాజా నివేదిక (2023) ప్రకారం దేశంలో తెలంగాణ స్థానం “నంబర్ 10”.
********************

👉“తలసరి విద్యుత్ వినియోగం” అభివృద్దికి సూచికగా భావిస్తారు. కాబట్టి దేశంలోనే తెలంగాణ అభివృద్ది చెందిన రాష్ట్రాల్లో “అగ్రస్థానం”లో ఉంది అని చెప్పడం ఈ ప్రచారం వెనుక ఉద్దేశ్యం.

👉ఒక అబద్దాన్ని పదే, పదే చెబుతూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిజాన్ని కూడా పదే పదే చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ “నంబర్-1” ప్రచారంలో నిజానిజాలు చూద్దాం…!
********************

👉సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ (CEA) తాజా నివేదిక:

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ తన తాజా వార్షిక నివేదిక (2023) ను ప్రచురించింది. ఇందులో టేబుల్ 9.9 లో 2021-22లో రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా తలసరి విద్యుత్ వినియోగ వివరాలు పొందుపరిచింది.

👉ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తలసరి విద్యుత్ వినియోగ పరంగా తెలంగాణ స్థానం 10. అంటే అగ్రస్థానానికి ఆమడ దూరంలో ఉన్నాం…!
***************

👉CEA నివేదిక ప్రకారం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు:

1. గోవా,
2. పంజాబ్,
3. ఒరిస్సా,
4. గుజరాత్,
5. చత్తీస్గర్,
6. హర్యానా.

కేంద్రపాలిత ప్రాంతాలు:
7. డయ్యూ & డామన్,
8. దాద్రా నాగర్ హవేలీ,
9. పుదుచ్చేరి.
*********
10. తెలంగాణ
*********

👉సి‌ఈ‌ఏ వార్షిక నివేదిక (2023) లింకు క్రింద ఇస్తున్నాం:

https://cea.nic.in/wp-content/uploads/general/2022/GR_Final.pdf

👉పై నివేదికలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల తలసరి విద్యుత్ వినియోగం వివరాలకై టేబుల్ 9.9 చూడండి.
************

👉తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ వినియోగ వృద్ది రేటు పరంగా తెలంగాణ పరిస్తితి ఉమ్మడి రాష్ట్రంలో కన్నా మరింత దిగజారింది.
*****

👉మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇక్కడ విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనపడుతుంది కదా? అని అనుమానం రావచ్చు.

👉 నిజమే… తెలంగాణ ఒక్కటే కాదు, 2015 తరువాత దేశం మొత్తం విద్యుత్ సరఫరా పరిస్తితి మెరుగైంది. దీనికి కారణం దేశంలో గతంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడం, అడపా దడపా సమస్యలున్నా మొత్తం మీద బొగ్గు సరఫరా మెరుగవడం ముఖ్య కారణాలు.

👉ప్రస్తుతం దేశంలో 20 కి పైగా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు లేవు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు నామమాత్రం. బహిరంగ మార్కెట్ లో విద్యుత్తును కొనగలిగే ఆర్ధిక స్థోమత ఉంటే ఆ రాష్ట్రాలకు కూడా విద్యుత్ కొరత ఉండదు.
**********

కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, రాత్రికి రాత్రి పరిస్తితి మారి మనం దేశంలోనే “నంబర్-1” అయ్యామనే ప్రచారం “నంబర్-1” అబద్దం.

**********
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టి‌జే‌ఏ‌సి)
**********

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions